Kailash Kher
-
కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కైలేష్ ఖేర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మ్యూజిక్ కన్సర్ట్‌లో పాట పాడుతున్న ఆయనపై ఇద్దరు యువకులు బాటిల్‌తో దాడి చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాలు.. ప్రస్తుతం బెంగళూరులో హంపీ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా ‘హంపీ ఉత్సవాలు’ వేడుకలను నిర్వహించారు. జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో గాయకుడు కైలాశ్ ఖేర్ పాల్గొని హిందీ పాటలు ఆలపించారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై ఆయన పాటలు పాడుతుండగా ఇద్దరు యువకులు ఆగ్రహంతో ఆయనపై వాటర్ బాటిల్ విసిరారు. అయితే ఆ బాటిల్ కైలాష్కు సమీపంలో పడటంతో ప్రమాదం తప్పింది. బాటిల్ తనవైపు పడినప్పటికి కైలేష్ ఖేర్ అదేది పట్టించుకోకుండ తన ప్రదర్శను కొనసాగించారు. అనంతరం స్టేజ్‌పై ఉన్న సెక్యూరిటీ ఆ బాటిల్‌ను తీసేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన యువుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయన మొత్తం హిందీ పాటలే పాడుతున్నారని, కన్నడ పాట పాడటం లేదనే ఆగ్రహంతోనే బాటిల్ విసిరినట్లు సదరు యువకులు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ తారకరత్న గురించి గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్ -
కైలాష్ ఖేర్ ‘సూఫీ పాట’కి మంచి స్పందన
ప్రస్తుత జనరేషన్‌ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం ‘మ్యాడ్’. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్‌లుక్‌లో అందరినీ ఆకర్షించిన మ్యాడ్ మూవీ తాజాగా ఓ సుఫీ పాటతో తన ప్రత్యేకతను చాటుకుంది. తెలుగు పాటల్లో చాలా అరుదుగా కనిపించే సుఫీ పాట ‘మ్యాడ్’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘బందిషీ ఖాతల్ దిల్ కీ’ అంటూ సాగే ఈ పాట కైలాష్ ఖేర్ పాడారు. ఈ పాటతో కైలాష్ ఖేర్ గొంతు తెలుగు ప్రేక్షకుల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకుంది. మోహిత్ రెహ్మానిక్ స్వరపరచిన ఈ సుఫీని శ్రీమాన్ శ్రీమనస్వి రచించారు. మోదెల టాకీస్ బ్యానర్‌పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మాతలుగా.. లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో రూపోందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రస్తుతం వేగంగా జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ‘కైలాష్ ఖేర్ ఈ పాటను పాడటానికి ఒప్పుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమాలో ఓ ఎమోషనల్ సన్నివేశంలో ఈ పాట వస్తుంది. కథలోని ఫీల్కి సుఫీ పాట అయితే కొత్తగా ఉంటుందని అనుకున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ చాలా బాగుంది. కైలాష్ ఖేర్ పాట విన్నాక మాకు చాలా సంతోషంగా ఉంది’ అని డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని అన్నారు. -
అప్పుడు ట్రంప్ డ్యాన్స్ చేయాలి: సింగర్
-
అప్పుడు ట్రంప్ డ్యాన్స్ చేయాలి: సింగర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా తన పాటకు డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నట్లు ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ తెలిపారు. ట్రంప్ ఆయన సతీమణి మెలానియా సహా ఆయన సలహాదార్లు ఇవాంకా ట్రంప్, జారేద్ కుష్నర్తో కలిసి భారత్‌లో రెండురోజులు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24న ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లోని ఆహ్మదాబాద్‌కు చేరుకుంటారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అతి పెద్ద స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’..! ఈ సందర్భంగా కార్యక్రమంలో వివిధ రకాల కార్యక్రమాలతో పాటు ప్రముఖ బాలీవుడ్ గాయకులు పాటలు పాడనున్నారు. వారిలో కైలాష్ ఖేర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను పాట పాడుతుండగా.. ట్రంప్ నా పాటకు చిందులేయాలని కోరుకుంటున్నానని’ ఏఎన్ఐతో పేర్కొన్నారు. తన పాట ‘జై జై కారా.. జై జై కారా స్వామీ దేనా సాథ్ హమారా’తో ప్రారంభమై, ‘అగాడ్ బం-బమ్ లాహిరి’తో ముగుస్తుందని తెలిపారు. ఇక మొతేరా స్టేడియంలో ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని.. అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడి మోదీ’కి ఏమాత్రం తీసిపోకుండా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
మీటూ : కైలాష్ ఖేర్‌పై మరో గాయని ఆరోపణలు
-
మీటూ : కైలాష్ ఖేర్‌పై మరో గాయని ఆరోపణలు
ముంబై : పలు రంగాలకు చెందిన సెలబ్రిటీల చేతిలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మహిళలు బాహాటంగా వెల్లడిస్తుండటంతో మీటూ ఉద్యమం ఊపందుకుంటోంది. సుభాష్ ఘాయ్, రజత్ కపూర్, సాజిద్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులపై లైంగిక వేదింపుల ఆరోపణలు రాగా, గాయకుడు కైలాష్ ఖేర్పైనా పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలతో ముందుకొచ్చారు. తాజాగా వర్షాసింగ్ దనోహ అనే గాయని కైలాష్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని తనకెదురైన అనుభవాలను వివరిస్తూ ఆన్లైన్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. కైలాష్ తనతో గడపాలని కోరుకుంటున్నట్టు చెప్పారని వర్ష ఆరోపించారు. మరో గాయకుడు తోషి సబ్రి సైతం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. సబ్రి కారులో తనను రికార్డింగ్‌కు తీసుకువెళుతూ తనకు మద్యం ఆఫర్ చేశాడని, తనపై చేయి వేసి అమర్యాదకరంగా వ్యవహరించాడని ఆరోపించారు. తనకెదురైన అనుభవాలతో ఇక తాను సింగింగ్ కెరీర్ కోసం ఏ డైరెక్టర్‌నూ కలిసే సాహసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
నాథ్ యోగి.. నాదే!
లక్నో : బాలీవుడ్ ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గోరఖ్‌పూర్ మహోత్సవ్ కోసం నిర్వాహకులు ఓ ప్రత్యేక ఆల్బమ్‌ను రూపకల్పన చేశారు. అయితే వారు తన పాటను కాపీ కొట్టారంటూ కైలాష్ ఆరోపిస్తున్నారు. గత ఫిబ్రవరిలో ఇసా యోగా సెంటర్లో నిర్వహించిన మహాశివ రాత్రి ఉత్సవాల కోసం గేయ రచయిత ప్రసూన్ జోషి ఓ పాటను రాశారు. దానిని కైలాష్ ఆలపించారు. ఇక ఇప్పుడు గోరఖ్‌పూర్ లో మూడు రోజుల పాటు నిర్వహించే మహోత్సవం కోసం విమల్ బర్వా ఓ పాట రాయగా.. ప్రణయ్ సింగ్ దానిని పాడాడు. నాథ్ యోగి పేరిట ఆ పాట జనాల్లోకి బాగా దూసుకుపోతోంది. పాటను విన్న కైలాష్ అనుచరులు అది కాపీ అన్న విషయాన్ని అతని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కైలాష్ ఇది కాపీ రైట్ ఉల్లంఘన కిందకే వస్తుందని చెబుతున్నారు. ‘‘ విదేశాల్లో కాపీ హక్కుల ఉల్లంఘన తీవ్ర నేరం. కానీ, మన దగ్గర మాత్రం ప్రజలు ఆ అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అందుకు కారణం చట్టంపై అవగాహలేమినే. ఈ విషయంలో గోరఖ్‌పూర్ మహోత్సవ నిర్వాహకులతో న్యాయపోరాటానికి నేను సిద్ధం’’ అని కైలాష్ ప్రకటించారు. బహుశా ఈ విషయం ముఖ్యమంత్రికి తెలీకపోయి ఉండొచ్చని.. మంచి పరిపాలకుడిగా పేరున్న యోగి ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని.. అవసరమైతే తానే స్వయంగా సీఎంను కలిసి ఘటనపై వివరిస్తానని కైలాష్ అంటున్నారు. -
ఖేర్.. హుషార్..
-
ఇరవై భాషల్లో పాడాను!
కైలాశ్ ఖేర్ పాడితే పాట సూటిగా గుండెల్లోకి దూసుకెళుతుంది. సంగీతం మీద ఇష్టంతో చిన్నతనంలోనే ఇంటికి దూరమైన కైలాశ్ చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. సంగీతం మీద ప్రేమతో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించి, ఇప్పుడు దేశంలో ఓ ప్రఖ్యాత గాయకుల్లో ఒకరుగా మారారు. హిందీలో పలు హిట్ సాంగ్స్ పాడిన కైలాశ్ తెలుగు శ్రోతలకూ సుపరిచితమే. ‘జేజమ్మా... రావమ్మా’, ‘పండగలా దిగి వచ్చాడు’ వంటి పాటలతో ఇక్కడివారినీ ఆకట్టుకున్నారు. తాజాగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం కోసం ఓ పాట పాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కైలాశ్ మాట్లాడుతూ-‘‘నాకు పాటలు పాడ టంలో భాషా భేదం లేదు. ఆ పాటలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటే చాలు ఈజీగా పాడేస్తా. అందుకే ఇప్పటికి 20 పైగా భాషల్లో పాడగలిగాను. ‘నిర్మలా కాన్వెంట్’ కోసం ‘ముందు నుయ్యి-వెనుక గొయ్యి’ అనే పాట పాడా. 60, 70 దశకాల్లోని పాటలను తలపించిందీ పాట. ఇప్పటివరకూ తెలుగులో నేను పాడిన పాటలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అని చెప్పారు. -
జూలై7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మహేంద్రసింగ్ ధోని (క్రికెటర్); కైలాష్ ఖేర్ (గాయకుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహువుకు సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి జీవితంలో ఈ సంవత్సరం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఆకస్మిక మార్పులు జరగవచ్చు. అంతేకాదు, లాభదాయకమైన సంబంధాలు, అదృష్టం కలిగించే సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకోవచ్చు. అదేవిధంగా మీ బర్త్‌డేలో రెండు ఏడులు ఉన్నాయి. దీనివల్ల మీకు ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన ఉంటుంది. జరగబోయే సంఘటనలు మీకు ముందుగానే కలల రూపంలో తెలుస్తాయి. మీ వాక్కు ఫలిస్తుంది. అందువల్ల ఎప్పుడూ మంచినే కోరుకోండి. కేతుగ్రహ ప్రభావం వల్ల కొద్దిపాటి ఆందోళనలు, సమస్యలు ఎదురవ వచ్చు. అవన్నీ తాత్కాలికమే అని గ్రహించి, వైవాహిక జీవితంపై శ్రద్ధ పెట్టండి. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి. తొందరపడి ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. మీపై నిందలు, కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. లక్కీ నంబర్స్: 1,2,4,6,7; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, గోల్డెన్, శాండల్, వయోలెట్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ వారాలు. సూచనలు: రాహుకేతు జపం చేయించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం, పేదలకు, మదరసాలలోని వారికి అన్నదానం చేయించడం మంచిది. - రెహమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
నాకు మంచి గుణపాఠం...
ముంబై: నోబెల్ బహుమతి గెల్చుకున్నందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో డిన్నర్ ఉన్నాసరే .. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.. అలా చేస్తే మీ శరీరం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది.. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది.. దయచేసి మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉండకండి అని గట్టి సలహా ఇస్తున్నారు ప్రఖ్యాత గాయకుడు కైలాష్ ఖేర్. న్యూయార్క్ నుంచి వచ్చీ రావడంతోనే అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యానంటూ ఆయన కామెంట్ చేశారు. తాను ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటో ఒకదాన్ని ఆయన ఈ సందర్భంగా శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్లనే తొలిసారి గుజరాత్లో ఏర్పాటుచేసిన ఒక షోను రద్దు చేసుకున్నానని కైలాష్ తెలిపారు. ఇది తనకు మంచి గుణపాఠమని, అందుకే ఆరోగ్యం విషయంలో ఎవ్వరూ అశ్రద్ధగా ఉండొద్దని, ఎప్పటికీ ప్రపంచమంతా ఆరోగ్యంతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. తేరీ దీవానీ.. దీవానీ అంటూ సంగీతాభిమానులను మైమరపింపజేసిన గాయకుడు కైలాష్ అనారోగ్యం పాలై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
సూఫీ గాయకుడికి మోదీ అభినందనల వెల్లువ
ప్రముఖ సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలతో ముంచెత్తారు. ఆయన చీపురుకట్టలు పట్టుకుని వారణాసిలో 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో పాల్గొని వారణాసి వీధులను శుభ్రంచేశారు. ఇటీవలి కాలంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీ ఆయనే. ఇంతకుముందు ప్రియాంకా చోప్రా సహా పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొమ్మిది మందిని నామినేట్ చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం నిరాఘాటంగా సాగుతోంది. కాగా, కైలాష్ ఖేర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రధాని మోదీ ఆయనను తన ట్విట్టర్ ద్వారా అభినందించారు. వారణాసిలో చీపురు పట్టినందుకు అభినందనలని, ఇది చాలా మంచి ప్రయత్నమని తెలిపారు. Bravo @kailashkher! I congratulate you for joining Swachh Bharat Mission in Varanasi. Admirable effort. https://t.co/SbqweeAO2t — Narendra Modi (@narendramodi) December 23, 2014 -
స్వచ్ఛ భారత్ కోసం ప్రసూన్ జోషి పాట!
ముంబై: పర్యావరణ పరిశుభ్రత లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమ ప్రచారం కోసం ప్రముఖ సినీ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత ప్రసూన్ జోషి ఓ పాటను రాశారు. ఈ పాటను బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్, ప్రసూన్ జోషి కుమార్తె ఐషన్య జోషి, మరికొందరు పిల్లలు పాడారు. ఈ పాటకు విశాల్ ఖురానా సంగీతాన్ని అందించారు. పరిశుభ్రతపై మహాత్మ గాంధీ అనుసరించిన బాటలోనే నడువాలి. సమాజానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది అని జోషి అన్నారు. 'స్వచ్ఛ భారత్ కా ఇరాదా' అనే గీతాన్ని రాశారు. భాగ్ మిల్కా భాగ్ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఫనా, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్, బ్లాక్, ఢిల్లీ చిత్రాలకు కూడా పాటలు రాశారు.