
సాక్షి,ముంబయి: సామాజిక కార్యకర్త అరుణాచలం మురుగనాథమ్ స్టోరీ ఆధారంగా అక్షయ్ కుమార్ లీడ్‌రోల్‌లో రూపొందుతున్న ప్యాడ్‌మన్ మూవీ గురించి బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తక్కువ ధరకే శానిటరీ నాప్‌కిన్స్‌ను అందిస్తూ గ్రామీణ భారతానికి సేవలు అందించిన అరుణాచలం కథను దర్శకుడు ఆర్ బాల్కి వెండితెరపై హృద్యంగా ఆవిష్కరిస్తున్నారని మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న రాధికా ఆప్టే చెప్పారు.
ఇది చాలా సున్నితమైన సబ్జెక్ట్ అని, మూవీ మేకర్లు కథకు న్యాయం చేస్తారని భావిస్తున్నానని ఆప్టే చెప్పుకొచ్చారు. బిగ్ స్ర్కీన్‌పై ఈ మూవీని చూడాలని తాను ఉత్కంఠతో ఎదురుచూస్తున్నానన్నారు.దర్శకుడు ఆర్ బాల్కీ, నటులు అక్షయ్ కుమార్, సోనమ్‌లతో పనిచేయడం గొప్ప అనుభవమని అన్నారు. ఏప్రిల్ 2018లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.