25న ‘పద్మావత్‌’ అయ్యారే.. వెనక్కి తగ్గారే! | ‘Padmavati’ to release as ‘Padmavat’ on January 25 | Sakshi
Sakshi News home page

25న ‘పద్మావత్‌’ అయ్యారే.. వెనక్కి తగ్గారే!

Published Tue, Jan 9 2018 12:57 AM | Last Updated on Tue, Jan 9 2018 12:57 AM

‘Padmavati’ to release as ‘Padmavat’ on January 25 - Sakshi

అనుకున్నదే జరిగింది. ‘పద్మావత్‌’ ముందుకొస్తే.. కొన్ని సినిమాలు వెనక్కి తగ్గుతాయని చాలామంది అనుకున్నారు. అదే జరిగింది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘పద్మావత్‌’. పలుమార్లు వాయిదా పడుతూ, ఆదివారం వరకూ ఈ చిత్రం విడుదల అయోమయ పరిస్థితిలోనే ఉంది.

ఈ నెల 25న విడుదల చేయాలని సోమవారం చిత్రబృందం నిర్ణయించుకుంది. అదే సమయానికి అక్షయ్‌కుమార్‌ ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘అయ్యారీ’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ‘పద్మావత్‌’లాంటి భారీ చిత్రం వచ్చినప్పుడు తాము రావడం శ్రేయస్కరం కాదు అనుకున్నారో ఏమో ‘అయ్యారే’ దర్శకుడు నీరజ్‌ పాండే తమ చిత్రం విడుదలను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. బాలీవుడ్‌ కథనం ప్రకారం ‘ప్యాడ్‌మ్యాన్‌’ వెనకడుగు వేయాలనుకోవడంలేదట. ఈ నెల 25న వచ్చేయాల్సిందేనని చిత్రబృందం అనుకుంటోందట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement