r balki
-
Rajinikanth: కాంబినేషన్ కుదిరేనా?
‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) రిలీజ్ తర్వాత రజనీకాంత్ హీరోగా నటించనున్న సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. కార్తీక్ సుబ్బరాజు, వెంకట్ ప్రభు, కేఎస్ రవికుమార్ వంటి దర్శకులు రజనీకి కథలు వినిపించారని కోలీవుడ్ టాక్. తాజాగా ఈ జాబితాలో ‘చీనీ కమ్’, ‘పా’, ‘ప్యాడ్మాన్’ వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వíß ంచిన ఆర్. బాల్కీ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల రజనీని కలిసి ఓ కథను వినిపించారట బాల్కీ. ఆ కథ రజనీకి బాగా నచ్చిందని సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలను కుంటున్నారట. ఇక ఇప్పటివరకూ బాల్కీ తెరకెక్కించిన వాటిలో చీనీ కమ్, పా, షమితాబ్ తదితర చిత్రాలకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఒకవేళ రజనీ – బాల్కీ కాంబినేషన్ కుదిరితే ఈ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. 1994లో వచ్చిన ‘వీర’ చిత్రం తర్వాత రజనీ–ఇళయరాజా కలిసి వర్క్ చేయలేదు. మరి... 28 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ కుదురుతుందా? అసలు రజనీ–బాల్కీ కాంబినేషన్ కుదిరిందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
బాల్కీ ప్రయోగం..సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్‌తో థ్రిల్లర్ మూవీ
చీనీ కమ్, పా, ప్యాడ్ మ్యాన్... ఇలా బాలీవుడ్ దర్శకుడు ఆర్. బాల్కీ తెరకెక్కించినవన్నీ విభిన్న చిత్రాలే. హిందీ సినిమా ఒక రూట్లో వెళుతుంటే బాల్కీ వేరే రూట్లో వెళ్లి సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు చార్ (నాలుగు) జోర్ చూపించడానికి రెడీ అయ్యారు. సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్, పూజా భట్, శ్రేయా ధన్వంతరి ఈ నలుగురూ ప్రధాన తారాగణంగా బాల్కీ ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కించనున్నారు. ‘‘సన్నీ డియోల్ లాంటి అద్భుత నటుడితో ఓ కొత్త అడ్వంచర్ మూవీ చేయడం ఆనందంగా ఉంది. ఆయన సినిమా కెరీర్లో ఇది ఓ కొత్త కోణం చూపించే సినిమా అవుతుంది. అలాగే ఇండియన్ సినిమాలో ఉన్న చార్మింగ్ యాక్టర్స్‌లో దుల్కర్‌తో సినిమా చేయడం ఓ ఆనందం. విలక్షణ నటి పూజా భట్ ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోరు. ఆమె ఈ సినిమా ఒప్పుకోవడం ఓ మంచి విషయం. ఇక, ‘స్కామ్ 1992’లో అద్భుతంగా నటించిన శ్రేయా ధన్వంతరి ఈ సినిమాలో భాగం కావడం మరో మంచి విషయం’’ అని బాల్కీ అన్నారు. త్వరలో షూటింగ్ ఆరంభం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
డాటర్ ఆఫ్ సన్నీ!
తండ్రితో గొడవపడి ముంబయ్ నుంచి లండన్ వెళ్లిపోవాలనుకుంటున్నారట హీరోయిన్ శ్రుతీహాసన్ . కన్ ఫ్యూజ్ కావొద్దు. ఇది బాలీవుడ్లో శ్రుతీహాసన్ ఒప్పుకున్న కొత్త సినిమా కథ అట. ‘ప్యాడ్‌మ్యాన్’, ‘కీ అండ్ కా’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఆర్. బాల్కీ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ షిప్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందనుందనే టాక్ బీ టౌన్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో తండ్రి పాత్రకు సన్నీ డియోల్నూ, కూతురు పాత్రకు శ్రుతీహాసన్నూ అనుకుందట చిత్రయూనిట్. కథ ప్రకారం ముంబయ్‌లో ఉన్న కూతురు తండ్రితో విభేదించి లండన్ వెళ్లిపోతుందట. ఆ తర్వాత తన తండ్రి కష్టం గురించి తెలుసుకుని కూతురు ఎలా కన్విన్స్ అయ్యిందన్నదే బాల్కీ కథలో మెయిన్ పాయింట్ అని సమాచారం. -
పాడ్‌మాన్ ట్రైలర్.. అక్కీ గట్స్‌కి హాట్సాఫ్
సాక్షి, సినిమా : బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఈ మధ్య తన చిత్రాల ఎంపికలో మాములు వైవిధ్యం ప్రదర్శించటం లేదు. యాక్షన్ కిలాడీగా పేరున్న ఆయన గత కొంత కాలంగా ఆ ట్యాగ్ లైన్‌కు దూరంగా ఉంటూ విమర్శకుల చేత శభాష్ అనిపించుకునే కథలను ఎంచుకుంటున్నారు. ఎయిర్‌లిఫ్ట్, రుస్తుం, టాయ్‌లెట్-ఏక్ ప్రేమ్‌కథా ఇలా వరుసపెట్టి చేసిన చిత్రాలే అందుకు నిదర్శనం. ఇక ఇప్పుడు కొత్త చిత్రం పాడ్‌మాన్ కూడా ఆ కోవలోనిదే. ఆ చిత్ర ట్రైలర్ కాసేపటి క్రితం వచ్చేసింది. అమెరికాకు స్పైడర్ మాన్ ఉన్నాడు.. బ్యాట్ మాన్ ఉన్నాడు. సూపర్ మాన్ ఉన్నాడు. ఇక ఇండియాకు పాడ్ మాన్ ఉన్నాడు అంటూ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలయింది. దేశానికి కావాల్సింది శక్తివంతమైన మహిళలే అని హీరో ట్రైలర్ డైలాగ్ చెప్పటం చూడొచ్చు. అతని వ్యవహారం నచ్చక భార్య, కుటుంబం దూరమైన క్రమంలో అతనికి సాయం అందించే పాత్రలో సోనమ్ కపూర్ నటించింది. ఇక అక్షయ్ భార్య పాత్రలో రాధికా ఆప్టే కనిపించింది. కాస్త వైవిధ్యం, కొన్ని పాయింట్లు ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ కథలో కంటెంట్ మాత్రం చాలా బలంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. మహిళల సమస్యపై ఇంత బోల్డ్‌గా నటించే ధైర్యం బహుశా అక్కీ తప్ప మరెవరూ చేయరేమో. ఇక 'పాడ్‌మాన్' కథ విషయానికొస్తే... అరుణాచలం మురుగనాథం అనే ఓ సోషల్ ఎంట్రపెన్యూర్కి సంబంధించిన కథ. భారతదేశంలో అతి తక్కువ ధరకి శానిటరీ నేప్కిన్స్ని అందజేయ్యొచ్చునని నిరూపించిన వ్యక్తి.. అంతర్జాతీయ సత్కారాలు కూడా అందుకున్న అతని బయోపిక్ ని దర్శకుడు ఆర్ బాల్కీ దృశ్యరూపకంగా పాడ్‌మాన్ పేరుతో మలిచారు. రిపబ్లిక్ డే కానుకగా పాడ్‌మాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. Presenting the much awaited #PadManTrailer, this one's for the mad ones, the ones who are crazy enough to change the world https://t.co/o2NiC2q1SU@PadManTheFilm @sonamakapoor @radhika_apte @mrsfunnybones @SonyPicsIndia @kriarj #RBalki — Akshay Kumar (@akshaykumar) December 15, 2017 -
'కీ అండ్ కా' మూవీ రివ్యూ
టైటిల్ : కీ అండ్ కా జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : అర్జున్ కపూర్, కరీనా కపూర్, స్వరూప్ సంపత్ సంగీతం : ఇళయరాజా, మిథున్ దర్శకత్వం : ఆర్ బాల్కీ నిర్మాత : ఈరోస్ ఇంటర్ నేషనల్ కమర్షియల్ మూస సినిమాలను పక్కన పెట్టి చీనికమ్, షమితాబ్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తున్న బాలీవుడ్ దర్శకుడు ఆర్ బాల్కీ, తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ డ్రామ కీ అండ్ కా. లడకీ లడకా అన్న పదాల నుంచి కీ, కా అనే అక్షరాలను ఈ సినిమాకు టైటిల్ గా తీసుకున్నారు. ఉద్యోగం పురుష లక్షణం అన్న వాదాన్ని పక్కన పెట్టి, భర్త ఇంటి పని చేస్తూ, భార్య కెరీర్‌కు సాయపడటం అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. బాల్కీ డైరెక్షన్‌తో పాటు, అర్జున్, కరీనా కెమీస్ట్రీపై భారీ అంచనాలున్న కీ అండ్ కా రిలీజ్ తరువాత ఆ అంచనాలను అందుకుందా..? కథ : తన స్వతంత్ర భావాలకు పెళ్లి అడ్డుకాకూడదని, కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదగాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకుంటుంది కియా(కరీనా కపూర్). అబ్బాయి, అమ్మాయి అన్న తేడా ఉండకూడదూ అందరూ సమానమే అన్న భావనలో ఉండే ఆధునిక యువకుడు కబీర్(అర్జున్ కపూర్). తన తండ్రి బిజినెస్ చూసుకోమని చెపుతున్నా అవి పట్టించుకోకుండా తన భార్యకు బదులుగా ఇంట్లో పనులన్ని చక్కపెట్టే బాధ్యతను తాను తీసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో కియాను చూసి ప్రేమలో పడతాడు. తాను భార్యను ఉద్యోగానికి పంపి తను ఇంటి పనులు చూసుకోవాలనుకుంటున్నానని చెపుతాడు. కబీర్‌ను పెళ్లి చేసుకుంటే తన కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో కియా పెళ్లికి అంగీకరిస్తుంది. కబీర్ తండ్రి ఒప్పుకోకపోయినా ఇద్దరు ఒక్కటవుతారు. పెళ్లి తరువాత కియా ఉద్యోగానికి వెళ్లటం, కబీర్ ఇంటి పనులు చేస్తుండటంతో కొంత మంది అభినందించినా, మరికొంత మంది మాత్రం విమర్శిస్తారు. అలా సాగిపోతున్న వారికి ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది. ప్రశాంతంగా ఉన్న వారి జీవితాలను ఇబ్బందుల పాలు చేసిన ఆ సమస్య ఏంటి..? దాని నుంచి కియా, కబీర్లు ఎలా బయట పడ్డారు అన్నదే మిగతా కథ. నటీనటులు : ఈ సినిమాలో ముందుగా మాట్లాడుకోవాల్సింది అర్జున్ కపూర్ గురించి. యంగ్ జనరేషన్ అంతా మాస్ ఇమేజ్ కోసం కష్టపడుతుంటే, ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌ను ఎంచుకున్న అర్జున్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తన నటనతో కబీర్ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. సీనియర్ హీరోయిన్ కరీనా కూడా అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది. స్వతంత్ర భావాలున్న ఆధునిక మహిళగా తనదైన నటన కనబరించింది. ముఖ్యంగా పెళ్లి తరువాత కూడా రొమాంటిక్ సన్నివేశాలతో కుర్రకారు మనసు దోచుకుంది. అతిథి పాత్రల్లో కనిపించిన అమితాబ్, జయా బచ్చన్లు సినిమాకు మరింత గ్లామర్ తీసుకువచ్చారు. సాంకేతిక నిపుణులు : కెరీర్ స్టార్టింగ్ నుంచి సందేశాత్మక చిత్రాలనే తీస్తూ వస్తున్న ఆర్ బాల్కీ మరోసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగించాడు. అయితే మేసేజ్ ఓరియంటెడ్ సినిమాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించటం కత్తిమీద సాము లాంటింది. ఈ సినిమా విషయంలో కూడా కథ కథానాల పరంగా అంతా బాగానే ఉన్నా సాగదీసినట్టుగా అనిపించింది. సంగీతం కథానుగుణంగా చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం సినిమా రేంజ్ ను పెంచింది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : అర్జున్ కపూర్, కరీనా కపూర్ ఫస్ట్ హాఫ్ కామెడీ సంగీతం మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ స్లో నారేషన్ ఓవరల్‌గా కీ అండ్ కా ఓ సెక్షన్ ఆడియన్స్‌ను అలరించే డిఫరెంట్ మూవీ -
ఆ కండిషన్‌తోనే పెళ్లి చేసుకున్నా: హీరోయిన్
బాలీవుడ్ సెలబ్రిటీ దంపతుల్లో మొదటి వరుసలో వినిపించే పేరు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీఖాన్. కొంతకాలంగా అన్యోన్యంగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ఆనందిస్తోంది ఈ జంట. అయితే తాజాగా తమ పెళ్లి గురించి ఆసక్తికరమైన సంగతిని కరీనా వెల్లడించింది. ఒకే ఒక కండిషన్‌తో తాను సైఫ్‌ను పెళ్లాడానని, తాను జీవితాంతం పనిచేస్తానని, అందుకు ఆయన మద్దతు ఇవ్వాలని కండిషన్ పెట్టానని, అందుకు సైఫ్ ఒప్పుకోవడంతో తాము ఆనందంగా పెళ్లి చేసుకున్నామని ఈ బ్యూటీ తెలిపింది. క్రియేటివ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కి అండ్ కా' సినిమాలో కరీనా కెరీర్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే మహిళ పాత్రలో కనిపిస్తుండగా.. ఆమె భర్తగా ఇంటిదగ్గరే ఉండి అన్ని పన్నులు చేసే హౌస్ హజ్బెండ్‌గా అర్జున్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కరీనా విలేకరులతో మాట్లాడుతూ 'మహిళను భూమాతతో పోలుస్తారు. మహిళలకు అధిక శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. వాళ్లు ఎన్నో పనులను ఏకకాలంలో చక్కబెట్టగలరు' అంటూ కీర్తించింది. ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తి రేపుతున్న 'కి అండ్ కా' సినిమా ట్రైలర్లో అర్జున్ కపూర్ మెడలో కరీనా తాళి కడుతూ కనిపించడం గమనార్హం. ఇలా భర్తకు భార్య తాళి కట్టడం గురించి కరీనాను అడిగితే.. 'ఇలాంటిదైతే గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా గొప్ప ఐడియా. (సినిమాలో) అతను తాళిని గర్వంగా ధరించడమే కాదు ఎంతో సెక్సీగా కూడా కనిపించాడు' అంటూ నవ్వులు రువ్వింది. అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయాబచ్చన్ కూడా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆ కాస్ట్యూమ్ 32 కేజీలు
ప్రస్తుతం ఆర్ బాల్కీ దర్శకత్వంలో 'కీ అండ్ కా' సినిమాలో నటిస్తున్న కరీనా తన డెడికేషన్‌తో యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరుస్తోంది. బాల్కీ తన మార్క్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఓ భారీ సాంగ్‌ను ప్లాన్ చేశాడు. ఈ పాటలో కరీనా లుక్ గ్రాండ్‌గా కనిపించాలన్న ఉద్దేశంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో డ్రెస్ డిజైన్ చేయించారు. గ్రాండ్ లుక్ కోసం జర్దోసితో డిజైన్ చేసిన ఈ డ్రెస్ ఫైలన్గా 32 కేజీల బరువైంది. సినిమా అంతా పూర్తి వెస్ట్రన్ లుక్‌లో కనిపించే కరీనా అభిమానుల కోసం ఈ ఒక్కపాటలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించనుంది. ఇంత భారీ డ్రెస్‌తో రెండు రోజుల పాటు సాంగ్ షూట్లో పాల్గొంది కరీనా. బాస్కో కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్‌ను ముంబైలోని సబర్బన్ స్టూడియోలో చిత్రీకరించారు. అంత వేడిలో అంత బరువైన డ్రెస్‌తో రెండు రోజుల పాటు సాంగ్ షూట్లో పాల్గొన్న కరీనా డెడికేషన్, యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలే సైజ్ జీరోకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన కరీనా.. ఇంత బరువు ఎలా మోసిందా అని అంతా నోళ్లు తెరిచి ఉండిపోయారు. ఆర్ బాల్కీ దర్శకత్వంలో కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న 'కీ అండ్ కా' సినిమాలో కరీనాతో పాటు అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్, అర్జున్ కపూర్లు ఇతర లీడ్రోల్లో నటిస్తున్నారు. -
'అమితాబ్, ఇళయరాజా ఇద్దరూ పిల్లలే'
ఒకరు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. మరొకరు విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా. కానీ ఇద్దరికి ఇద్దరూ చిన్న పిల్లల్లాంటి వాళ్లేనని ఓ దర్శకుడు అన్నారు. ఆయనెవరో కాదు.. షమితాబ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఆర్.బాల్కి. గతంలో అమితాబ్ నటించిన 'పా' సినిమాకు కూడా బాల్కియే దర్శకుడు. తాజాగా షమితాబ్ సినిమాలో అమితాబ్ ఓ పాట పాడారు. భారతీయ సినిమా ప్రపంచంలో రెండు పెద్ద వ్యవస్థల లాంటి ఇద్దరు ప్రముఖులతో తాను సినిమా తీయడం చాలా అదృష్టమని బాల్కి అన్నారు. తాను ఇంతవరకు దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో వీళ్లిద్దరితో పనిచేశానన్నారు. ఇద్దరికీ సరిగ్గా 73 ఏళ్ల వయసే ఉందని.. కానీ రికార్డింగ్ రూంలో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరూ చిన్న పిల్లల్లా చాలా ఉద్వేగానికి గురయ్యారని బాల్కి చెప్పారు. పిల్లలను ఏదైనా బొమ్మల దుకాణంలో వదిలేస్తే ఎంత ఆనందంగా ఉంటారో.. వీళ్లిద్దరూ అప్పుడు అంత ఆనందంగా ఉన్నారన్నారు. ఈ వయసులో కూడా వాళ్ల ఉత్సుకత అంతలా ఉండటం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని బాల్కి చెప్పారు. అమితాబ్ గతంలో రాజేష్ రోషన్, శివ్-హరి, ఆదేశ్ శ్రీవాత్సవ, ఆర్డీ బర్మన్, కళ్యాణ్‌జీ - ఆనంద్జీ ఇలా.. పలువురు సంగీత దర్శకుల వద్ద పాడారు.