సాక్షి, సినిమా : బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఈ మధ్య తన చిత్రాల ఎంపికలో మాములు వైవిధ్యం ప్రదర్శించటం లేదు. యాక్షన్ కిలాడీగా పేరున్న ఆయన గత కొంత కాలంగా ఆ ట్యాగ్ లైన్‌కు దూరంగా ఉంటూ విమర్శకుల చేత శభాష్ అనిపించుకునే కథలను ఎంచుకుంటున్నారు. ఎయిర్‌లిఫ్ట్, రుస్తుం, టాయ్‌లెట్-ఏక్ ప్రేమ్‌కథా ఇలా వరుసపెట్టి చేసిన చిత్రాలే అందుకు నిదర్శనం.
ఇక ఇప్పుడు కొత్త చిత్రం పాడ్‌మాన్ కూడా ఆ కోవలోనిదే. ఆ చిత్ర ట్రైలర్ కాసేపటి క్రితం వచ్చేసింది. అమెరికాకు స్పైడర్ మాన్ ఉన్నాడు.. బ్యాట్ మాన్ ఉన్నాడు. సూపర్ మాన్ ఉన్నాడు. ఇక ఇండియాకు పాడ్ మాన్ ఉన్నాడు అంటూ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలయింది. దేశానికి కావాల్సింది శక్తివంతమైన మహిళలే అని హీరో ట్రైలర్ డైలాగ్ చెప్పటం చూడొచ్చు. అతని వ్యవహారం నచ్చక భార్య, కుటుంబం దూరమైన క్రమంలో అతనికి సాయం అందించే పాత్రలో సోనమ్ కపూర్ నటించింది. ఇక అక్షయ్ భార్య పాత్రలో రాధికా ఆప్టే కనిపించింది. కాస్త వైవిధ్యం, కొన్ని పాయింట్లు ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ కథలో కంటెంట్ మాత్రం చాలా బలంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. మహిళల సమస్యపై ఇంత బోల్డ్‌గా నటించే ధైర్యం బహుశా అక్కీ తప్ప మరెవరూ చేయరేమో.
ఇక 'పాడ్‌మాన్' కథ విషయానికొస్తే... అరుణాచలం మురుగనాథం అనే ఓ సోషల్ ఎంట్రపెన్యూర్‌కి సంబంధించిన కథ. భారతదేశంలో అతి తక్కువ ధరకి శానిటరీ నేప్‌కిన్స్‌ని అందజేయ్యొచ్చునని నిరూపించిన వ్యక్తి.. అంతర్జాతీయ సత్కారాలు కూడా అందుకున్న అతని బయోపిక్ ని దర్శకుడు ఆర్ బాల్కీ దృశ్యరూపకంగా పాడ్‌మాన్ పేరుతో మలిచారు. రిపబ్లిక్ డే కానుకగా పాడ్‌మాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Presenting the much awaited #PadManTrailer, this one's for the mad ones, the ones who are crazy enough to change the world https://t.co/o2NiC2q1SU@PadManTheFilm @sonamakapoor @radhika_apte @mrsfunnybones @SonyPicsIndia @kriarj #RBalki
— Akshay Kumar (@akshaykumar) December 15, 2017