Prithviraj Movie Trailer: Akshay Kumar Prithviraj Movie Trailer Released - Sakshi
Sakshi News home page

Prithviraj Movie: ఆసక్తిగా అక్షయ్ కుమార్‌ 'పృథ్వీరాజ్' ట్రైలర్‌..

Published Mon, May 9 2022 2:57 PM | Last Updated on Mon, May 9 2022 3:42 PM

Akshay Kumar Prithviraj Movie Trailer Released - Sakshi

Akshay Kumar Prithviraj Movie Trailer Released: ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందీ సినిమాలలో పృథ్వీరాజ్‌ ఒకటి. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టైటిల్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ఇది. ఈ మూవీకి చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వం వహించగా సంజయ్ దత్‌, అశుతోష్‌ రాణా, సోనూ సూద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మిస్‌ వరల్డ్‌ 2017 మానుషి చిల్లర్‌ ఈ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనుంది. ఇటీవల విడుదలై ఈ మూవీ టీజర్‌ ఆకట్టుకుంది. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేశారు మేకర్స్. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నిర్భయ, శక్తివంతమైన యోధుడు సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితం ఆధారంగా రూపొందించారు. 2 నిమిషాల 50 సెకన్ల ఈ ట్రైలర్‌లో విజువల్స్‌, యాక్షన్ సీన్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. శ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ‘పృథ్వీరాజ్‌’తో మొదటిసారిగా చారిత్రక నేపథ్యమున్న సినిమాను రూపొందించడం విశేషం. 

చదవండి: అక్షయ్‌ కుమార్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్‌.. కారణమేంటంటే ?



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement