ఆ కాస్ట్యూమ్ 32 కేజీలు | Kareena kapoor wears 32 kg lehanga for ki and ka song | Sakshi
Sakshi News home page

ఆ కాస్ట్యూమ్ 32 కేజీలు

Published Fri, Oct 30 2015 8:52 AM | Last Updated on Mon, May 28 2018 4:05 PM

ఆ కాస్ట్యూమ్ 32 కేజీలు - Sakshi

ఆ కాస్ట్యూమ్ 32 కేజీలు

ప్రస్తుతం ఆర్ బాల్కీ దర్శకత్వంలో 'కీ అండ్ కా' సినిమాలో నటిస్తున్న కరీనా తన డెడికేషన్తో యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరుస్తోంది. బాల్కీ తన మార్క్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఓ భారీ సాంగ్ను ప్లాన్ చేశాడు. ఈ పాటలో కరీనా లుక్ గ్రాండ్గా కనిపించాలన్న ఉద్దేశంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో డ్రెస్ డిజైన్ చేయించారు. గ్రాండ్ లుక్ కోసం జర్దోసితో డిజైన్ చేసిన ఈ డ్రెస్  ఫైలన్గా 32 కేజీల బరువైంది.  సినిమా అంతా పూర్తి వెస్ట్రన్ లుక్లో కనిపించే కరీనా అభిమానుల కోసం ఈ ఒక్కపాటలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించనుంది.

ఇంత భారీ డ్రెస్తో రెండు రోజుల పాటు సాంగ్ షూట్లో పాల్గొంది కరీనా. బాస్కో కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ను ముంబైలోని సబర్బన్ స్టూడియోలో చిత్రీకరించారు. అంత వేడిలో అంత బరువైన డ్రెస్తో రెండు రోజుల పాటు సాంగ్ షూట్లో పాల్గొన్న కరీనా డెడికేషన్, యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలే సైజ్ జీరోకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన కరీనా.. ఇంత బరువు ఎలా మోసిందా అని అంతా నోళ్లు తెరిచి ఉండిపోయారు. ఆర్ బాల్కీ దర్శకత్వంలో కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న 'కీ అండ్ కా' సినిమాలో కరీనాతో పాటు అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్, అర్జున్ కపూర్లు ఇతర లీడ్రోల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement