
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే (39) బేబీ బంప్ ఫోటోతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కొత్త సినిమా 'సిస్టర్ మిడ్‌నైట్' లండన్‌లో ప్రీమియర్ షో జరుగుతుండగా రాధికా ఆప్టే కూడా పాల్గొంది. కరణ్ కంధారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 19న డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ కేన్స్‌లో ప్రదర్శించబడింది. 2024 కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రం రెండు విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 20న విడుదల కానుంది.

రాధికా ఆప్టే అమ్మ కాబోతుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే, తల్లి కాబోతున్న విషయాన్ని ఇప్పటివరకు ఆమె గోప్యంగానే ఉంచింది. నవంబర్ నెలలో పండంటి బిడ్డకు ఈ బ్యూటీ జన్మనివ్వనుంది. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను పెళ్లాడింది. 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి కానున్నడంతో ఆభిమానులు సంతోషంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.

థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించింది. బద్లాపూర్, హంటర్, మాంఝీ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన రాధిక.. లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఇటీవల కాలంలో న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లో ఆమె నటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment