
కైలాష్ ఖేర్ తనతో గడపాలని కోరాడు..
ముంబై : పలు రంగాలకు చెందిన సెలబ్రిటీల చేతిలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మహిళలు బాహాటంగా వెల్లడిస్తుండటంతో మీటూ ఉద్యమం ఊపందుకుంటోంది. సుభాష్ ఘాయ్, రజత్ కపూర్, సాజిద్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులపై లైంగిక వేదింపుల ఆరోపణలు రాగా, గాయకుడు కైలాష్ ఖేర్‌పైనా పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలతో ముందుకొచ్చారు.
తాజాగా వర్షాసింగ్ దనోహ అనే గాయని కైలాష్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని తనకెదురైన అనుభవాలను వివరిస్తూ ఆన్‌లైన్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. కైలాష్ తనతో గడపాలని కోరుకుంటున్నట్టు చెప్పారని వర్ష ఆరోపించారు.
మరో గాయకుడు తోషి సబ్రి సైతం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. సబ్రి కారులో తనను రికార్డింగ్‌కు తీసుకువెళుతూ తనకు మద్యం ఆఫర్ చేశాడని, తనపై చేయి వేసి అమర్యాదకరంగా వ్యవహరించాడని ఆరోపించారు. తనకెదురైన అనుభవాలతో ఇక తాను సింగింగ్ కెరీర్ కోసం ఏ డైరెక్టర్‌నూ కలిసే సాహసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.