
బీజేపీ ప్రచారానికి రూ.400 కోట్లా?
న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేయనున్నట్టు చెబుతున్న 400 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) నేత అశతోష్ ప్రశ్నించారు. ఇది నల్లధనమా లేక బీజేపీ ఏదైనా వ్యాపారం చేసి సంపాదించిందా అని అడిగారు. బీజేపీ ఎన్నికల ప్రచారానికి అంబానీ లేదా అదానీ నిధులిచ్చారా అని నిలదీశారు. బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను తలెకెత్తుకోవద్దని పియూష్ పాండే, ప్రసూన్ జోషిలకు అశతోష్ విజ్ఞప్తి చేశారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి రూ.400 కోట్లు ఖర్చు చేయనుందని వార్తలు వచ్చాయి. ప్రచార బాధ్యతను ప్రకటనల రంగంలో ప్రముఖులైన పాండే, జోషిలకు అప్పగించినట్టు సమాచారం.