శనివారం ‘పద్మావతి’ సెన్సార్ కండీషన్ల గురించి వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో ..సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి స్పందించారు. ‘‘ పద్మావతి సినిమా పై సెన్సార్ బృందం 26 కట్స్‌ను విధించింది అన్న వార్తలు అవాస్తవం. మేము ఎటువంటి కట్స్ చెప్పలేదు. కేవలం 5 మార్పులు మాత్రమే చెప్పాం’’ అని అన్నారు.
‘తి’ కాదు.. ‘త్’.. అవును ఇక ‘పద్మావతి’ కాదు.. ‘పద్మావత్’. అదేంటీ? ఎందుకీ మార్పు? సినిమా మొత్తం పూర్తయి, రిలీజ్‌కి రెడీ అయిన సమయంలో టైటిల్‌లో మార్పేంటి? అనేకదా మీ సందేహం. ‘సెన్సార్ బోర్డ్’ ఆజ్ఞాపన ఇది. నిజానికి ఏ ముహూర్తాన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావతి’ని మొదలుపెట్టారో కానీ..అడుగడుగునా అడ్డంకులే. షూటింగ్ స్పాట్‌లో దర్శకుడు భన్సాలీపై దాడి చేయటం, సెట్స్ తగులబెట్టడం, చరిత్రను వక్రీరిస్తున్నారని, చిత్రాన్ని రిలీజ్ చేయనివ్వబోమని కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుచెప్పటం, మమ్మల్ని తక్కువ చేసే అవకాశం ఉందని రాజ్‌పుత్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేయటం, చిత్ర కథానాయిక దీపికా పదుకోన్‌ని బెదిరించటం.. ఇలా ఎన్నో ఇబ్బందులు.
ఈ కారణంగా ‘పద్మావతి’ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమాను విడుదల చేయటం కష్టం అని భావించిన చిత్రనిర్మాణ సంస్థ వయాకామ్18 ‘పద్మావతి’ సినిమాను వాయిదా వేసింది. ఈ సినిమాను సెన్సార్ సభ్యులతో పాటు కొంతమంది చరిత్రకారులు, రాజ్‌పుత్‌లను వీక్షించమని కోరారు నిర్మాతలు. ఈ నెల 28న సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి ఆధ్వర్యంలో సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూశారు. ఆ తర్వాత కొన్ని నిబంధనలు విధించారనే సమాచారం బయటికొచ్చింది. అవేంటంటే...
► ‘పద్మావతి’ సినిమా పేరును ‘పద్మావత్’గా మార్చాలి.
► సుమారు 26 కట్స్ చేయమని కోరింది.
► సినిమా మెదలైనప్పుడు, ఇంటర్వెల్‌తో పాటు కొన్ని సీన్స్‌లో ..... హెచ్చరిక జారీ చేయమని ఆదేశించింది. సతీ సహగమనం సన్నివేశాల్లో , ఘూమర్ పాటలో ఈ డిస్‌క్లైమర్‌లు వేయాలని కోరారు.
ఈ మార్పులు చేసి, మళ్లీ సెన్సార్ బోర్డ్‌కి సినిమాని సబ్మిట్ చేశాక సభ్యులందరూ వీక్షిస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ జారీ చేస్తారు. చెప్పిన మార్పులు చేస్తే సినిమాకు యు/ఏ సర్టిఫికెట్‌ను లభిస్తుందని పేర్కొన్నారట.
పద్మావతి కాదు.. పద్మావత్
Published Sun, Dec 31 2017 1:41 AM | Last Updated on Sun, Dec 31 2017 1:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment