బాల్కీ తీస్తే... అమితాబ్‌ కంపల్సరీ | Amitabh Bachchan Confirms Cameo in 'Pad Man' | Sakshi
Sakshi News home page

బాల్కీ తీస్తే... అమితాబ్‌ కంపల్సరీ

Published Sun, Apr 16 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

బాల్కీ తీస్తే... అమితాబ్‌ కంపల్సరీ

బాల్కీ తీస్తే... అమితాబ్‌ కంపల్సరీ

హిందీలో ఆర్‌. బాల్కీ అనే ఓ దర్శకుడు ఉన్నారు.ఈయన ఏ సినిమా తీసినా... అందులో అమితాబ్‌ బచ్చన్‌ అప్పియరెన్స్‌ కంపల్సరీ. బాల్కీ దర్శకత్వం వహించిన నాలుగు సినిమాల్లో మూడింటిలో అమితాబే హీరో. ఓ సినిమాలో అతిథిగా కనిపించారు. దర్శకుడిగా బాల్కీ తీస్తున్న ఐదో సినిమా ‘ప్యాడ్‌మాన్‌’.

అక్షయ్‌కుమార్, సోనమ్‌ కపూర్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాలోనూ అమితాబ్‌ కనిపించనున్నారు. కొన్ని నిమిషాల పాటు కనిపించే అతిథి పాత్ర చేస్తున్నారాయన. శనివారం ఢిల్లీలో జరిగిన షూటింగ్‌లో అమితాబ్‌ పాల్గొన్నారు. ‘‘ఓ సృజనకారుడిగా బాల్కీ వేసే ప్రతి అడుగులోనూ నిజాయితీ ఉంటుంది. అతడి అడుగుల్లో ఏదో రూపంలో నా ప్రెజెన్స్‌ తప్పనిసరి. అందుకే, నేనిక్కడ (అతిథి పాత్ర చిత్రీకరణ) ఉన్నా’’ అన్నారు అమితాబ్‌. బాల్కీ అంటే అమితాబ్‌కి ఎంత అభిమానమో కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement