అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా తన పాటకు డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నట్లు ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ తెలిపారు. ట్రంప్ ఆయన సతీమణి మెలానియా సహా ఆయన సలహాదార్లు ఇవాంకా ట్రంప్, జారేద్ కుష్నర్‌తో కలిసి భారత్‌లో రెండురోజులు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24న ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లోని ఆహ్మదాబాద్‌కు చేరుకుంటారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అతి పెద్ద స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’..!
ఈ సందర్భంగా కార్యక్రమంలో వివిధ రకాల కార్యక్రమాలతో పాటు ప్రముఖ బాలీవుడ్ గాయకులు పాటలు పాడనున్నారు. వారిలో కైలాష్ ఖేర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను పాట పాడుతుండగా.. ట్రంప్ నా పాటకు చిందులేయాలని కోరుకుంటున్నానని’ ఏఎన్‌ఐతో పేర్కొన్నారు. తన పాట ‘జై జై కారా.. జై జై కారా స్వామీ దేనా సాథ్ హమారా’తో ప్రారంభమై, ‘అగాడ్ బం-బమ్ లాహిరి’తో ముగుస్తుందని తెలిపారు. ఇక మొతేరా స్టేడియంలో ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని.. అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడి మోదీ’కి ఏమాత్రం తీసిపోకుండా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment