'అమితాబ్, ఇళయరాజా ఇద్దరూ పిల్లలే' | amitabh and illayaraja both are like kids, says r balki | Sakshi
Sakshi News home page

'అమితాబ్, ఇళయరాజా ఇద్దరూ పిల్లలే'

Published Fri, Jan 2 2015 7:05 PM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

'అమితాబ్, ఇళయరాజా ఇద్దరూ పిల్లలే'

'అమితాబ్, ఇళయరాజా ఇద్దరూ పిల్లలే'

ఒకరు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. మరొకరు విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా. కానీ ఇద్దరికి ఇద్దరూ చిన్న పిల్లల్లాంటి వాళ్లేనని ఓ దర్శకుడు అన్నారు. ఆయనెవరో కాదు.. షమితాబ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఆర్.బాల్కి. గతంలో అమితాబ్ నటించిన 'పా' సినిమాకు కూడా బాల్కియే దర్శకుడు. తాజాగా షమితాబ్ సినిమాలో అమితాబ్ ఓ పాట పాడారు. భారతీయ సినిమా ప్రపంచంలో రెండు పెద్ద వ్యవస్థల లాంటి ఇద్దరు ప్రముఖులతో తాను సినిమా తీయడం చాలా అదృష్టమని బాల్కి అన్నారు. తాను ఇంతవరకు దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో వీళ్లిద్దరితో పనిచేశానన్నారు.

ఇద్దరికీ సరిగ్గా 73 ఏళ్ల వయసే ఉందని.. కానీ రికార్డింగ్ రూంలో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరూ చిన్న పిల్లల్లా చాలా ఉద్వేగానికి గురయ్యారని బాల్కి చెప్పారు. పిల్లలను ఏదైనా బొమ్మల దుకాణంలో వదిలేస్తే ఎంత ఆనందంగా ఉంటారో.. వీళ్లిద్దరూ అప్పుడు అంత ఆనందంగా ఉన్నారన్నారు. ఈ వయసులో కూడా వాళ్ల ఉత్సుకత అంతలా ఉండటం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని బాల్కి చెప్పారు. అమితాబ్ గతంలో రాజేష్ రోషన్, శివ్-హరి, ఆదేశ్ శ్రీవాత్సవ, ఆర్డీ బర్మన్, కళ్యాణ్జీ - ఆనంద్జీ ఇలా.. పలువురు సంగీత దర్శకుల వద్ద పాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement