Padman
-
కలబందతో శానిటరీ న్యాప్కిన్స్ తయారీ..ఆ సమస్యలకు చెక్
పీరియడ్స్.. అందరు అమ్మాయిల జీవితంలో సర్వసాధారణమైన ప్రక్రియ. కానీ ఇప్పటికీ ఎందుకో ఈ విషయంపై చర్చించడానికి పెద్దగా ఇష్టపడరు. అదేదో మాట్లాడకూడని సబ్జెక్ట్ అన్నట్లు చూస్తారు. దీని ఆధారంగా బాలీవుడ్లో ప్యాడ్‌మ్యాన్ పేరుతో ఓ సినిమాను కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. రుతస్రావం, నాప్‌కీన్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. పీరియడ్స్ సాధారణమే అయినా ఆ సమయంలో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కొందరు ఆ నొప్పిని తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఆ సమయంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు పెట్టే వాళ్లూ లేకపోలేదు. అందుకే కొన్ని కంపెనీల్లో ప్రత్యేకంగా పీరియడ్ లీవ్స్ని కూడా ప్రవేశ పెట్టారు. పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆ సమయంలో హైజీన్ మరింత అవసరం. మంచి నాణ్యత కలిగిన ప్యాడ్ మాత్రమే వాడాలి. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాడ్స్ ఎంత వరకు ఈ ప్రమాణాలు పాటిస్తున్నాయి అన్నది ప్రశ్నార్థకమే. కొందరు శానిటరీ ప్యాడ్స్ తయారు చేసేటప్పుడు వాటిని ఫైబర్ క్లోరిన్‌తో బ్లీచ్ చేస్తారు. దీనివల్ల డయాక్సైన్, ప్రమాదకరమైన కలుషితాలు విడుదలవుతాయి. వీటి కారణంగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ సమస్యలు, హార్మోన్ల సమస్యలు, ఎండోమెట్రియోసిస్, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మంచి శానీటరీ న్యాప్కిన్స్ను వాడాలి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ మనూ ప్రకాశ్ నేతృత్వంలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని బృందం తాజాగా తక్కువ ధరకే ప్యాడ్స్‌ను అందిస్తోంది. సాధారణంగా ప్యాడ్స్ తయారీకి ఎక్కువ మొత్తంలో కాటన్ అవసరం ఉంటుంది. కానీ వీళ్లు కాటన్ అవసరం లేకుండానే సిసల్(కలబంద)మొక్కను ఉపయోగించి తక్కువ ధరకు ప్యాడ్స్‌ను తయారు చేస్తున్నారు. ఇది సాధారణ ప్యాడ్స్ మాదిరిగానే చాలా సాఫ్ట్‌గా ఉంటాయని, అంతేకాకుండా వీటిని సులభంగా రీసైకిల్ చేయొచ్చని వివరించారు. -
ధీమా రెడ్డి
ఇన్నాళ్లకు కూడా బితుకు బితుకే. సిగ్గుతో చితుకు చితుకే. మూడురోజుల నెలసరి తప్పు కాదు. నేరం కాదు. పాపమూ కాదు. అది ప్రకృతి. దేహ ప్రవృత్తి. దానికి శానిటరీ ప్యాడ్ వాడాలని తెలియదు కొందరికి. తెలిసినా ధైర్యంగా కొనే ధీమా ఉండదు అందరికీ. ఊర్లో ఈ పరిస్థితిని భూమా రెడ్డి గమనించాడు. వారికి ధీమా ఇవ్వడానికి సంకల్పించాడు. ఆడపిల్లల పాలిట అతడో ప్యాడ్ మ్యాన్. ‘అంకుల్.. టెన్ రుపీస్ది ఒక డెయిరీ మిల్క్ ఇవ్వరా?’ అంటూ యాభై రూపాయల నోటు ఇచ్చింది ఓ అమ్మాయి. దుకాణందారు ఆ నోటు తీసుకుంటూండగా అందులోంచి కాగితం మడత కింద పడింది. ‘అంకుల్ ఒక విష్పర్‌ను పేపర్లో చుట్టి క్యారీబ్యాగ్‌లో పెట్టివ్వరా?’ అని రాసుంది అందులో. విష్పర్‌ను ప్యాక్ చేసి ఇచ్చాడు షాప్ యజమాని. అతనికిది కొత్తకాదు. చాలా మంది ఆడపిల్లలు అలాగే స్లిప్ మీద రాసిస్తారు. ధైర్యంగా ‘శానిటరీ పాడ్స్’ కావాలని అడగరు. ‘బిస్కెట్లు, పెన్లు, బిందీల్లా ఇదీ అవసరమే కదా! ఎందుకు గట్టిగా అడగరు. ఎందుకంత సిగ్గు? దీన్నెట్లా పోగొట్టాలి?’ అనే ఆలోచనలో పట్టాడు ఆ షాప్ యజమాని. అతని పేరు చిట్యాల భూమారెడ్డి. దుకాణదారు. జగిత్యాల జిల్లా, సారంగపూర్ మండలం, లచ్చక్కపేట అతని సొంతూరు. ఆ ఊర్లో మహిళల నెలసరి అవసరం పట్ల ఉన్న సిగ్గును, మొహమాటాన్ని దూరం చేయాలి అనుకున్నాడు అతను. అంతే కాదు శానిటరీ పాడ్స్ తయారు చేయడానికి కూడా సంకల్పించాడు. అధ్యయనం... ఆచరణ రెండేళ్ల క్రితం ఈ ఆలోచన వచ్చాక శానిటరీ ప్యాడ్స్‌కు సంబంధించి తన ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాడు. తన ఊళ్లో ఈ ప్యాడ్స్ అడగడానికి మొహమాటపడుతుంటే చుట్టుపక్కల ఊళ్లలో వీటి ఉపయోగం చాలా తక్కువగా ఉందని తెలిసింది అతనికి. నెలసరి సమయంలో శుభ్రత లోపించి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని చిన్న వయసులోనే గర్భసంచి తొలగించే శస్త్రచికిత్సకి గురైన కేసులూ ఎక్కువే అని తేలింది. వీటన్నిటికీ పరిష్కారం బయోడీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ వాడకం మీద చైతన్యం తేవడం, అలాంటి ప్యాడ్స్ తయారు చేసి తక్కువ ధరకు పంపిణీ చేయడమే అనుకున్నాడు. వాటిని తయారు చేయడమెలాగో తెలుసుకోవడానికి పరిశోధన మొదలుపెట్టాడు. ఇంటి నుంచి మొదలు భూమారెడ్డి చేస్తున్న ప్రయత్నం గురించి ఒక మిత్రుడికి తెలిసింది. ‘అలాంటి ప్యాడ్స్ తయారు చేసే యూనిట్ మహబూబ్‌నగర్‌లో ఉన్నట్టుంది కనుక్కో’ అని సూచించాడు. ఆ మాటతో మహబూబ్ నగర్ వెళ్లాడు. అప్పటి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఓ ఇరవై మంది ఫిజికల్లీ చాలెంజ్డ్ మహిళలకు ఆర్థిక ఆసరా కోసం శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే కుటీర పరిశ్రమ పెట్టించారు తన పర్సనల్ ఫండింగ్‌తో. ఆ మహిళలు తయారైతే చేస్తున్నారు కాని వాళ్లకున్న పరిమితుల దృష్ట్యా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నట్టు అర్థమైంది భూమారెడ్డికి. దాంతో ప్యాడ్ల తయారీ, మార్కెటింగ్‌కు తనెలాంటి ప్రణాళిక చేసుకోవాలో అవగతమైంది. ప్యాడ్స్ తయారు చేసే మెషీన్, మెటీరియల్ వంటి వివరాలన్నీ తీసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. మెషీన్ కోసం మధ్యప్రదేశ్ వెళ్లాడు. తాము తయారు చేసిన శానిటరీ ప్యాడ్స్‌తో భీమా రెడ్డి బృందం పరిశుభ్రమైన వాతావరణం మధ్య ఇంట్లోని హాలులోనే మెషిన్ ఫిట్ చేయించాడు. మహబూబ్‌నగర్ యూనిట్లో తను, కుమార్తె, భార్య శిక్షణ తీసుకుని అలా దాదాపు పదకొండు నెలల శ్రమ తర్వాత 2019, డిసెంబర్లో కుటీరపరిశ్రమ ప్రారంభించాడు. ప్రస్తుతం అతని యూనిట్లో నలుగురు మహిళలకు ఉపాధి కలిగిస్తున్నాడు. భూమారెడ్డి తయారు చేస్తున్నవి పూర్తి పర్యావరణహితమైనవి. ఆరు ప్యాడ్స్ ఉన్న ప్యాక్ 35 రూపాయలకు అందిస్తున్నాడు. ఒకవేళ మహిళలు ఎవరైనా వీటిని మార్కెట్ చేయాలనుకుంటే కూడా 30 రూపాయలకే అందిస్తున్నారు. ‘ఈ ప్యాడ్స్‌లో అలోవెరా, వుడ్ పల్ప్, నెట్ షీట్‌ను వాడుతున్నాం. అచ్చం ఈ మెటీరియల్‌తో ఇలాగే తయారైన బ్రాండెడ్ పాడ్స్ ఆరింటి ప్యాక్ ధర 70 రూపాయలు’ అని చెప్తున్నాడు భూమారెడ్డి. వ్యాపారం కోసం కాదు... ఉపయోగం కోసమే! ‘దీన్నో వ్యాపారంగా చూడట్లేదు మేము. ఆడవాళ్లకు ఉపయోగపడే పనిలా చూస్తున్నాం. అందుకే మా దగ్గరకు ప్యాడ్స్ కోసం వచ్చే అమ్మాయిలు ధైర్యంగా వీటి గురించి అడిగేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మగవాళ్లకూ అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ పంచాయితీ ఆఫీస్‌లో అవగాహన కార్యక్రమాలు పెట్టడమే కాదు ఇల్లుల్లూ తిరిగీ ప్యాడ్స్ వాడకం మీద, నెలొచ్చినప్పుడు పాటించే శుభ్రత గురిచీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్యాడ్స్ వాడండి అని చెప్తున్నాం కాని మా దగ్గర తయారైన ప్యాడ్సే వాడండి అని చెప్పట్లేదు’ అంటున్నారు భర్త బాధ్యతల్లో సమపాలు తీసుకున్న భూమారెడ్డి భార్య లావణ్య. ‘మహిళ అరోగ్యాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలి. ఈ ఆలోచన ఉన్నవాళ్లందరితో కలిసి పనిచేయడానికి సిద్ధం’ అంటున్నారు ఈ భార్యాభర్త. ఫెయిల్యూర్లోంచి సక్సెస్ భూమారెడ్డి ఓ మధ్యతరగతి రైతు. 2001లో ఎమ్పిటీసీగా, సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత దుబాయ్ వెళ్లి అక్కడ కన్స్ట్రక్షన్ లేబర్‌గా, ఫోర్‌మన్‌గా పనిచేసి నాలుగున్నరేళ్లకు మళ్లీ ఇండియా వచ్చాడు. మళ్లీ సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాడు. కాని రాజకీయాలు తనకు సరిపడవని తెలుసుకొని కేబుల్ టీవీ సెంటర్, కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ పెట్టుకున్నాడు. అప్పుడే ఆడపిల్లల ఇబ్బంది చూసి శానిటరీ ప్యాడ్స్ కుటీర పరిశ్రమవైపు మళ్లాడు. మొదటి నుంచీ సామాజిక స్పృహ, బాధ్యత ఎక్కువగానే ఉన్న భూమారెడ్డికి భార్య సహకారమూ తోడవడంతో దాన్నో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. చిట్యాల భూమారెడ్డి బయో డీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న భీమారెడ్డి, అతని భార్య లావణ్య... – సరస్వతి రమ -
సినిమాల్లో హింసకు తావివ్వొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సినిమాల్లో అశ్లీలత, అసభ్యత, హింసకు తావివ్వరాదని, ప్రజలపై సినిమా చూపే ప్రభావాన్ని దర్శక నిర్మాతలు తెలుసుకోవాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిత్రరంగానికి పిలుపునిచ్చారు. 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ఉపరాష్ట్రపతి సోమవారం ఇక్కడ ప్రదానం చేసి ప్రసంగించారు. ‘సినిమా శక్తిమంతమైన మాధ్యమం. సామాజిక మార్పునకు సాధనంగా వినియోగించాలి. ముఖ్యంగా యువత మనసుపై సినిమా ప్రభావం చూపుతుంది. అందువల్ల విలువలను పెంచేదిగా సినిమా ఉండాలి’ అని పేర్కొన్నారు. ‘మహిళలపై అత్యాచారం, హింస ప్రబలుతోంది. ఈ ధోరణిని ఎదుర్కోవడానికి సామాజిక సందేశం సినిమాల ద్వారా ప్రజలకు చేరాలి’ అని పిలుపునిచ్చారు. మన సినిమాలు భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పా లని సందేశం ఇస్తూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఇతర సామాజిక అంశాల కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన హిందీ చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’కుగాను అక్షయ్‌కుమార్ అవార్డును స్వీకరించారు. అవార్డులు అందుకున్న తెలుగు సినీ ప్రముఖులు.. మహానటి చిత్రంలో అత్యుత్తమ అభినయానికి కీర్తి సురేష్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు కింద ఆమె రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’ ఎంపికైనందుకు ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పురస్కారాన్ని అందుకున్నారు. రూ. లక్ష నగదు పురస్కారాన్ని ఈ అవార్డుతోపాటు అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుకు ‘చి.ల.సౌ’ చిత్రం ఎంపికైనందున చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రజత కమలం, రూ. 50 వేల పురస్కారం అందుకున్నారు. ఉత్తమ ఆడియోగ్రఫీ అవార్డు రంగస్థలం చిత్రానికిగాను ఎం.ఆర్.రాజాకృష్ణన్ అందుకున్నారు. ఈ అవార్డుతోపాటు ఆయన రజత కమలం, రూ. 50 వేల నగదు పురస్కారం అందుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును మహానటి చిత్రానికిగాను ఇంద్రాణీ పట్నాయక్, గౌరవ్‌షా, అర్చనా రావ్ అందుకున్నారు. ఈ పురస్కారంతోపాటు రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ‘అ’ చిత్ర మేకప్ ఆర్టిస్ట్ రంజిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు స్వీకరించారు. రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ‘అ’ చిత్రానికిగాను సృష్టి క్రియేటివ్ స్టూడియో, యునిఫై మీడియా స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారం కింద రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. -
ప్రతి 20 నిమిషాలకు ఓ మహిళపై లైంగిక దాడి
న్యాయం కావాలి అని అడగడం ప్రతి పౌరుడి హక్కు! జరుగుతోంది అన్యాయం అని తెలిస్తే కదా.. న్యాయం గురించి అడిగేది!! ముందు న్యాయం ఏమిటో చెప్పే కన్నా.. అన్యాయం ఏంటో చూపించాలి! దానికి బాలీవుడే దిక్సూచీ!! న్యాయం కావాలంటే .. న్యాయం చూడాలని ఎన్నో సినిమాలను ఆవిష్కరించింది!! నాలుగైదేళ్ల కిందట అనుకుంటా.. హైదరాబాద్‌లోని ‘లామకాన్’లో ఎల్జీబీటీక్యూ ఫెస్టివల్ ఏదో జరుగుతోంది. లోపలికి వెళ్లే ముందు ఆ ఇంటి ప్రహరీ గేట్‌కు.. ‘‘ప్లీజ్ లీవ్ యువర్ ప్రిజుడీస్ హియర్’’ అని రాసున్న బోర్డ్ ఉంది. అంటే భ్రమలు, భ్రాంతులు తొలగించుకొమ్మని అర్థం. ఇప్పుడు బాలీవుడ్ అదే చేస్తోంది. నాలుగు ఫైట్లు, ఆరు డ్యుయెట్లు, ఐటమ్ సాంగ్, ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, ఒక వ్యాంప్ వంటి స్టీరియో టైప్ ఫార్ములాను కత్తిరించింది. సమకాలీన సమస్యల మీద ఫోకస్ చేసింది. హీరోయిన్ అయినా.. హీరో అయినా.. ఆఖరకు విలన్ అయినా కథే! కథావసరంగా పాత్రలు పుట్టుకు రావాలి కాని పాత్రల కోసం కథ అల్లట్లేదు. సమకాలీన ఆలోచనా ధోరణులు, అనుబంధాలు, సామాజిక అంశాలనే థీమ్‌గా తీసుకుంటోంది. అలా తెరకెక్కి కమర్షియల్ హిట్లయినవి ఉన్నాయి. క్రిటిక్స్ ప్రశంసలు పొందినవి ఉన్నాయి. విదేశీ ఫిల్మోత్సవ్లలో సందడి చేసి భారతీయ సినిమా పట్ల గౌరవాన్ని పెంపొందించనవీ ఉన్నాయి. థియేటర్ల నుంచి సైలెంట్‌గా ప్రేక్షకుల మెదళ్లకెక్కి చెరగని ముద్ర వేసినవీ ఉన్నాయి. అలాంటి సినిమాల గురించి ప్రస్తావించుకోకపోతే మార్పును స్వాగతించనట్టే! పైగా వాటి గురించి చెప్పుకోవాల్సిన సందర్భం కూడా. కిందటి నెలలోనే ‘ఆర్టికల్ 15’ సినిమా విడుదలై టాక్ ఆఫ్ ది కంట్రీ అయింది. సెప్టెంబర్ 13న ‘‘సెక్షన్ 375’’ చిత్రం రిలీజ్‌కానుంది. ట్రయిలర్స్తో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. సెక్షన్ 375.. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ‘సెక్షన్ 375’ రేప్ గురించి తెలియజేస్తుంది. స్త్రీ ఇష్టం లేకుండా, ఆమె అనుమతి లేకుండా ఆమె పట్ల ఎలాంటి సెక్సువల్ యాక్ట్ జరిగినా దాన్ని రేప్ కిందే పరిగణిస్తుందీ సెక్షన్. దీనికి సంబంధించి ఆరు రకాల వివరాలనూ ఇందులో పొందుపర్చారు. ఆమెకు ఇష్టం లేకుండా, ఆమె అనుమతి లేకుండా, ఆమెను బెదిరించి, భయాందోళనలకు గురి చేసి ఆమె అనుమతి తీసుకున్నా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, పెళ్లికి ముందే ఆమెతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నా, ఆమె మానసిక స్థితి బాగా లేనప్పుడు ఆమె నుంచి అనుమతి తీసుకున్నా, దాని పర్యవసానాలు తెలియక ఆమె అనుమతి ఇచ్చినా, పద్దెనిమిదేళ్ల లోపున్న అమ్మాయి ఇష్టపడి, అనుమతి ఇచ్చినా.. జరిగిన సెక్సువల్ యాక్ట్ రేప్ కిందకే వస్తుందని ఈ సెక్షన్లో ఉంది. అలాగే ఎలాంటి సెక్సువల్ యాక్ట్‌ను రేప్‌గా పరిగణిస్తారో కూడా వివరిస్తోందీ సెక్షన్. నిజ జీవితంలోని రేప్ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ ఐపీసీ 375ను చర్చించే కోర్ట్ రూమ్ మూవీయే‘సెక్షన్ 375’. ట్రైలర్‌ను బట్టి ఒక దళిత కాస్ట్ అసిస్టెంట్‌ను సినిమా డైరెక్టర్ రేప్ చేసిన కేస్‌ను డిఫెన్స్, ప్రాసిక్యూట్ అడ్వకేట్స్ వాదిస్తూంటారు. డిఫెన్స్ లాయర్‌గా అక్షయ్ ఖన్నా, ప్రాసిక్యూటర్‌గా రిచా చద్దా నటించారు. ఈ దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక మహిళ లైంగిక దాడిని ఎదర్కోవాల్సి వస్తోందని, ప్రతి లక్షమంది మహిళల్లో 1.8 మంది మహిళలు రేప్ జరిగే పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, రేప్ చేసిన వాళ్లలో కేవలం 25 శాతం మంది నేరస్తులకు మాత్రమే శిక్ష పడ్తోందని, దాదాపు 75 శాతం కేసుల్లో నిందితులు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని ఈ సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ లెక్క చెప్తోంది. ‘‘సెక్షన్ 375’’కు అజయ్ బహెల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్టికల్ 15.. కుల మత జాతి ప్రాంత లింగ వివక్ష లేకుండా దేశంలోని పౌరులంతా సమానమే. అన్నిచోట్లా అందరికీ ప్రవేశం ఉంటుంది. అలాగని స్త్రీలు, పిల్లలు, వెనకబడిన వర్గాల వాళ్ల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలనుకున్నప్పుడు ఈ ఆర్టికల్ 15 వర్తించదు. వెనకబడిన వర్గాలను మిగిలిన పౌరులతో సమానంగా చేయడానికి ఈ ఆర్టికల్ సహకరిస్తుంది. 2014, ఉత్తరప్రదేశ్‌లోని బదాన్లో ఇద్దరు దళిత అమ్మాయిలను రేప్ చేసి, చంపి అదే ఊళ్లో చెట్టుకు ఉరేసిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. స్వతంత్రం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా ఇంకా కుల వ్యవస్థ గురించి, అది చేసే దారుణాల గురించి మాట్లాడుకునే స్థితిలో ఉండడమే విషాదం. తమ కూలి మూడు రూపాయలు పెంచమని అడిగిన పాపానికి ఇద్దరు దళిత అమ్మాయిలను రేప్ చేసి, చంపి.. వాళ్ల ఔఖాద్ అంటే వాళ్ల స్థానం ఏంటో చూపించామని విర్రవీగిన ఆ ఊరి కామందుతో తలపడిన ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ పోరాటమే ‘ఆర్టికల్ 15’. పాతుకుపోయిన నాలుగంచెల కుల వ్యవస్థ, ఓట్ల కోసం దాన్ని కాపాడుకుంటున్న రాజకీయ వ్యవస్థ.. అధికారం కోసం అట్టడుగు వర్గాలను చీలుస్తున్న పాలనా వ్యవస్థను సినిమాటిక్‌గా షో చేయకుండా వాస్తవానికి దగ్గరగా చూపించిన సినిమా. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీన్ అయి ఆడియెన్స్ అవార్డ్‌నూ అందుకుంది. ఆయుష్మాన్ ఖురానా, ఈషా తల్వార్, సయానీ గుప్తా ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకుడు. ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్కానున్నట్టు అంచనా. అలీగఢ్.. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్ నిజ జీవిత కథే ‘అలీగఢ్’ మూవీ. స్వలింగ సంపర్కం నేరమని.. తర్వాత జరిగిన ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాల ఫలితంతో నేరం కాదని చెప్పిన ఆర్టికల్ 377ను ఇండికేట్ చేసిన సినిమా ఇది. కథేంటంటే.. ప్రొఫెసర్ శ్రీనివాస్ రాంచంద్ర్ సిరాస్ హోమోసెక్సువల్ రిలేషన్‌షిప్స్‌ను వీడియో తీసి బయటపెడ్తారు కొందరు. దాంతో సిరాస్‌ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. కుటుంబ సభ్యులూ అతణ్ణి ఇంట్లోంచి వెళ్లగొడ్తారు. హ్యూమన్ ఇంటరెస్ట్ స్టోరీ ఇది. ఎల్జీబీటీ హక్కుల గురించి డిస్కస్ చేసిన చలన చిత్రం. ‘‘ఎవరి వ్యక్తిగత జీవితంలోకైనా జొరబడే హక్కు ఎవరికీ లేదు.. ఆ మనిషి సమాజానికి హాని తలపెడితే తప్ప. అలాగే స్వలింగ సంపర్కం అనేది ఒక ధోరణి కాదని, నేచురల్ సెక్స్లాగే అదీ బయాలాజికల్ ఇన్స్టింక్ట్’’ అని అర్థం చేయించే సినిమా. హన్సల్ మెహతా దర్శకత్వం వహించారు. ప్రొఫెసర్ పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ నటించారు. ఇరోస్ నౌ, అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆర్టికల్ 377 సడలింపు తర్వాత ఎల్జీబీటీ రైట్స్ మీద వచ్చిన మరో సినిమా ‘‘377’’. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది. పింక్... అమ్మాయి కట్టూబొట్టూ తీరు, వెళ్లే పార్టీలు, కలుసుకునే మనుషులను బట్టి ఆ అమ్మాయి మీద ఫలానా అని లేబుల్ వేసి.. చొరవ తీసుకొని ఒంటి మీద చేయి వేసే మగవాళ్లకు లెంప కాయ ‘పింక్’. అమ్మాయి ‘‘నో’’ అంటే ‘‘నో’’ అనే .. దానికి ఇంకా ఏ అర్థాలు ఉండవనీ.. వెదకొద్దని హెచ్చరించిన సినిమా. స్త్రీల లైంగిక హక్కులు, ఇష్టాయిష్టాల స్వేచ్ఛ గురించి మొదటి సారి స్క్రీన్ మీద చర్చించిన చిత్రం. ఆధునిక దుస్తుల్లో, అంతే ఆధునిక జీవనశైలితో ఉన్న అమ్మాయిలు మగవాళ్లతో చనువుగా మాట్లాడినంత మాత్రాన వాళ్లు పడగ్గదికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కాదని.. తీర్పునిస్తుంది. మురికి తలపులతో ఉన్న మనసులను శుభ్రంగా కడిగేస్తుంది పింక్. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. పాడ్‌మన్... బహిష్టు.. అనే మాటను గట్టిగా అనడానికి ఆడవాళ్లే సాహసించని సమాజంలో ఓ భర్త.. ఆ క్రమం చుట్టూ ఉన్న అనారోగ్య వాతావరణాన్ని గూర్చి మథనపడి.. ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం కనిపెడ్తాడు. అదే ‘పాడ్‌మన్’ సినిమా. నిజ జీవిత గాథ. రుతుక్రమం పట్ల ఉన్న అపోహలు, అంధవిశ్వాసాలకు చెక్ పెట్టి.. సైలెన్స్‌ను బ్రేక్ చేసింది. ఇదీ సినిమాకు కథాంశమే అని నిరూపించింది. నెట్‌ఫ్లిక్స్, జీ5ల్లో ఉంది. టాయ్‌లెట్.. సేమ్ అండ్ షేమ్.. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా.. గ్రామీణ భారతం.. ఆ మాటకొస్తే నగరాల్లోని స్లమ్స్‌లో కూడా మరుగుదొడ్లు లేని పరిస్థితి. రియల్‌లైఫ్‌లోని ప్రియాంక అనే నవ వధువే ఈ సినిమాకు ప్రేరణ. ఓ ఇంటి కోడలు అత్తింట్లో మరుగుదొడ్డి కట్టించుకోవడమే కథ.. అదే హీరోయిన్.. హీరో అన్నీ! ఇదీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. న్యూ బిగినింగ్.. ఇలా దాదాపు 2000 సంవత్సరం నుంచీ బాలీవుడ్ కొత్త స్క్రీన్‌ను షేర్ చేస్తోంది. మనుషులనే పాత్రలుగా మలిచి జీవితాలను ఆవిష్కరిస్తోంది. కళ్లముందు కనిపిస్తున్నా మెదడుకు ఎక్కించుకోని విషయాలెన్నిటినో కథలుగా రాసుకుంటోంది. అందరికీ తెలియాల్సిన రాజ్యాంగ అధికరణల నుంచి అందరికి కావాల్సిన మరుగుదొడ్ల వరకు ఏ చిన్న డిటైల్నూ మిస్ చేయట్లేదు. ఇలాంటి సినిమాలతో బాలీవుడ్ న్యూ బిగినింగ్‌ను స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. అక్షరం లేని, రాని చోట దృశ్యమే ఆయుధం అవుతుంది. సమస్యల అవగాహనకు సినిమాను మించిన మాధ్యమం ఏముంటుంది? అందుకే వీటిని మల్టీప్లెక్స్‌లకే కాకుండా గ్రామాల్లోని టాకీసులకూ పంపాలి. అందరూ చూసేలా చేయాలి. ఔర్ కు .. ‘ఉరి’ తీసిన కెమెరాతోనే ఇస్లామాఫోబియా ఇతివృత్తంగా ‘ముల్క్’ను, ‘హమీద్’, ‘నో ఫాదర్స్ ఇన్ కశ్మీర్’అంటూ కశ్మిరీల పోరాటాన్నీ చూపించింది బాలీవుడ్. కశ్మీరియత్ ఉనికి అవసరాన్ని చెప్పింది. ‘నిల్ బట్టి సన్నాటా’తో స్త్రీ చదువును ప్రోత్సహిస్తూనే ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’, ‘వీరే దీ వెడ్డింగ్’లతో మహిళా సాధికారత మరో కోణాన్నీ పరిచయం చేసింది. ‘ఆలిఫ్’, ‘సూపర్ థర్టి’తో అందరికీ చదువుకునే రైట్ ఉందని డాల్బీ డిజిటల్ సౌండ్‌తో నినదించింంది. వీటన్నిటినీ నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీ5, ఇరోస్ నౌల్లో వీక్షించొచ్చు. ఇలాంటి కొత్త ట్రెండ్‌తో సెట్స్ మీద ఇంకెన్ని సినిమాలున్నాయో! వేచి చూద్దాం.. ఈ చేంజ్‌కు వెల్కమ్ చెప్దాం!– సరస్వతి రమ -
దుమ్మురేపిన టాప్-5 సినిమాలు ఇవే!
సాక్షి, సినిమా : పద్మావత్ సినిమాతో బాలీవుడ్లో ఈ ఏడాది శుభారంభం మొదలైంది. దీపావళికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాపడుతూ జనవరిలో విడుదలైంది. ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. మొదటి వారాంతంలోనే 114 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది బాలీవుడ్లో ఇప్పటివరకు విడుదలైన చిత్రాలన్నంటిలో పద్మావత్ సినిమానే వీకెండ్ కలెక్షన్స్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఆ తరువాతి స్థానంలో భాగీ-2 నిల్చింది. తెలుగు సినిమా క్షణం రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ నటించారు. ఈ యాక్షన్, సస్పెన్స్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో దాదాపు 70 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించిన ‘రెయిడ్’ 41కోట్ల రూపాయలతో మూడోస్థానంలో, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్మాన్’ 40 కోట్ల రూపాయలతో నాలుగోస్థానంలో, కరీనా కపూర్, సోనమ్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ 36 కోట్ల రూపాయలతో ఐదో స్థానంలో ఉంది. -
ట్వింకిల్ ఖన్నాకు ఫిక్కి అవార్డు
ముంబై : రచయిత్రిగా దూసుకుపోతున్న బాలీవుడ్ మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఫిక్కి మహిళా సమాఖ్య ఐకాన్ అవార్డు అందుకున్నారు. సామాజిక స్పృహ కలిగి ఉన్న ట్వింకిల్ ఖన్నా సినిమా రంగానికి చేస్తున్న కృషికి గానూ ఆమెకు అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విఙ్ఞాన్ భవన్లో గురువారం జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్వింకిల్‌తో పాటు వివిధ రంగాలలో కృషి చేసిన పది మంది మహిళామణులు అవార్డులు అందుకున్నారు. రుతుక్రమం గురించి మహిళల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, పాటించాల్సిన శుభ్రత గురించి అవగాహన కల్పించేందుకు తెరకెక్కించిన ‘పాడ్‌మాన్’ సినిమాకు ట్వింకిల్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘మిసెస్ ఫన్నీ బోన్స్’, ‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ’ అనే పుస్తకాలు రచించారు. ఈ సందర్భంగా ట్వింకిల్ మాట్లాడుతూ.. ‘మహిళలు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడం కంటే ఎవరో ఒకరి వెనుక ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే అసలు సమస్య. ఇప్పటికైనా ఇలాంటి దృక్పథాన్ని వదిలి మన జీవితాల్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందంటూ’ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ట్వింకిల్.. ‘ఒక్కోసారి నేను సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నానా అనే అనుమానం కలుగుతుంది. ఒత్తిడి కారణంగానే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని’ అన్నారు. -
పి వర్సెస్ పి
టాలీవుడ్లోనే కాదు.. అటు బాలీవుడ్‌లోనూ రిలీజ్ డేట్స్ విషయంలో ‘వార్’ సహజమైంది. ‘తమ సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకునే హక్కు ప్రతి చిత్రబృందానికి ఉంటుంది’ అని అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు. ‘పద్మావత్’ వర్సెస్ ‘ప్యాడ్‌మ్యాన్’ రిలీజ్ డేట్స్ విషయంలో. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య తారలుగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పద్మావత్’. సెన్సార్ చిక్కులతో రిలీజ్ డేట్స్‌ను మార్చుకుంటూ ఫైనల్‌గా జనవరి 25కి థియేటర్స్‌లో సెటిల్ అవ్వాలనుకుంది ‘పద్మావత్’ చిత్రబృందం. చెప్పిన డేట్ (జనవరి 26)కి ఒక్కరోజు ముందుకు దూకాడు ‘ప్యాడ్‌మ్యాన్’. అంటే.. రెండు సినిమాలూ ఒకేరోజున వచ్చే పరిస్థితి. అక్షయ్‌కుమార్, రాధిక ఆప్టే, సోనమ్‌కపూర్ నటించిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’. పద్మావత్, ప్యాడ్‌మ్యాన్ ఒకేరోజున రిలీజ్ కావడం సరికాదని ఫైనల్‌గా ‘పద్మావత్’ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, ‘ప్యాడ్‌మ్యాన్’ హీరో అక్షయ్‌కుమార్ మాట్లాడుకున్నారు. కలిసి విలేకర్ల సమావేశం పెట్టారు. అప్పుడే ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్రాన్ని ఫిబ్రవరి 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు అక్షయ్‌కుమార్. అలాగే బాలీవుడ్ మూవీ ‘అయ్యారీ’ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ క్లాష్ వద్దనుకుని ఫిబ్రవరి 16న రిలీజ్ చేశారు. అంతేకాదు అనుష్క శర్మ ‘పరి’ (మార్చి 2న విడుదల) సినిమాతో బాక్సాఫీస్ క్లాష్ వద్దనుకుని ముందుగా అనుకున్నట్లుగా ‘హేట్‌స్టోరీ 4’ చిత్రాన్ని మార్చి 2న కాకుండా వారం రోజులు ముందుకు (మార్చి 9) జరిపాడు ఆ చిత్రదర్శకుడు విశాల్ పాండ్య. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ప్యాడ్ మ్యాన్
-
స్క్రీన్మ్యాన్
‘ప్యాడ్‌మ్యాన్’ చిత్రంతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేయడానికి ‘రుతుస్రావ పారిశుద్ధం ఉద్యమం’లో ఓ అడుగు వేశాడు. ఆ స్ఫూర్తితో పశ్చిమబెంగాల్లోని, దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా ఈ సామాజికోద్యమంలో మరో అడుగు ముందుకు వేసింది. పాఠశాల విద్యార్థినులందరికీ ఈ సినిమాను జిల్లా స్థాయి అధికారులు ఉచితంగా చూపిస్తున్నారు. తొలి విడతగా ఐదు వందల టికెట్లను అధికారులే కొని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులను సినిమాకు తీసుకెళ్లారు. విద్యార్థినులతో పాటు జిల్లా మేజిస్ట్రేట్ శరద్‌కుమార్ ద్వివేది, పోలీస్ సూపరింటెండెంట్ ప్రసూన్ బెనర్జీ, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సుకుమార్ డే కూడా ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమాను వీక్షించారు. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో 70 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వారిలో సగం మంది మహిళలు కూడా శానిటరీ న్యాప్కిన్లను వాడటం లేదు. జిల్లా వైద్యశాఖ అధ్యయనంలో ఈ సంగతి వెల్లడైంది. గ్రామీణ మహిళలను రుతుక్రమం సమయంలో పాటించాల్సిన శుభ్రత పట్ల చైతన్యవంతం చేయడానికి వైద్య ఆరోగ్య సిబ్బంది కొన్నేళ్లుగా రాష్ట్రమంతటా శ్రమిస్తూనే ఉంది. అయినా సరే వారి ప్రయత్నం అనుకున్నంతగా ఫలవంతం కాలేదు. అనేక అపోహలు గ్రామీణ మహిళల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ అపోహలను పూర్తిగా తొలగించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్న అక్కడి ప్రభుత్వ యంత్రాంగం.. రాబోయే తరాన్ని చైతన్యవంతం చేస్తేనే సమాజం ఆరోగ్యకర మవుతుందనే నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయానికి ‘ప్యాడ్‌మ్యాన్’ మంచి అవకాశంగా కలిసొచ్చింది. ‘సినిమా ప్రభావవంతమైన మాధ్యమం. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సులభంగా చేరుస్తుంది’ అని అధికారులు అంటున్నారు. పది నేప్కిన్లు రూ.27 రుతస్రావ పరిశుభ్రతను పాటించడం నేర్పిస్తే సరిపోతుందా? అందుకు తగినన్ని శానిటరీ న్యాప్కిన్స్ని అందుబాటులోకి తేవద్దా? తేవాలి. తెస్తున్నారు కూడా. స్థానిక స్వయం సహాయక బృందాల మహిళలకు న్యాప్కిన్ల తయారీలో అధికారులు శిక్షణ ఇప్పిస్తున్నారు. వారి చేత న్యాప్కిన్ తయారీ యూనిట్లు పెట్టించి ప్రభుత్వమే మెటీరియల్ సప్లయ్ చేస్తోంది. పది న్యాప్కిన్ల ప్యాకెట్ 27 రూపాయల కు అందుబాటులోకి తెచ్చింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చొరవతో ఆడవాళ్లకు అందివచ్చిన సౌకర్యం ఇది. – మంజీర -
ప్యాడ్ మ్యాన్ ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్లో తాజాగా విడుదలైన ప్యాడ్ మ్యాన్ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆడవారు ఎదుర్కొనే రుతుక్రమం ఒక రహస్యం కాదని, చర్చించాల్సిన అంశమన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రత్యేక ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ చిత్రంతో ప్రభుత్వాల్లో కూడా కదలిక వచ్చింది. పాఠశాలలోని విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్లను ఉచితంగా అందించేందుకు ఢిల్లీ సర్కార్ సిద్ధమైపోయింది. ఇందులో భాగంగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిధులను కూడా విడుదల చేసింది. ‘ఇది దాచుకోవాల్సిన అంశం ఏం కాదు. ఉపాధ్యాయులు కూడా ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించారు. ఆ సమయంలో విద్యార్థినులు పాఠశాలలకు గైర్హాజరు అవుతుంటారు. అందుకే వారికి ఉచితంగా ప్యాడ్లను అందించేందుకు సిద్ధమయ్యాం’ అని స్థానిక నేత శిఖా రాయ్ వెల్లడించారు. 2018-19 బడ్జెట్‌కి గానూ ఈ నిధులను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ప్రత్యేక సమావేశంలో ఇందుకు సంబంధించిన బిల్లును మేయర్ కమల్జీత్ షెరావత్ ఆమోదించగా.. మునిసిపల్ కమిషనర్ ఆమోదించాల్సి ఉంది. మరోవైపు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఆర్.బాల్కీ డైరెక్షన్లో అక్షయ్ కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ ముఖ్యపాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. -
పద్మావతి ఓకే ప్యాడ్‌మ్యాన్ నాట్ ఓకే
‘ప్యాడ్‌మ్యాన్’ మూవీ మొన్న ఫ్రైడే ప్రపంచమంతా విడుదలైంది. ఒక్క పాకిస్థాన్‌లో తప్ప! రుతుస్రావ పారిశుధ్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని దర్శకుడు ఆర్.బల్కీ తీసిన ఈ చిత్రం తమ సంస్కృతికి, సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా ఉందని భావించిన పాక్ సెన్సార్ బోర్డు... విడుదలకు అనుమతిని తిరస్కరించడంతో, అక్కడి ప్రభుత్వం కూడా ఈ సినిమాపై నిషేధం విధించింది. ‘‘గోప్యమైన విషయాలను బాహాటంగా చర్చించడం, చర్చకు అవకాశం కల్పించడం అన్నవి ఈ దేశపు మనోభావాలను భంగపరిచేవి కనుక ‘ప్యాడ్‌మ్యాన్’కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నాం’’ అని అక్కడి పంజాబ్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు కూడా ప్రకటించింది. పాకిస్థాన్ ఎంతగానో అభిమానించే మన అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్.. ప్యాడ్‌మ్యాన్ చిత్రంలో ఉన్నప్పటికీ, ప్యాడ్‌మ్యాన్ థీమ్‌ను మాత్రం ఆ దేశం మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోతోంది. భారత్‌లోని సగటు మహిళా ప్రేక్షకులు కూడా ప్యాడ్‌మ్యాన్ చిత్రాన్ని చూసేందుకు బిడియపడకుండా రాలేకపోతున్నారని సమీక్షలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. భారత్‌లో ఆటంకాలను ఎదుర్కొన్న ‘పద్మావతి’ చిత్రానికి పాక్ ఒక్క కట్ కూడా లేకుండా ఓకే చెప్పింది. ఒక్క కట్ కూడా లేకుండా భారత్‌లో విడుదలైన ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్రం పాక్‌లో రిలీజ్ కాలేకపోయింది. ఎవరి మనోభావాలు వారివి. వాటిని గౌరవించడం మానవ సంప్రదాయం. -
ప్యాడ్మాన్పై నిషేధం!
కరాచీ : మహిళల సానిటరీ న్యాప్కిన్ల ఇబ్బందులే ఇతివృత్తంగా తీసిన ‘ప్యాడ్మాన్’ చిత్రంపై పాకిస్తాన్ బ్యాన్ విధించింది. ఆ దేశంలో ఈ చిత్రం విడుదలకు అక్కడి ఫెడరల్ సెన్సార్ బోర్డు(ఎఫ్‌సీబీ) నో చెప్పింది. ఆర్. బల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్లు ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. తమ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ చిత్రాన్ని దిగుమతి చేసుకోమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పలేమని ఎఫ్‌సీబీ మెంబర్ ఇషాక్ అహ్మద్ పేర్కొన్నారు. అలాగే నిషిద్ద అంశంపై తీసిన ఈచిత్రాన్ని తమ రాష్ట్రంలో విడుదలకు అనుమతించలేమని పంజాబ్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సైతం వివరించింది. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ ఫిల్మ్‌మేకర్ సయ్యద్ నూర్ మాట్లాడుతూ.. ఇతర దేశాల చిత్రాల దిగుమతిపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్యాడ్మానే కాదు ముస్లింలను నెగటివ్‌గా చూపించిన పద్మావత్ సినిమా సైతం విడుదల కాలేదన్నారు. ఇక అరుణాచలం మురుగనంతం జీవితం ఆధారంగా తెరకెక్కిన ప్యాడ్మాన్ మూవీ భారత్‌లో మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది. -
రియల్ ‘ప్యాడ్‌మేన్’ ఎమోషనల్ లెటర్
సాక్షి, ముంబై: తన జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో సినిమా తెరకెక్కించినందుకు రియల్ ‘ప్యాడ్‌మేన్’ అరుణాచలం మురుగనాథమ్ ధన్యవాదాలు తెలిపారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్‌మేన్’ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు మురుగనాథమ్ భావోద్వేగపూరిత లేఖ రాశారు. తన జీవితంగా ఆధారంగా సినిమా వస్తుందని తాను ఊహించలేదని పేర్కొన్నారు. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన భార్య సహకారంతోనే చౌక ధర శానిటరీ న్యాప్కిన్ తయారీ సాధ్యమైందని పేర్కొంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ విడుదల శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 3350 స్క్రీన్లపై ‘ప్యాడ్‌మేన్’ విడుదలైంది. రష్యాలో విడుదలైన తొలి బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఒడిశాలో ఈ సినిమా ప్రదర్శించబడుతున్న ధియేటర్ వెలుపల శానిటరీ న్యాప్కిన్ పంపిణీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సినిమా బాగుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సామాజిక సమస్యను ప్రజలను చైతన్యవంతం చేసేలా ఈ చిత్రం ఉందని, అందరూ చూడాల్సిన సినిమా అంటున్నారు. అసాధారణ కృషీవలుడు.. తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనాథమ్ తన అసాధారణ కృషితో మూడున్నర కోట్ల శానిటరీ న్యాప్కిన్ మెషిన్‌ను కేవలం రూ. 65 వేలకే తయారు చేశాడు. దాని సహాయంతో స్వయం సేవా సంఘాల ద్వారా 29 రాష్ట్రాలు ఉన్న మన దేశంలోని 23 రాష్ట్రాలలో ప్యాడ్స్‌ను చాలా చవకగా అమ్ముతున్నాడు. ఆయన సేవలకుగాను 2016లో ఆయనను కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. It’s going to be an emotional day! @akshaykumar @mrsfunnybones @sonamakapoor @radhika_apte @pcsreeram @ItsAmitTrivedi @PadManTheFilm #PadMan pic.twitter.com/TZUQTXQCcT — A Muruganantham (@murugaofficial) 8 February 2018 -
ప్యాడ్ ఛాలెంజ్
బహిష్టు సంబంధిత పరిశుభ్రత మీద ఇవాళ దేశమంతా మాట్లాడుతోంది. మెన్స్ట్రువల్ హైజీన్‌కు సంబంధించి కలిగించాల్సిన అవగాహన పట్ల అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. స్కూలు స్థాయి నుంచి ఆడపిల్లలకు ఈ చైతన్యం అవసరం. ‘ప్యాడ్‌మేన్’ వంటి సినిమాలు, సెలబ్రిటీల ‘ప్యాడ్ ఛాలెంజ్’ వంటివి ఈ ప్రచారానికి తోడ్పాటు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్యాడ్’ వాడకంపై విస్తృత కథనం... మహిళలకు అనివార్యమైన ఆ మూడు నుంచి ఐదురోజుల ఇబ్బందికరమైన సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు, ఉపకరించే సాధనాలను వారు తమకు తామే రూపొందించుకున్నారు. సామాజికంగా వారికి ఎదురయ్యే అనేక సాంస్కృతిక అంశాలు, మూఢనమ్మకాల వంటి సవాళ్లు చుట్టుముట్టిన నేపథ్యంలో వాటికి అనుగుణంగా ఎలాగోలా తమ తమ ఆర్థిక, విద్యాపరమైన స్థోమతను బట్టి తమ తమ సొంత మార్గాలు అనుసరించారు. చాలా సందర్భాల్లో వారు అనుసరించిన మార్గాలు అంత సులువైనవీ, సౌకర్యవంతమైనవి కావు. మరీ ముఖ్యంగా పేద వర్గాల్లో అవి చాలా ఇబ్బందికరమైనవి. అయినా తమ ఇబ్బందికరమైన ఆ రోజులను ఎలాగోలా నెట్టుకొచ్చారు. వారి ఇబ్బందులు గమనించిన తమిళనాడులోని అరుణాచలం మురుగనంతం లాంటి వాళ్లు దానికి గురించి మాట్లాడటానికి ప్రయత్నించినా సమాజం వారిని ప్రోత్సహించలేదు. భారత్‌లో ఇదీ పరిస్థితి... మన భారతీయ సమాజంలో అత్యధికులు పేద వర్గాలే. మార్కెట్లో దొరికే ఖరీదైన ప్యాడ్స్‌ను కొనుగోలు చేయగలిగే ఆర్థిక స్తోమన ఉన్నవారు చాలా తక్కువ. 2016లోని ఒక అధ్యయన వివరాల ప్రకారం... దేశంలో 84% కౌమార బాలికలు, 92.2% తల్లులు ఇప్పటికీ నెలసరి సమయంలో గుడ్డను వాడుతున్నారు. ప్రభుత్వమే నిర్వహించిన ఒక సర్వే వివరాల ప్రకారం మన దేశంలో కేవలం 12% మంది మాత్రమే ప్యాడ్స్ వాడగలిగే స్థితిలో ఉన్నారు. దాంతో 37.8% మంది పెళ్లికాని యువతులు యోని దగ్గర దురద, దుర్వాసన వంటి సమస్యలతో బాధపడుతున్నారు. సాధారణ గుడ్డను ఉపయోగించడంలో ఎదురయ్యే ఇబ్బందులు ►మళ్లీ ఉపయోగించే గుడ్డను వాడినప్పుడు, అది కాస్తంత అపరిశుభ్రంగా ఉన్నా మహిళలకు రీప్రోడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు – ఆర్టీఐ) రావచ్చు. ►సాధారణంగా యోనిలో దాని రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్ది మోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా జీవిస్తూ ఉంటుంది. గుడ్డ వంటి అపరిశుభ్రమైన పద్ధతుల వల్ల యోని సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడి తర్వాతి కాలంలో సంతానలేమి, సెక్స్ వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ►మహిళల్లో మూత్రవిసర్జనకు ఉండే రంధ్రం నిడివి చాలా తక్కువగా ఉంటుంది. దాంతో హానికరమైన బ్యాక్టీరియా అక్కడ విస్తరిస్తే అది యూరినరీ ఇన్ఫెక్షన్స్కు దారి తీయడంతో పాటు బ్లాడర్ (మూత్రం నిల్వ ఉండే తిత్తి) వరకు పాకే ముప్పు ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్లు పదే పదే తిరగబెడుతుండటానికి కారణం కూడా రుతుస్రావం సమయాల్లో పాటించే అపరిశుభ్రమైన పద్ధతులే. వాడి పారేయగల ప్యాడ్స్ గురించి... ►మిగతా వాటితో పోలిస్తే వాడి పారేసేందుకు అనువైన ప్యాడ్స్ స్త్రీల పరిశుభ్రతకు అనువైనవి. వాటిని ఉపయోగించాల్సిన తీరుతెన్నులు బాలికలకూ, యువతులకూ మహిళా టీచర్లు విపులంగా వివరించాలి. ►ఉపయోగించిన ప్యాడ్స్‌ను తేలిగ్గా పారేసేలా కొంత మరుగుగా ఉన్న ప్రాంతాల్లో ‘డిస్పోజబుల్–బిన్స్’ ఏర్పాటు చేయాలి. అంటే స్కూళ్లలో, ఆఫీసుల్లో ఉండే టాయిలెట్స్‌లో, మహిళలు వేచి ఉండే ప్రాంతాలు, విశ్రాంతి స్థలాల్లోని మరుగు ప్రదేశాల్లో వాటిని ఉంచాలి. ఆ బిన్స్‌ను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ►వాడేసిన ప్యాడ్స్‌ను ‘సేఫ్‌గా డిస్పోజ్’ చేయాలి. అంటే లోతు గుంతలో వేసి కాల్చేయడం (పిట్ బర్నింగ్), బయటకు ఏమాత్రం పొగరానివ్వని విధంగా భస్మం చేయడం (ఇన్సినరేషన్) వంటి పద్ధతులు అవలంబించడం మేలు. ప్యాడ్ తయారైన మెటీరియల్ ఆధారంగా ఏది ఆరోగ్యకరమైన పద్ధతో ఆ పద్ధతిని ఎంచుకోవడం మేలు. ►అంతే తప్ప వాటిని ఒకచోట కుప్పగా వేసి, బహిరంగంగా తగలబెట్ట రాదు. ప్యాడ్స్‌లో సాధారణ రకాలు 1. పీల్చుకునే సాధనంగా ఉపయోగించే గుడ్డ : పాత చీరలూ, తువాళ్లు, పాత బెడ్షీట్లు వంటి వాటిని తమకు అనువైన రీతిలో కత్తిరించుకొని చాలా మంది వాడుతుంటారు. ఇవి దొరకడం చాలా తేలిక. దాంతో వీటిని తరచూ శుభ్రపరచుకొని ఉపయోగిస్తుంటారు. లభ్యత తేలికే అయిన శుభ్రపరచుకునేందుకు వారు కోరుకునే చాటు/మరుగు మన సమాజంలో అంత తేలిగ్గా దొరకదు. ఉతికేందుకు చోటూ, తగినంత నీరూ, సబ్బు, ఎండ తగిలేలా ఆరేసుకునేందుకు అనువైన ప్రదేశం దొరకడం చాలా కష్టం. పైగా ఇన్ని సౌకర్యాలు లేకపోతే వాటిని మళ్లీ ఉపయోగించడం వల్ల దురద, దుర్వాసన వంటి మరికొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. చెమ్మ ఉంటే ఇన్ఫెక్షన్లకూ దారితీస్తుంది. అలాంటి అనారోగ్యకరమైన, అపరిశుభ్రమైన పరిస్థితులు మన దేశపు పల్లెప్రాంతాల్లోని పేదవర్గాల్లో చాలా ఎక్కువ. 2. స్థానికంగా తయరయ్యే మళ్లీ ఉపయోగించేందుకు వీలున్న న్యాప్కిన్లు : దాదాపు 6–12 సార్లు ఉపయోగించేందుకు వీలైన స్థానిక ప్యాడ్స్ కొన్ని చోట్ల లభ్యమవుతున్నాయి. ఇవి మాటిమాటికీ ఉపయోగపడేవి కావడంతో దాదాపు శిథిలమయ్యేవరకు ఉపయోగించే వీలుండటం వల్ల పర్యావరణానికీ హాని చేయవు. అయితే పైన పేర్కొన్నట్లే శుభ్రపరచడానికి (లాండ్రీయింగ్)కు వీటికి చోటు కావాలి. 3. ఉపయోగం తర్వాత పారేసేందుకు అనువైన వాణిజ్య ఉత్పాదనలు : ఇప్పుడివి మరీ మారుమూల ప్రాంతాలు మినహాయించి, ఒక మోస్తరు పెద్ద పల్లెల వరకూ విస్తారంగా లభిస్తున్నాయి. తగినంత పరిశోధన తర్వాత ఆరోగ్యకరమైన రీతిలో రూపుదిద్దుకున్న న్యాప్కిన్లు ఇవి. అయితే అందరూ కొనలేని కారణంగా, ఆర్థికంగా అందరికీ అందుబాటులో లేకపోవడం, ఒక్క ఉపయోగం తర్వాత వ్యర్థాలుగా మారడంతో శిథిలం కావడానికి కాస్తంత ఎక్కువ సమయం తీసుకోవడంతో ఇవి పర్యావరణానికి అంత అనువుగా లేవు. అందుకే వాడాక కొంత జాగ్రత్తగా వీటిని పారేయాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యల ముప్పు తగ్గించడానికి పాటించాల్సిన పరిశుభ్రత సూచనలు రుతుస్రావం సమయంలో పరిశుభ్రత (మెన్స్ట్రువల్ హైజీన్) పాటించకపోతే చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. అవి రాకుండా ఉండాలంటే పాటించాల్సిన సూచనలివే... 01. తిరిగి ఉపయోగించగలిగేవైనా లేదా వాడాక పడేసేవైనా సురక్షితమైన రీతిలో ఉపయోగించాలి. ఈ ప్రయోజనం కోసం గుడ్డ కంటే ప్యాడ్ మేలు. 02. ప్యాడ్ తరచూ మార్చుకోవాలి : మన రక్తం దేహాన్ని వదలగానే మన శరీరంలో ఉండే కొన్ని క్రిములతో కలిసి కలుషితం అవుతుంది. అంటే పరిశుభ్రత పాటించకపోతే వ్యాధులను కలిగించేలా మారుతుంది. ప్యాడ్ రక్తంతో తడిసినప్పుడు యోనిలో ఉండే బ్యాక్టీరియా క్రిములు, యోని పరిసరాల్లో స్రవించిన చెమటలోని క్రిములతో నిండిపోతుంది. అదే చెమ్మ అలాగే ఎక్కువసేపు కొనసాగింతే ఆ క్రిములు మరింతగా వృద్ధి చెందేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. దాంతో ఆ క్రిములు అపరిమితంగా పెరిగి మూత్రసంబంధమైన, యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు, చర్మం ఎర్రబారడం, దురద వంటి సమస్యలు రావడానికి దారి తీయవచ్చు. అందుకే వీలైనంత త్వరత్వరగా ప్యాడ్స్ మార్చేయాలి. ఎంత వ్యవధిలో వాటిని మార్చాలన్నది వారి వారి సౌకర్యాన్ని బట్టి ఉంటుంది. సగటున ప్రతి ఆరుగంటలకు ఒకసారి మార్చడం మంచిది. 03. రుతు సమయంలో స్రవించే రక్తం యోని ముఖద్వారం, దాని చుట్టూ ఆవరించే ఉండే లేబియా చర్మంలో కొన్ని చుక్కలు ఉండవచ్చు. దాని వల్ల దుర్వాసన వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక తరచూ యోని ప్రాంతాన్ని కడుక్కుంటూ ఉండాలి. 04. యోని కడిగేందుకు సబ్బు లేదా ఇతర ఉత్పాదనలు వాడకండి. సబ్బు లేదా ఇతర ఉత్పాదనలు వాడినప్పుడు చెడు బ్యాక్టీరియాతో పాటు యోనికి మేలు చేసేందుకు ఉద్దేశించిన మంచి బ్యాక్టీరియా కూడా ప్రక్షాళన ప్రక్రియలో నశించిపోతాయి. అందుకే కాస్తంత గోరువెచ్చని నీటితోనే శుభ్రం చేసుకోవడం మేలు. 05. యోని ప్రాంతాన్ని శుభ్రం చేసుకునే సమయంలో ఎప్పుడూ మీ చేతిని కింది నుంచి పై వైపునకు కదిలిస్తూ శుభ్రం చేసుకోండి. దీనికి వ్యతిరేక దిశలో వద్దు. మీ ప్రైవేటు పార్ట్స్‌ను పై నుంచి కిందివైపునకు శుభ్రం చేసుకుంటే యోని దగ్గర ఉండే క్రిములు కింద మలవిసర్జన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి, అక్కడికి ఇన్ఫెక్షన్స్ను వ్యాపి చేసే అవకాశం ఉంటుంది. 06. ఉపయగించి తీసేశాక ఆ ప్యాడ్‌ను జాగ్రత్తగా వదిలించుకోవాలి (డిస్కార్డ్ ప్రాపర్లీ): ఉపయోగించిన న్యాప్కిన్ లేదా టాంపూన్ వల్ల దుర్వాసన లేదా ఇన్ఫెక్షన్ వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని వాడాక పారేసేముందర ఏదైనా శుభ్రమైన పేపర్లో చుట్టి (ర్యాప్ చేసి) దూరంగా పొడిప్రాంతాల్లో పడేయాలి. టాయిలెట్ రంధ్రంలో వేసి ఫ్లష్ చేయడం సరైన పద్ధతి కాదు. అది మీ టాయిలెట్లో అడ్డంకిగా మారి మరో సమస్యను సృష్టించవచ్చు. న్యాప్కిన్ను పారేశాక మీ చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోకండి. 07. ప్యాడ్‌తో వచ్చే ర్యాష్‌తో జాగ్రత్త : ఒక్కోసారి రక్తస్రావం ఎక్కువగా ఉన్నవారిలో ప్యాడ్ చాలాసేపు తడిగా ఉండి తొడలు, తొడలోపలి భాగాల్లో దురద రావడం, ఎర్రగా మారడం, ర్యాష్ రావడం జరగవచ్చు. అందుకే ప్యాడ్స్‌ను తరచూ మార్చడం ఎంత ముఖ్యమో, ఆ ప్రాంతాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ అప్పటికే మీకు అక్కడ ర్యాష్ ఉంటే ప్యాడ్ వాడే సమయంలోనే మరింత జాగ్రత్తతో ఉండటం చాలా అవసరం. అలాగే డాక్టర్ సలహా మేరకు యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ను స్నానం తర్వాత, పడుకునే ముందర రాసుకోవాలి. ఇలాంటి సమస్య ఉంటే బిడియపడకుండా తప్పక డాక్టర్‌ను సంప్రదించండి. మీకు సహాయం చేయడం కోసమే డాక్టర్లు ఉంటారు. అంతేగానీ ‘ఇదేమిటీ’ అంటూ వారేమీ చెడుగా అనుకోరు. అన్యథా భావించరు. మీ సమస్య గురించి వేరే ఎక్కడా చర్చించరు. వారు అక్కడికక్కడే ఆ విషయాన్ని మరచిపోతారు. 08. ఒకసారికి ఒక్క ప్యాడ్ మాత్రమే: ఒకసారి ఒక్కటే ప్యాడ్‌ను వాడండి. అంతేగానీ హెవీ బ్లీడింగ్ అవుతోంది కదా అని రెండు ప్యాడ్స్ వాడకండి. రెండు వాడటం వల్ల కింది ప్యాడ్ రక్తాన్ని పూర్తిగా పీల్చుకునే అవకాశం ఉండదు. పై ప్యాడ్ రక్తంతో తడిసి, చెమ్మగా చాలాసేపు ఉండిపోతుంది. కిందిది పొడిగానే ఉంది కదా అని మీరు మార్చడానికి చాలాసేపు ఉంచుతారు. దాంతో పైనున్న తడిప్యాడ్లో ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెంది మీకు ఇన్ఫెక్షన్స్ కలిగిస్తాయి. ర్యాష్ కూడా రావచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో రెండు ప్యాడ్స్ ఉండటం అంత సౌకర్యం కాకపోవచ్చు కూడా. 09. రుతు సమయంలో క్రమం తప్పకుండా స్నానం చేయండి : రుతుసమయాల్లో మహిళలు స్నానం చేయకూడదంటూ కొన్ని సంస్కృతుల్లో మహిళలకు ఆంక్షలు ఉంటాయి. కానీ రుతుసమయంలో మహిళలు తప్పనిసరిగా రోజూ స్నానం చేయాలి. స్నానం వల్ల వారి ప్రైవేట్ పార్ట్స్ పూర్తిగా శుభ్రం కావడమే కాదు వారిలో మెన్స్ట్రువల్ క్రాంప్స్ రాకుండా ఆ శుభ్రత దోహదపడుతుంది. అంతేకాదు ఎక్కడా ఏ అడ్డులేకుండా స్రావాలు ఫ్రీగా ప్రవహించేందుకూ స్నానం ఉపయోగపడుతుంది. స్నానం తర్వాత ఉండే ఆహ్లాద భావనతో మహిళలు చాలా హాయిగా ఫీలవుతారు. 10. మీ ప్యాడ్స్‌ను రెడీగా ఉంచుకోండి: రుతుస్రావం మొదలయ్యాక ప్యాడ్‌ను వెతుక్కోవడమో, ప్యాడ్ పారేయాల్సిన సమయంలో అవి లేవని గుర్తించి, షాప్‌కు వెళ్లడమో కాకుండా మొదట్నుంచే ప్యాడ్స్‌ను రెడీగా పెట్టుకోండి. మీరు స్కూల్‌కు లేదా కాలేజీకి వెళ్లే యువతి అయినా, లేదా బయటకు వెళ్లి పనిచేసే వర్కింగ్ ఉమన్ అయినా శానటరీ న్యాప్కిన్స్ లేదా ప్యాడ్స్‌ను ఎప్పుడూ నిల్వ ఉంచుకోండి. పరిశుభ్రమైన మీ బ్యాగ్‌లో ఒక పేపర్లో చుట్టి ప్యాడ్నూ, మృదువైన ఒక తువ్వాలను, లేదా కొన్ని పేపర్ న్యాప్కిన్స్నూ, చేతులు శుభ్రపరచుకునే హ్యాండ్ వాష్ (హ్యాడ్ శానిటైజర్)నూ, కాస్తంత పెద్దమొత్తంలోనే తినుబండారాలనూ (హెవీ శ్నాక్), ఒక వాటర్బాటిల్నూ, ఒక యాంటీసెప్టిక్ ట్యూబ్‌నూ దగ్గరుంచుకోండి. ఇవీ ప్రభుత్వ మార్గదర్శకాలు కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని తాగునీరు, పారిశుధ్ధ్య మంత్రిత్వ శాఖ వారు రుతుస్రావ సమయంలోని పరిశుభ్రత విషయంలో 2015లో కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. అలాగే స్వచ్ఛభారత్ కార్యక్రమంలోనూ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిలోని ముఖ్యంశాలు ఇవి. 1. అంగన్వాడీ సూపర్వైజర్లు, వర్కర్లకు రుతుస్రావ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత విషయమై శిక్షణ ఇచ్చి అది మహిళలందరికీ చేరేలా చూడాలి. 2. స్వయంసేవాసంఘాల (సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల) ద్వారా శానిటరీ నాప్కిన్స్ గ్రామీణ ప్రాంతాలకూ చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3. కౌమారవయసులోని బాలికల సాధికారత కోసం ఉద్దేశించిన ఎస్ఏబీఎల్ఏ కార్యక్రమం, సమీకృత బాలల అభివృద్ధి (ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్మెంట్) కార్యక్రమాలు, మహిళా ఆర్థిక్ వికాస్ మహామండల్ కింద పనిచేసే స్వయం సేవా సంఘాల ద్వారా రుతుస్రావ పరిశుభ్రత అవసరాలను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ పిల్లల వరకూ చేర్చాలి. 4. కొత్తగా యుక్తవయసుకు వచ్చిన బాలికల కోసం ‘అడాలసెంట్ రీసోర్స్ సెంటర్స్’ ద్వారా కౌన్సెలింగ్ కార్యకలాపాలను నిర్వహింపజేయాలి. 5. కొత్తగా యుక్తవయసుకు వచ్చిన బాలలకు ఏర్పడే అవసరాల గురించి, ఆ బాలలు అనుసరించాల్సిన పద్ధతులు, సంబంధిత అంశాల గురించి అన్ని స్కూళ్లలోనూ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలోనూ నోడల్ టీచర్లు విపులంగా వివరించాలి. 6. స్కూలుకు వెళ్లే వయసున్న బాలబాలికలకు తగిన అవగాహన కల్పించేలా ‘రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమ్’ కోసం ఉద్దేశించిన కార్యకర్తలు కృషిచేయాలి. 7. యుక్తవయసుకు వచ్చిన బాలికలకు రుతుసమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పద్ధతుల (మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్–ఎమ్హెచ్ఎమ్)తో పాటు ఆ వయసులో కిశోర బాలబాలికలకు ఏర్పడే సందేహాల నివృత్తి కోసం ‘రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమ్’ కింద సేవాకార్యకర్తలు పాటుపడాలి. 8. రుతుసమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పద్ధతుల (మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్–ఎమ్హెచ్ఎమ్) గురించి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు యువతుల్లో, మహిళల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. మురగనాథమ్ చేసిన కృషి తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనాథమ్ అనే వ్యక్తి తన అసాధారణ కృషితో మూడున్నర కోట్ల శానిటరీ న్యాప్కిన్ మెషిన్‌ను కేవలం రూ. 65 వేలకే తయారు చేశాడు. దాని సహాయంతో స్వయం సేవా సంఘాల ద్వారా 29 రాష్ట్రాలు ఉన్న మన దేశంలోని 23 రాష్ట్రాలలో ప్యాడ్స్‌ను చాలా చవకగా అమ్ముతున్నాడు. ఆయన సేవలకుగాను 2016లో ఆయనను కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన భూమికను ప్రముఖ బాలివుడ్ నటుడు అక్షయ్‌కుమార్ పోషించగా ‘ప్యాడ్‌మ్యాన్’ అనే చిత్రం దేశవ్యాప్తంగా ఈనెల 9 విడుదల కానుంది. సినిమా వంటి మాస్‌మీడియా ద్వారా ఈ సినిమా రుతుస్రావ పరిశుభ్రత, ప్యాడ్ అవసరాల గురించి అవగాహన కల్పించనుంది. ప్యాడ్ వాడకంపై ప్రచారం: ట్వింకిల్‌ఖన్నా, దీపికా పదుకోన్, కత్రినాకైఫ్ -
కోహ్లికి కోచ్ రవిశాస్త్రి సవాల్!
కేప్‌టౌన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అత్యంత ఇష్టమైన వ్యక్తి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఓ సవాల్ విసిరాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నెగ్గి చూపించాలన్నది ఆ సవాల్ కాదు. అయితే విషయం ఏంటంటారా... బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మొదలుపెట్టిన 'ప్యాడ్‌మ్యాన్' సవాల్‌పై రవిశాస్త్రి స్పందించాడు. 'ఈ విషయంపై అక్షయ్ బహిరంగ చర్చకు నడుం బిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా చేతిలో ఓ ప్యాడ్ ఉంది. అక్షయ్.. నోబాల్ ఈ ప్యాడ్ (మ్యాన్)ను తాకుతుంది. ఇక్కడ నేను విరాట్ కోహ్లి, టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, బిజినెస్ దిగ్గజం గౌతం సింఘానియాలకు ఈ ప్యాడ్‌మ్యాన్ సవాల్ విసురుతున్నానంటూ' ట్వీట్ చేశాడు రవిశాస్త్రి. సామాజిక సమస్యలపై పోరాడేందుకు, బాధిత వర్గాలకు మద్ధతు తెలిపేందుకు ఇలాంటి సవాళ్లు స్వీకరించాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇదేవిధంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఓ శానిటరీ ప్యాడ్‌తో పోస్ట్ పెట్టింది. విస్తృత ప్రచారం కల్పించాలని కోరింది. తమిళనాడుకు చెందిన మురుగనాథమ్ జీవితం ఆధారంగా ప్యాడ్‌మ్యాన్ మూవీ తెరకెక్కించారు. రుతుక్రమం సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్లు రూపొందించి ఎంతో కృషి చేశారు మురుగనాథమ్. అక్షయ్ కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ కీలకపాత్రలు పోషించిన ఆ మూవీ ఈ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా, వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించిన కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు మూడో వన్డేలో నెగ్గి సిరీస్‌లో ఆధిక్యాన్ని 3-0కి పెంచుకుని తమ సత్తా చాటేందుకు సంసిద్ధమైంది. Yes, it’s a Pad in my hand. Happy to support rockstar @akshaykumar for breaking the taboo and initiating an open conversation. AK, am sure no ball is going to hit PAD (MAN). #PadManChallenge Here I challenge @imVkohli @SinghaniaGautam @Leander pic.twitter.com/FXdK3py7gW — Ravi Shastri (@RaviShastriOfc) 6 February 2018 -
ఆ విషయంలో సిగ్గెందుకు!
ప్రభుత్వం బొట్టు, గాజులు, పారాణి వంటి సౌభాగ్య చిహ్నాలను అడగకుండానే ట్యాక్స్ ఫ్రీ చేసింది కానీ, స్త్రీలు నోరు తెరిచి అడిగినా ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయకుండా భీష్మించుకుంది. పాలకుల పురుషస్వామ్య దృక్పథానికిది నిదర్శన. ‘‘అవును నా చేతిలో ఉన్నది ప్యాడ్ – నేను సిగ్గుపడాల్సింది ఏమీ లేదు... అది చాలా సహజమైనది! పీరియడ్’’ అని ట్వీట్ చేశారు దీపికా పదుకొనె, ప్యాడ్ మ్యాన్ చాలెంజ్ తీసుకుంటూ. ‘ప్యాడ్ మ్యాన్’ ఈ నెల 9వ తేదీ విడుదలవుతున్న అక్షయ్ కుమార్ సినిమా. అరుణాచలం మురుగనంతం జీవితాన్ని ఇది మనకు చూపిస్తుంది. అరుణాచలం తమిళనాడుకి చెందిన వ్యక్తి. తన భార్య నెలసరి రోజులలో పాత గుడ్డముక్కలు, కాగితాలు వాడటం చూసి కలత చెంది, దానికో పరిష్కార మార్గం చూపించాలని భావించాడట. ఈ పరిశోధనలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. విదేశాలనుంచి దిగుమతి అయ్యే శానిటరీ నాప్కిన్ తయారీ మెషీన్ విలువ మూడున్నరకోట్లు. ఇంత ఖరీదైన మెషీన్‌తో ప్యాడ్లు తయారు చేయడం వలన మార్కెట్‌కు చేరేప్పటికీ ప్యాడ్ ఖరీదు పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుందని గ్రహించాడు. చివరికి అన్ని అడ్డంకులనూ అధిగమించి రూ. 65 వేలకే వచ్చే ప్యాడ్ ఉత్పత్తి మెషీన్‌ను ఆయన కనుగొన్నాడు. పైగా ఆ మెషీన్‌ను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు మాత్రమే అమ్ముతానని భీష్మించుకున్నాడు. ఈయన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న 100 మంది వ్యక్తులలో ఒకరని టైం మేగజైన్ ప్రకటిం చింది. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సన్మానించింది. ఇండియాలో అధిక శాతం ప్రజలు అల్పాదాయ వర్గాల వారే. వారికి మార్కెట్లో దొరికే ప్యాడ్లను కొనగలిగే స్థోమత ఉండదు. 2016లో చేసిన ఒక పరిశోధన ప్రకారం దేశంలో 84% అమ్మాయిలూ, 92.2% శాతం తల్లులూ ఇప్పటికీ నెలసరి సమయంలో గుడ్డని వాడుతున్నారు. వారిలో కొందరే ఆ గుడ్డని ఎండలో ఆరబెడుతున్నారు. ప్రభుత్వ సర్వే ప్రకారం మనదేశంలో కేవలం 12% మంది మాత్రమే ప్యాడ్లు వాడగలిగే స్థితిలో ఉండటం వలన 37.8% పెళ్లి కాని పిల్లలు యోని దగ్గర దురదతో, దుర్వాసనతో బాధపడుతున్నారు. స్త్రీలను అమితంగా బాధించే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (ఆర్టీఐ)కి, సర్వైకల్ కేన్సర్‌కు 70% కారణం నెలసరి సమయంలో శుభ్రమైన ప్యాడ్లు వాడకపోవడమేనని 97% మంది గైనకాలజిస్టులు అఇ నీల్సన్ సర్వేలో చెప్పారు. మహిళలకు ఏమీ చేయడంలేదనిపించుకోకుండా ప్రభుత్వం 2011లో రుతు సంబంధమైన శుభ్రతా పథకం (ఎమ్హెచ్ఎస్)ని ప్రారంభించి, 100 కోట్లను కేటాయించింది. అయితే ఈ కార్యక్రమం గురించి నెల్లూరు జిల్లాలో ఒక ఆశా వర్కర్ని అడిగినపుడు ఆమె తన అనుభవాలను పంచుకున్నది. రెండేళ్ల క్రితం ఒకే ఒకసారి రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం క్రింద (ఆర్కెఎస్కె) గ్రామాలలో ప్యాడ్లు పంచడం జరిగిందట. ప్యాకెట్టు విలువ రూ. 6లు. అందులో ఆశా వర్కర్‌కి రూపాయి. మరి గ్రామాలలో స్పందన ఎలా ఉండింది అంటే ‘‘చాలా బాగుండిందమ్మా. రేటు తక్కువ కాబట్టి ‘కౌమార బాలికలు’ ఉత్సాహంగా కొన్నారు’’ అన్నది. ‘కానీ అంత రేటు పెట్టి కొనగలిగే స్థోమత తమకు లేద’ని 83% మంది దిగువ తరగతి వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఆడవారి రుతుస్రావం చుట్టూ నొప్పుల బాధలు ప్రకృతి ఎలాగూ పెట్టింది. అది కాక రోగాలు రాకుండా శుభ్రతను పాటించాలంటే నెలనెలా ఖర్చు పెట్టాల్సి రావడం చాలామందికి స్థోమతకు మించిన బాధ. అలాంటిది ప్రభుత్వం సానిటరీ ప్యాడ్లను 12% జీఎస్టీలోకి నెట్టడం ఇంకా బాధాకరం. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థిని జర్మినా ఇస్రార్ ఖాన్ గత ఏడాది ఈ 12% ట్యాక్స్ రాజ్యాంగ విరుద్ధమూ, అన్యాయమూ అని ఢిల్లీ కోర్టులో కేసు వేసినా ప్రభుత్వం చలించలేదు. ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయాలనే డిమాండ్‌కి స్పంది స్తూ అరుణ్‌జైట్లీ ‘12 శాతాన్ని తగ్గించినట్లయితే... భారతీయ ఉత్పత్తిదారులు ఎవరూ మిగలరు’ అని వ్యాపార సూత్రాన్ని చెప్పారు. ఈ జనవరి 22న సుప్రీం కోర్టు ముంబై ఢిల్లీ కోర్టులలో ఉన్న ఈ కేసు ప్రొసీడింగ్స్‌పై స్టే విధించి, దీన్ని తన పరిధిలోకి తీసుకోవడంపై పరిశీలిస్తానని పేర్కొన్నది. ‘తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ’ వారు 2015లో విడుదల చేసిన ‘రుతుసంబంధమైన ఆరోగ్య నిర్వహణ మార్గదర్శకాలు’ చదువుతూ, నేను నా కూతుర్ని ‘మీ స్కూల్ లో ప్యాడ్స్ ఎలా వాడాలో ఎప్పుడన్నా చెప్పారమ్మా’ అని అడిగాను. నా కూతురు ‘అవంతా చెప్పలేదమ్మా, ఎక్కడ పడేయాలో మాత్రం చెప్పారు అంటూనే, ఆ.. ఇంకా మేల్ స్టాఫ్‌తో మాట్లాడొద్దని కూడా చెప్పారమ్మా’ అన్నది. ఆడపిల్లల్ని మగవాళ్ళకి దూరంగా ఉంచి పద్దతిగా పెంచడంలో ఉండేంత శ్రద్ధ.. వాళ్ల బడి వాళ్లకు ఆ పిల్లల శుభ్రత మీద లేదు. దీని వెనుకనున్న భావజాలం పేరు పితృస్వామ్యం. ప్రభుత్వం బొట్టు, గాజులు, పారాణి వంటి సౌభాగ్య చిహ్నాలను అడగకుండానే ట్యాక్స్ ఫ్రీ చేసింది కానీ, స్త్రీలు నోరు తెరిచి అడిగినా ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయకుండా భీష్మించుకున్నది. పాలకుల పురుషస్వామ్య దృక్పథానికి ఇది నిదర్శన. దీపికా వంటి సెలెబ్రిటీలు ప్యాడ్ మ్యాన్ చాలెంజ్ తీసుకోవాల్సింది, ప్యాడ్‌ని ప్రదర్శించడానికి కాదు, వీటన్నిటి గురించీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తీసుకోవాలి, అప్పుడే అరుణాచలంపై సినిమాకి ఒక అర్థం ఉంటుంది. - సామాన్య వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900 -
రియల్ లైఫ్ ట్రైలర్
అన్ని థియేటర్లలో ‘ప్యాడ్‌మ్యాన్’ ట్రైలర్ చూపిస్తున్నారు. ఈ ట్రైలర్‌ను చూస్తూ మహిళా ప్రేక్షకులు బిడియపడుతున్నారు. వాస్తవానికది ఒక మహోన్నతమైన సందేశాన్నిచ్చే చిత్రం. ‘మగవాళ్లకేం తెలుసు ఆడవాళ్ల ఇబ్బందులు. వాళ్లకేమైనా నెలసరి పాట్లు ఉంటే కదా’ అని హీరో అక్షయ్‌కుమార్ ట్రైలర్లో అంటాడు. ఎంత ఉన్నతమైన సందేశం అయినా, బహిరంగంగా వినడానికి, చూడ్డానికీ, మాట్లాడుకోడానికి మొహమాట పడే సబ్జెక్ట్ ఇది. పిక్చర్ ఈ నెల 9న రిలీజ్ అవుతోంది. ఆ లోగా సొసైటీని ఈ థీమ్‌కి, ఈ పిక్చర్‌కి మెల్లిమెల్లిగా రెడీ చేయడానికేనేమో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియాలో ‘ప్యాడ్‌మ్యాన్ ఛాలెంజ్’ ప్రారంభించారు. శానిటరీ ప్యాడ్‌ని చేత్తో పట్టుకుని ఫొటో తీయించుకుని దానిని అప్లోడ్ చేస్తున్నారు. ఇంతవరకు ఆమిర్‌ఖాన్, దీపికా పదుకోన్, అక్షయ్‌కుమార్, సోనమ్ కపూర్, అతిథి రావ్ హైదరీ, రాధికా ఆప్టే, ఆలియా భట్, దియా మీర్జా, ట్వింకిల్ ఖన్నా, స్వరా భాస్కర్, అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, షబానా అజ్మీ.. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించారు. నేప్కిన్ ప్యాడ్స్‌ని కొని తేవడానికే తటపటాయించే మగధీరులు బహుశా ఈ సినిమా చూశాక కొద్దిగా ధైర్యాన్ని కూడా కొని తెచ్చుకోవచ్చు. -
ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్
ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ అంటూ ట్రెండ్‌కు తగ్గట్టు చాలా చాలెంజ్‌లు చూశాం. ఇప్పుడు మరో చాలెంజ్‌ను మన ముందుకు తీసుకు వస్తున్నారు ఆమిర్ ఖాన్. అదే ‘ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్’. అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ ముఖ్య తారలుగా ఆర్.బాల్కీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమిర్‌ఖాన్ ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ చాలెంజ్’ స్టార్ట్ చేశారు. అరుణాచలమ్ మురుగనాథమ్ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే శానిటరీ నేప్కిన్లను తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు. ఆ విధంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన అరుణాచలమ్ కథతో ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ తీశారు. ఇతరుల్లో అవగాహన కలిగించే ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువ అవ్వాలని ఆమిర్ ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ చాలెంజ్‌కు నాంది పలికారు. ఇంతకీ ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమాకి, ఆమిర్‌కీ సంబంధం ఏంటీ అనుకుంటున్నారా? ఈ సినిమాను అక్షయ్ కుమార్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా నిర్మించారు. ట్వింకిల్, ఆమిర్ మంచి స్నేహితులు. ట్వింకిల్ అడగ్గానే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారీ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఫొటోలో చూస్తున్నారుగా! ఆమిర్ ఖాన్ శానిటరీ ప్యాడ్‌ను ఇలా పట్టుకొని ఫొటో పోస్ట్ చేసి ‘‘అవును.. నా చేతిలో ఉన్నది శానిటరీ ప్యాడే. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు’’ అని పేర్కొన్నారు. అంతే కాదు.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కూడా ఇలా శానిటరీ ప్యాడ్ పట్టుకొని ఫొటో పోస్ట్ చేయమని చాలెంజ్ విసిరారు. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నది కాదు. సోషల్ అవేర్నెస్ కోసం స్టార్ట్ చేసిన చాలెంజ్. ఈ చాలెంజ్ ముఖ్య ఉద్దేశం ప్యాడ్స్ గురించి మాట్లాడటానికి మనం సిగ్గుపడకూడదని. ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. -
‘నేనేం సిగ్గు పడట్లేదు’
సాక్షి, హైదరాబాద్ : మహిళల రుతుస్రావంపై అవగాహన కలిగించేందుకు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సైతం నడుం బిగించాడు. ప్యాడ్ మన్ చాలెంజ్‌లో భాగంగా శానిటరీ నాప్కిన్ చేతిలో పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతేకాకుండా దీనికి నేను సిగ్గుపడటం లేదని, ఈ చాలెంజ్ స్వీకరించి మరొకరికి సవాల్ విసరండని అభిమానులను కోరారు. తాను బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను చాలెంజ్ చేస్తున్నానని ట్వీటర్లో పేర్కొన్నాడు. ఆ ఫొటోకు క్యాఫ్షన్‌గా ‘నా చేతిలో ప్యాడ్ ఉంది. దీనికి నేనేం సిగ్గుపడట్లేదు. పీరియడ్ అనేది సహజం. ఇలా ప్యాడ్‌తో ఫొటో దిగి మీ స్నేహితులకు చాలెంజ్ విసరండి. నేను ఇప్పుడు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను చాలెంజ్ చేస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు. దేశవ్యాప్తంగా రుతస్రావం, నాప్‌కీన్స్ వాడకంపై అవగాహన కలిగించేందుకు ఎన్జీవోలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక సామాజిక కార్యకర్త అరుణాచలం మురుగనాథమ్ స్టోరీ ఆధారంగా అక్షయ్ కుమార్ లీడ్రోల్లో రాధిక ఆప్టే కథానాయికగా ప్యాడ్‌మన్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. Thank you @mrsfunnybones Yes, that’s a Pad in my hand & there's nothing to be ashamed about. It's natural! Period. #PadManChallenge. Copy, Paste this & Challenge your friends to take a photo with a Pad. Here I am Challenging @SrBachchan , @iamsrk & @BeingSalmanKhan pic.twitter.com/lY7DEevDmD — Aamir Khan (@aamir_khan) 2 February 2018 -
కారణం కనుక్కున్నారు
మహిళలకు మానవజాతి ప్రణమిల్లవలసిన కారణాల్లో ప్రధానమైనది మానవ మనుగడ కోసం ఆమె రక్తాన్ని స్రవించడం! రుతుస్రావం వల్ల ప్రతినెలా ఆమె రక్తాన్ని కోల్పోతుంటుంది. కొంత మందిలో ఆ కోల్పోవడం పరిమితికి మించి ఉంటుంది. అప్పుడు వారు పడే అవస్థ అంతా ఇంతా కాదు. ‘ప్యాడ్మాన్’ సినిమా ట్రైలర్లో అక్షయ్ కుమార్ ఒక మాట అంటాడు. ‘ఇదే పరిస్థితి మగాళ్లకు ఉంటే చచ్చిపోతారు’ అని! ఆలోచిస్తే నిజమేననిపిస్తుంది. గర్భాశయం లోపల ఎండోమెట్రియమ్ అనే పొర ఉంటుంది. ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల రుతుచక్రంలో ఈ ఎండోమెట్రియమ్ పొర అనేక మార్పులకు లోనవుతుంది. రుతుస్రావం తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడం వల్ల అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి పద్నాలుగు రోజులు వృద్ధి చెందుతూ ఉంటుంది. పదిహేనవ రోజు నుంచి విడుదల అయ్యే ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల పొర మరింత వృద్ధి చెందుతుంది. దానికి సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మహిళలోని అండం, పురుష శుక్రకణంతో కలిసి పిండంగా మారనంత వరకు ప్రతి నెలా.. పద్నాల్గవ రోజు తర్వాత ప్రోజెస్టెరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకు పోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే రుతుస్రావం. అధికంగా ఎందుకవుతుంది? మహిళల్లో ఆక్సిజన్ తగ్గినప్పుడు వారి ఒంట్లో హెచ్ఐఎఫ్–1 (హైపాక్సియా ఇండ్యూసిబుల్ ఫ్యాక్టర్–1) అనే ప్రొటీన్ తయారవుతుంది. ఇది గర్భాశయంలోని పొర ఊడిపోయాక అయ్యే గాయాన్ని త్వరగా మానేలా చేస్తుంది. కొన్ని కారణాల వల్ల కొందరు మహిళల్లో ఈ హెచ్ఐఎఫ్–1 చాలా తక్కువగా తయారవుతుంది. అలాంటివాళ్ల లోనే రుతుస్రావం సమయంలో చాలా ఎక్కువగా రక్తం పోతుంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయింది. ఈ హెచ్ఐఎఫ్–1ను ఎక్కువగా తయారయ్యేలా చేస్తే... ఆటోమేటిగ్గా రక్తం పోవడం కూడా తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు! రుతు సమయంలో ఎక్కువ రక్తం కోల్పోయే మహిళలు మిగతా వారిలా ఆ రోజుల్లో స్వేచ్ఛగా బయటకు రావాలంటే బిడియపడుతుంటారు. పదిమంది దృష్టిలో పడతామేమోనంటూ ఆందోళనగా ఉంటారు. ఇప్పుడిక వారి దేహంలో హెచ్ఐఎఫ్–1 ప్రొటీన్‌ను ఎక్కువ స్రవించేలా చేయడం ద్వారా వారి ఆందోళనను దూరం చేయవచ్చునని భావిస్తున్నారు. దీని నిర్ధా్థరణకు ప్రయోగాలు కూడా మొదలయ్యాయి. -
పద్మావత్ కోసం వెనక్కితగ్గిన ప్యాడ్‌మ్యాన్
ముంబై : వివాదాల సుడిగుండాలుదాటి విడుదలకు సిద్ధమైన ‘పద్మావత్’కు బాలీవుడ్ బాసటగా నిలిచింది. సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా విడుదల తేదీలు మారుతూ.. చివరికి జనవరి 25కు ఖరారైన నేపథ్యంలో ఆ రోజే విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదాపడ్డాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ప్యాడ్ మ్యాన్ సినిమా జనవరి 25న విడుదలకావాల్సి ఉండగా, భన్సాలీ అభ్యర్థన మేరకు విడుదల తేదీని ఫిబ్రవరి 9కి పోస్ట్‌పోన్ చేసుకున్నారు. బుధవారం ముంబైలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో భన్సాలీ-అక్షయ్‌లు ఈ విషయాన్ని చెప్పారు. ‘సినిమా విడుదల కావడం వారికి(పద్మావత్ రూపకర్తలకు) ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నా సినిమాను విడుదల చేయడం భావ్యంకాదు. అందుకే ఫిబ్రవరి 9కి వాయిదావేస్తున్నాను’ అని అక్షయ్ కుమార్ చెప్పారు. అడిగినవెంటనే వాయిదాకు అంగీకరించిన అక్షయ్‌కి కృతజ్ఞుడినని పద్మావత్ దర్మకుడు భన్సాలీ అన్నారు. -
బయో పీక్స్
► పద్మావత్‌కి అక్కడ దారి ఉందా? చరిత్రలో ఖ్యాతి గాంచిన రాణుల్లో రాణి పద్మావతి ఒకరు. ఆమె జీవితం ఆధారంగానే సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ చిత్రాన్ని తెరకెక్కించారని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నారు. అయితే హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో రిలీజ్‌కు అభ్యంతరం తెలిపాయి. దీంతో చిత్రనిర్మాణ సంస్థ వయాకామ్18 సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పరిశీలనకు అంగీకరించింది. ► బయోపిక్స్ క్రేజ్ పీక్స్‌కి చేరింది. బాక్సింగ్ రింగ్‌లో మేరీ కోమ్ పిడిగుద్దులు గుద్దుతుంటే... లేడీ లైన్ అని, చప్పట్లు కొట్టారు. ఈ లేడీ లైన్ బాక్సర్‌గా రాణించడానికి చాలా కష్టాలు పడ్డారు. అందుకే మేరీ కోమ్ స్టోరీతో సినిమా తీస్తే... ప్రేక్షకులు కనకవర్షం కురిపించారు. ‘బావలు సయ్యా.. మరదలు సయ్యా’... సిల్క్ సిత్మ రింగు రింగులు తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంటే సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న హార్టులు కూడా స్వీట్ సిక్స్టీ అయిపోయాయి. అందుకే ఆమె లైఫ్ స్టోరీతో ‘డర్టీ పిక్చర్’ తీస్తే ఎగబడి చూశారు. గ్రౌండ్లో ధోని రన్నుల మీద రన్నులు పీకుతుంటే... ఈ రేంజ్లో ఆడటానికి ఏ రేంజ్లో కష్టపడ్డాడు? ఇతగాడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాల్సిందే అనుకున్నారు. అందుకే ధోని జీవితకథతో తీసిన ‘ఎం.ఎస్.ధోని’ హిట్. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ స్క్రీన్‌పై మెరిసిన ‘బయోపిక్స్’ ఎన్నో. ఈ నిజ జీవిత కథలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే రెండు మూడేళ్లుగా హిందీలో బయోపిక్స్ హవా సాగుతోంది. ఈ ఏడాదైతే మినిమమ్ పది నిజజీవిత కథలు రీల్‌కి వచ్చే అవకాశం ఉంది. ఆ రియల్ స్టోరీస్ ఏంటంటే... ► ట్రిపుల్ ధమాకా కిలాడీ కుమార్... బాలీవుడ్లో అక్షయ్‌కుమార్‌ని అలానే అంటారు. ఎందుకంటే సినిమాల సెలెక్షన్ విషయంలో అక్షయ్ భలే కిలాడీ. అది నిజమే. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. సోషల్ మెసేజ్ ఉన్న ‘ప్యాడ్‌మేన్’ లాంటి సినిమా అంటే చాలు.. ‘సై’ అంటారు. అరుణాచలమ్ మురుగనాథమ్ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే ‘శానిటరీ నేప్కిన్’లు తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు. ఆయన కథతో తీసిన సినిమానే ‘ప్యాడ్‌మేన్’. ఆర్. బాల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా అక్షయ్ భార్య, మాజీ కథానాయిక ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా మారారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. అక్షయ్లాంటి మాస్ హీరో ఈ సినిమా చేయడం గ్రేట్. ఈ ఒక్క బయోపిక్‌లోనే కాదు.. ఈ ఏడాది మరో రెండు నిజజీవిత కథల్లో కనిపించి, ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నారు. అవేంటంటే... ► గోల్డెన్ జూబ్లీ ఇయర్లో గోల్డ్ లాస్ట్ ఇయర్ అక్షయ్‌కుమార్ గోల్డెన్ జూబ్లి ఇయర్లోకి ఎంటరయ్యారు. అంటే.. ఆయన వయసు 50. గోల్డెన్ జూబ్లీ ఇయర్లో అక్షయ్ ‘గోల్డ్’ పేరుతో సినిమా చేయడం విశేషం. గతేడాదే షూటింగ్ పూర్తయింది. హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్ జీవితం ఆధారంగా లేడీ డైరెక్టర్ రీమా కగ్తి దర్శకత్వంలో ఈ సినిమాని ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. స్వతంత్ర భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకం సాధించిన టీమ్‌లో బల్బీర్ సింగ్ ఒకరు. ఆయన కథతోనే ‘గోల్డ్’ తీశారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► గుల్షన్ జీవిత కథలో... ఢిలీల్లో పండ్ల దుకాణంలో పని చేసిన గుల్షన్ కుమార్ చౌకగా ఆడియో కేసెట్లు అమ్మే దుకాణం కొని, చిన్నగా మొదలై, సంగీత ప్రపంచంలో పెద్దగా ఎదిగారు. టీ–సిరీస్ మ్యూజిక్ లేబుల్ వ్యస్థాపకుడిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించారు. ఆయన జీవితం ఆధారంగా తీయబోతున్న ‘మొఘల్’ చిత్రంలో గుల్షన్ కుమార్ పాత్ర చేయబోతున్నారు అక్షయ్. 1997లో గుల్షన్ హత్యకు గురయ్యా రు. తొలినాళ్లల్లో ఆయన పడ్డ కష్టాల నుంచి మరణం వరకూ ‘మొఘల్’ కథ ఉంటుంది. అక్షయ్‌తో ‘జాలీ ఎల్ఎల్బి 2’ తెరకెక్కించిన సుభాష్ కపూర్ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► క్వీన్ కంగనా ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’ వంటి చిత్రాలతో బాలీవుడ్ క్వీన్ అనిపించుకున్నారు కంగనా. ఇప్పుడు క్వీన్‌గా ఆమె నటిస్తోన్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో వీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకున్నారు. చిత్రీకరణ సమయంలో చిన్ని చిన్ని గాయాలవుతున్నా కంగనా లెక్క చేయకుండా చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► దత్‌గా కపూర్ హీరో సంజయ్ దత్ జీవితం కథతో రాజ్‌కుమార్ హిరానీ ఓ సినిమా తీస్తున్నారు. ఇందులో సంజయ్గా రణబీర్ కపూర్ చేస్తున్నారు. యంగ్ ఏజ్, ఓల్డ్ సంజయ్గా కనిపించడం కోసం రణ బీర్ బరువు తగ్గుతున్నారు, పెరుగుతున్నారు. సంజయ్ వృత్తి జీవితం, వ్యక్తిగత వివాదాలు వంటివి చూపిస్తారని టాక్. ఈ చిత్రానికి ‘సంజూ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సంజయ్ దత్‌ని ‘సంజూ బాబా’ అని పిలుస్తుంటుంది బాలీవుడ్. అందుకే ఈ టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. జూన్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ► హృతిక్.. ఫస్ట్ బయోపిక్ ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి కష్టపడే పేద విద్యార్థుల కోసం ఆనంద్‌కుమార్ ‘సూపర్ 30’ అనే కాన్సెప్ట్ తయారు చేశారు. ఎందరో స్టూడెంట్స్‌కి శిక్షణ ఇచ్చి, వారు గెలిచేలా చేశారు. ఎవరీ ఆనంద్‌కుమార్ అంటే.. బిహారీ గణిత శాస్త్రవేత్త. ఆయన బయోపిక్‌లో నటించనున్నారు హృతిక్. ఆయన నటిస్తోన్న తొలి బయోపిక్ ఇది. విశాల్ బాల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ ‘సూపర్ 30’. నవంబర్‌లో రిలీజ్ కానుంది. ► అతని గోల్ గెలుపే ఒక మ్యాచ్‌లో పెద్ద గాయం అయితే కోలుకుని మళ్లీ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవడం ఆషామాషీ కాదు. అలాంటి గాయమే అయ్యింది హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌కి. కానీ మ్యాచ్‌లో కాదు లైఫ్‌లో. అంటే.. యాక్సిడెంట్ అయ్యింది. సందీప్ సింగ్ తిరిగి హాకీ స్టిక్ పట్టడం అసాధ్యం అన్నారు కొందరు. కానీ, అతని గోల్ గెలుపువైపు. హాకీ స్టిక్ పట్టుకున్నారు.. గోల్ కొట్టారు. అసాధ్యం కాదు.. సుసాధ్యం అని ప్రూవ్ చేశారాయన. ఇప్పుడు ఈ రియల్ కథనంపై రీల్ లైఫ్ స్టోరీ రూపొందుతోంది. షాద్ అలీ దర్శకత్వంలో ‘సూర్మ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ పాత్రలో నటిస్తున్నారు దిల్జీత్. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. ► గురి ఎలా కుదిరింది ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అంత ఈజీ కాదు. అందుకే మెడల్ సాధించినవాళ్లు ఆదర్శంగా నిలుస్తారు. అభినవ్ బింద్రా ఈ కోవకే వస్తారు. 2008 బిజీంగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ పతకం సాధించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు అభినవ్. గోల్డ్ మెడల్‌పై అంత కచ్చితమైన గురి అతనికి ఎలా కుదిరిందన్న దానిపై ఇప్పుడు ఓ బయోపిక్‌ను హిందీలో రూపొందించనున్నారు. అభినవ్ బింద్రా పాత్రను హర్షవర్థన్ కపూర్ పోషించనున్నారు. ► సెట్స్‌కు సై! దేశం గర్వించదగ్గ క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ ఒకరు. ఆమె జీవితం సిల్వర్ స్క్రీన్కు రానుంది. సైనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషించనున్నారు. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం లేదన్న వార్తలు వచ్చాయి. ‘‘అది నిజం కాదు. త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ► ఆడ.. ఈడ..అదే జోరు! పది బయోపిక్స్ మాత్రమే కాదు.. మరికొన్ని సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. వాటిలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా ఒకటి. ఇందులో విద్యాబాలన్ నటిస్తారని టాక్. రచయిత షాహిర్ బయోపిక్‌లో అభిషేక్ బచ్చన్ నటిస్తారట. ఆల్రెడీ కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. మరి ఇంకెన్ని రియల్ స్టోరీస్ రీల్ పైకి వస్తాయో చూడాలి. ఆ సంగతలా ఉంచితే చెప్పిన తేదీ ప్రకారం పైన ఉన్న పది బయోపిక్‌లు రిలీజ్ అవుతాయా? ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు వాయిదా పడినట్లు పడతాయా? వేచి చూద్దాం. మరో సంగతేంటంటే.. ఆడ (హిందీ)లో మాత్రమే కాకుండా ఈడ (సౌత్) కూడా బయోపిక్స్ జోరు బాగానే ఉంది. ట్రెండ్‌తో, సీజన్‌తో సంబంధం లేదు. ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తుల కథలతో ఎప్పుడు సినిమా తీసినా ‘వర్కవుట్’ అవుతుంది. ఏమంటారు? ఇంకో విషయం కూడా... బయోపిక్స్‌లో క్రీడాకారుల లైఫ్ హిస్టరీలు ఎక్కువగా ‘పిక్’ చేస్తుండటం విశేషం. ► నో ఫైట్! సందీప్సింగ్కి, సంజయ్‌దత్‌కి నో ఫైట్. అయినా.. ఇదేంటి. హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌కి, నటుడు సంజయ్‌దత్‌కి ఫైట్ ఏంటి గురూ అంటే.. రియల్ లైఫ్‌లో కాదండి. రీల్ లైఫ్‌లో. అది కూడా వీరికి కాదు. వీరి బయోపిక్స్‌లో నటిస్తున్న హీరోలకి. ముందు సూర్మ (సందీప్ సింగ్ బయోపిక్)ను జూన్ 29న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, మార్చి 30న రిలీజ్ కావాల్సిన ‘సంజు’ ( సంజయ్‌దత్ బయోపిక్కు పరిశీలనో ఉన్న టైటిల్) వాయిదా పడింది. ఈ చిత్రాన్ని కూడా జూన్ 29నే విడుదల చేయాలనుకుంటున్నారు. దాంతో రెండు బయోపిక్‌లకు క్లాష్ తప్పదని పరిశీలకులు అన్నారు. క్లాష్ ఉండకూడదనుకున్నారేమో ‘సూర్మా’ను ఆరు రోజులకు వాయిదా వేశారు. అంటే... జూలై 6న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సో.. నో ఫైట్ అన్నమాట. -
25న ‘పద్మావత్’ అయ్యారే.. వెనక్కి తగ్గారే!
అనుకున్నదే జరిగింది. ‘పద్మావత్’ ముందుకొస్తే.. కొన్ని సినిమాలు వెనక్కి తగ్గుతాయని చాలామంది అనుకున్నారు. అదే జరిగింది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘పద్మావత్’. పలుమార్లు వాయిదా పడుతూ, ఆదివారం వరకూ ఈ చిత్రం విడుదల అయోమయ పరిస్థితిలోనే ఉంది. ఈ నెల 25న విడుదల చేయాలని సోమవారం చిత్రబృందం నిర్ణయించుకుంది. అదే సమయానికి అక్షయ్‌కుమార్ ‘ప్యాడ్‌మ్యాన్’, ‘అయ్యారీ’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ‘పద్మావత్’లాంటి భారీ చిత్రం వచ్చినప్పుడు తాము రావడం శ్రేయస్కరం కాదు అనుకున్నారో ఏమో ‘అయ్యారే’ దర్శకుడు నీరజ్ పాండే తమ చిత్రం విడుదలను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. బాలీవుడ్ కథనం ప్రకారం ‘ప్యాడ్‌మ్యాన్’ వెనకడుగు వేయాలనుకోవడంలేదట. ఈ నెల 25న వచ్చేయాల్సిందేనని చిత్రబృందం అనుకుంటోందట. -
పద్మావత్ ఎఫెక్ట్ ఎవరిపై?
పద్మావతి... కాదు.. కాదు.. ఇప్పుడు ‘పద్మావత్’. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన చిత్రం ‘పద్మావత్’. సెన్సార్ కంప్లీట్ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రజెంట్ బాలీవుడ్లో హాట్ టాపిక్. ఈ నెల 25 లేదా 26న రిలీజ్ అవుతుందని కొందరు, ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుందని మరికొందరి వాదన. ఒకవేళ ‘పద్మావత్’ ఈ నెల 25 లేదా 26న అని చిత్రబృందం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే.. ఆల్రెడీ ఈ డేట్స్‌ను బుక్ చేసుకున్న ‘ప్యాడ్‌మ్యాన్’, ‘అయ్యారీ’ వాయిదా పడతాయా? అనే చర్చ జరుగుతోంది. ఆర్. బాల్కీ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌కపూర్ నటించిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అయ్యారీ’. ఒకవేళ ‘పద్మావత్’ని 25 లేక 26న కాకుండా వార్తల్లో ఉన్నట్లు ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తే ఆల్రెడీ అదే తేదీన రిలీజ్ కానున్న అనుష్కా శర్మ ‘పరీ’ రిలీజ్ డేట్ భవితవ్యం ఏంటి? అనే చర్చ కూడా జరుగుతోంది. ‘ప్యాడ్‌మ్యాన్’, ‘అయ్యారీ’, ‘పరీ’.. ఈ మూడు చిత్రాల విడుదల విషయంలో క్లారిటీ రావాలంటే ‘పద్మావత్’ బృందం అధికారికంగా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేయాల్సిందే. ఇంతకు ముందు ‘పద్మావత్’ సినిమాను గతేడాది డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ‘102 నాటౌట్, తుమ్హారీ సులు, తేరా ఇంతిజార్, ఫిరంగీ, ఫక్రీ రిటర్న్స్’ చిత్రాల రిలీజ్ డేట్స్ విషయంలో మార్పులు జరిగాయి. మరి.. ఈసారి ‘పద్మావత్’ ఎఫెక్ట్ ఏయే సినిమాల మీద పడుతుందో చూడాలి. -
సల్మాన్ అవుట్.. హిస్టారికల్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్
సాక్షి, సినిమా : బాలీవుడ్ లో మరో భారీ ప్రాజెక్టుకు సంబంధించి స్పష్టత వచ్చింది. కరణ్ జోహార్ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో కేసరి అనే చిత్రం రాబోతుందని కొంత కాలం అఫీషియల్ ప్రకటన వెలువడింది. అక్షయ్ కుమార్ హీరోగా.. సల్మాన్-కరణ్ జోహర్-అక్షయ్ కుమార్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు నుంచి సల్మాన్ ఇప్పుడు తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ప్రకటించాడు. పాడ్‌మన్ చిత్ర ప్రమోషన్లో పాల్గొంటున్న అక్షయ్ ఈ విషయంపై మాట్లాడుతూ... ‘‘ఈ ప్రాజెక్టులో సల్మాన్ లేడు. నేను, కరణ్ మాత్రమే నిర్మాతలుగా తీయబోతున్నాం అని తేల్చేశాడు. సారఘరి యుద్ధ నేపథ్యంలో కేసరి చిత్రం తెరకెక్కబోతోంది. పాడ్‌మన్ రిలీజ్ అయ్యాక ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు అక్కీ ప్రకటించాడు. చిత్ర తారాగణం పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారంట.