shamitabh
-
నా పెళ్లి డ్రెస్ కూడా ఇలానే ఉండాలి!
మేని ఛాయకు రెట్టింపు అందం చేకూర్చే లేలేత గులాబీ రంగు గాగ్రా చోళీలో అక్షరా హాసన్ ఎర్ర తివాచీపై ప్రత్యక్షం కాగానే, ఒక్కసారిగా అందరి చూపులూ ఆమెపైనే పడ్డాయి. చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వి, సుతిమెత్తగా అడుగులేస్తూ, వయ్యారంగా అక్షర నడుస్తుంటే చూపులు తిప్పుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. ఇటీవల అక్షర చేసిన ఓ ర్యాంప్ వాక్‌లో ఇలా జరిగింది. డిజైనర్ రీనా ధాకా కోసమే అక్షర ఈ వాక్ చేశారు. ఆమె డిజైన్ చేసిన లేలేత గులాబీ రంగు గాగ్రా చోళీలో అక్షర మెరిసిపోయారు. ఆ డిజైనర్ వేర్ చాలా సౌకర్యవంతంగా అనిపించిందని, చాలా నచ్చిందని అక్షర పేర్కొన్నారు. ఆ డ్రెస్ ఆమెకు ఎంతగా నచ్చిందంటే, తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఈ డిజైనర్ వేర్లాంటిదే డిజైన్ చేసివ్వమని రీనాని అడుగుతానని అంటున్నారు. ఫ్యాషన్ గురించి అక్షర మాట్లాడుతూ - ‘‘ఎంత ఖరీదు గల డ్రెస్ వేసుకున్నా, అది శరీర కొలతలకు తగ్గట్గుగా లేకపోతే వేస్ట్. అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, మనసంతా ఆ డ్రెస్ మీదే ఉంటుంది. నా మటుకు నేను ఏ డ్రెస్ వేసుకున్నా కంఫర్ట్‌గా ఉండాలనుకుంటాను. ఆ తర్వాతే ఫ్యాషన్ గురించి ఆలోచిస్తాను’’ అన్నారు. ఇదిలా ఉంటే, ‘షమితాబ్’ చిత్రం ద్వారా అక్షర కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలై, ఆరు నెలలవుతున్నా ఆమె వేరే చిత్రం అంగీకరించలేదు. ప్రస్తుతం కొన్ని చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, తాను చేయబోయే చిత్రం గురించి త్వరలో ప్రకటిస్తానని అక్షర పేర్కొన్నారు. తండ్రి కమల్‌హాసన్, అక్క శ్రుతీహాసన్‌తో కలిసి నటించే అవకాశం వస్తే, తప్పకుండా చేస్తానని కూడా ఆమె అన్నారు. -
నేను ఎటువంటి హద్దులు పెట్టుకోలేదు:అక్షర
ముంబై:అక్షర్ హాసన్.. ఈ మధ్యనే షమితాబ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తాను ఇండస్ట్రీలో ఎటువంటి హద్దులు పెట్టుకోలేదని అంటోంది.చిత్ర సీమలో ఎదగాలంటే ఫలనా మూవీనే చేయాలంటూ నియమాలు పెట్టుకోకూడదని స్పష్టం చేసింది.' మీరు హద్దులు ఏర్పరుచుకుంటే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టం. ఏ పాత్ర వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటాం' అని అక్షర తెలిపింది. తానైతే ఎటువంటి హద్దు ఏర్పరుచుకోకుండానే రాణిస్తానని పేర్కొంది. తనకు గత కొంత కాలంగా నటించే అవకాశాలు వస్తున్నా సరైన సమయం కోసం వేచి చూశానని తెలిపింది.తాను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కావడం వల్ల ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పోయానని పేర్కొంది. ధనుష్-అమితాబ్ బచ్చన్ లు నటించిన షమితాబ్ సినిమాలో తనకు అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. -
'నాకైతే ఇగో లేదు'
దుబాయ్: సెలిబ్రెటీ రేంజ్ కు వెళితే ఎవరికైనా కాస్తా కూస్తో ఇగో కూడా ఉంటుంది. అయితే మన బిగ్ బి అమితాబ్ బచ్చన్(72) కు అసలు ఇగోనే లేదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. షమితాబ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా తన అధికారిక బ్లాగ్ లో అమితాబ్ తన అభిప్రాయాల్ని పంచుకున్నాడు. ఈ చిత్రంలో ధనుష్, అక్షర, అమితాబచ్చన్ లు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ స్పందిస్తూ.. తన వృత్తిలో ఎప్పుడూ ఇగోను దరిచేరనీయలేదన్నాడు. తనకు సొంత ప్రయోజనాలు, సొంత అభిప్రాయాల గురించి తెలియదన్నాడు. అసలు ఆ విషయాన్ని కొస్తే తన సొంత ప్రయోజనాలకు ఏనాడు పెద్ద పీట వేయలేదని అమితాబ్ స్పష్టం చేశాడు. మిగతా వారికి ఇగో ఉందా?లేదా అనేది తనకు తెలియదన్నాడు. -
భయపడలేదు
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌తో నటించడానికి ఏ మాత్రం భయపడలేదని నటుడు ధనుష్ వ్యాఖ్యానించారు. రాంజనా చిత్రం తరువాత ఈయన హిందీలో నటిస్తున్న రెండో చిత్రం షమితాబ్. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు కమలహాసన్ రెండో కూతురు అక్షర హాసన్ కథా నాయకిగా పరిచయమవుతున్నారు. ఇంతకుముందు అమితాబ్‌తో పా, చీనికుం, శ్రీదేవి రీ ఎంట్రీ చిత్రం ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన బాల్కీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం షమితాబ్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6న తెరపైకి రానున్న ఈ చిత్రం గురించి వివరాలు వెల్లడించడానికి శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలోని సత్యభామ కళాశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న నటుడు ధనుష్ మాట్లాడుతూ హిందీలో తన తొలి చిత్రం రాంజనా చిత్రం తరువాత మరో మంచి చిత్రం కోసం సుమారు 8 నెలలు వేచి ఉన్నానన్నారు. అలాంటి సమయంలో దర్శకుడు బాల్కీ నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. ఆయన చెప్పిన కథ వినగానే మరోమాట లేకుండా నటించడానికి అంగీకరించానని చెప్పారు. ఆ చిత్రమే ఈ షమితాబ్ అన్నారు. ఇందులో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ ప్రధాన పాత్రలను ధరించనున్నారని చెప్పగానే భయపడలేదు గానీ, ఆయనతో నటించడానికి చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూశానన్నారు. కారణం అమితాబ్ లాంటి గొప్ప నటుడి నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చనే ఆశతోనేనన్నారు. ఇక షమితాబ్ అంటే తన దృష్టిలో ఇళయరాజానేనన్నారు. అంత అద్భుతంగా ఆయనీ చిత్రానికి సంగీతాన్ని అందించారన్నారు. ఆయనతో నటించడం మధురమైన అనుభవంగా ధనుష్ పేర్కొన్నారు. నటి అక్షరతో నటించడం చక్కని అనుభూతిగా పేర్కొన్నారు. దర్శకుడు బాల్కీ మాట్లాడుతూ ధనుష్‌లో చాలా మంచి నటుడు ఉన్నాడని, ఆయన జాతీయ స్థాయి నటుడని పేర్కొన్నారు.అదృష్టం : నటి అక్షర మాట్లాడుతూ తొలి చిత్రం ఇంత భారీగా అమరడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. షమితాబ్ చిత్రంలో నటించడం ఆశ్చర్యంతో పాటు, సంతోషంగా ఉందన్నారు. చిత్రంలో ధనుష్ చాలా ఫవర్‌ఫుల్ పాత్రలో నటించారని అక్షర చెప్పారు. -
నటన అక్షర రక్తంలోనే ఉంది:ధనుష్
చెన్నై: కమల హాసన్ గారాల పట్టి అక్షర హాసన్ ను నటుడు ధనుష్ పొగడ్తలతో ముంచెత్తాడు. అక్షర రక్తంలోనే నటన ఉందని ధనుష్ కితాబిచ్చాడు. ఆమె తొలి చిత్రం "షమితాబ్" ను ఎంతో ఛాలెంజింగ్ తీసుకుని చేయడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. "ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా కీలకమైంది. ఈ పాత్ర చేయడానికి అక్షర ఎలాంటి సమస్యా ఎదుర్కొన్నట్లు నాకు అనిపించలేదు. ఎందుకంటే నటన అనేది ఆమె రక్తంలోనే ఉంది కాబట్టే అది సాధ్యమైందనుకుంటున్నాను' అని ధనుష్ పేర్కొన్నారు. షమితాబ్ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఆర్. బాలకృష్ణన్(బాల్కీ) దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన అనుభవాల గురించి వివరిస్తూ.. తాను ఆయనతో కలిసి నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. అలాంటి మెగాస్టార్ తో కలిసి నటిస్తున్నప్పుడు సహ నటులు సినిమాకోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదని ధనుష్ పేర్కొన్నాడు. -
అక్షర ఆరంభం
అక్షర... ఈ మూడు అక్షరాల వెనుక పెద్ద నటనాధ్యాయమే ఉంది. నటననే శ్వాసి స్తూ దాన్ని శాసించే స్థాయికి ఎదిగిన కమలహాసన్, సారికల ముద్దు బిడ్డ అక్షరహాసన్. నటనలో ఎదుగుతున్న శ్రుతి హాసన్ చెల్లెలు. మొత్తం మీద నటనే నమ్ముకున్న కుటుంబం నుంచి నటనలో నడకలు నేర్చుకోవడానికి శ్రీకా రం చుట్టిన అక్షర తొలి అడుగు ఫలితం కోసం చెప్పలేనంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అక్షరహాసన్ నటించిన తొలి చిత్రం షమితాబ్ (హిందీ) చిత్రం త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా నటన లో ఓనమాలు దిద్దుకున్న ఈ బ్యూటీ పలుకులు ఏంటో చూద్దాం. తొలి చిత్ర అనుభవం షమితాబ్ చిత్రంలో నటించడం చాలా తీయని అనుభవం. అమితాబ్‌బచ్చన్ లాంటి గొప్ప నటులతో పని చేసిన బాల్కి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం తో ఎగ్జైట్‌గా ఫీల్ అయ్యాను. అంతేకాదు నా తొలి చిత్రంలోనే అమితాబ్ తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అలాగే ధనుష్ నుంచి కూడా. ఈ చిత్ర యూ నిట్ లో అందరికన్నా అన్ని విషయాల్లోనూ చిన్నదాన్ని నేనే. నాన్న నుంచి చాలా నేర్చుకున్నా అయితే నటన విషయంలో అమ్మానాన్నల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక నేను వాళ్ల జీన్స్‌ను కాబట్టి వారి క్వాలిటీస్ నాలో సహజంగానే ఉంటాయి. అయితే అమ్మానాన్నలు లోతైన ఆలోచనలు నన్నిప్పటికీ విస్మయపరుస్తుంటాయి. నటన లో నాన్న నుంచి చాలా టిప్స్ పొందాను. సమాజాన్ని కూడా సున్నితంగా గమని స్తుంటాను. సగటు మనిషి ప్రవర్తన ఎలాంటిదని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కారణం అదే షమితాబ్ చిత్రానికి ముందు తమిళం లో మణిరత్నం దర్శకత్వంలో కడల్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిం ది. అయితే ఆ సమయంలో నేను నటన గురించి ఆలోచించలేదు. బాలీవుడ్ దర్శకుడు రాహుల్ డోల కియా వద్ద సహాయ దర్శకులుగా పని చేస్తున్నాను. కెమెరావెనుక చాలా నేర్చుకోవాలన్న దృక్పథంలోనే ఉన్నాను. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో నేను నృత్యం నేర్చుకుంటున్నాను. అందుకే మణిరత్నం చిత్రంలో నాయికిగా నూరుశా తం న్యాయం చేయగలనా అన్న సందేహం కారణంగా ఆ అవకాశాన్ని అందుకోలేకపోయాను. షమితాబ్లో అవకాశం ఎలా వచ్చింది? ఒకరోజు క్యాజువల్‌గా దర్శకుడు బాల్కిని కలిశాను. ఆ సమయంలో ఆయన షమితాబ్ చిత్రం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఆ స్క్రిప్ట్ పూర్తిగా చదివి ఎలా ఉం దని నా వైపు చూశారు. ఆయన స్క్రిప్టు నరేషన్ చేసిన విధానం చూసి నేను బౌల్డ్ అయిపోయాను. అదే విషయాన్ని ఆయనతో చెప్పాను. అందులో నాయికి పాత్ర చేస్తావా? అని అడిగారు. వెంటనే నేను ఎస్ అన్నాను. అయినా రెండు రోజులు గడువు అడిగి మా అమ్మతో సంప్రదించాను. అమ్మ నిర్ణయాన్ని నాకే వదిలేశారు. దీంతో నటించడానికి సిద్ధం అయ్యాను. షమితాబ్ చిత్రం చూశాక.. షమితాబ్ చిత్రం చూసిన తరువాత నా నిర్ణయం రైట్ అనిపించింది. అయితే అది నన్ను సముచిత స్థాయికి చేర్చుతుందని ఇప్పుడే చెప్పలేను. ఎలా ఆదరిస్తారన్నది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. అయితే ఒక మంచి చిత్రం ద్వారా పరిచయం అవుతున్నానన్న సంతృప్తి మాత్రం నాకుంది. అక్క శ్రుతి హాసన్ మాదిరిగానే భారతీయ నటిగా పేరు తెచ్చుకోవాలనుంది. తమిళంలోనూ మంచి కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను. చాలా అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే మంచి చిత్రం ఎంచుకుని నటిస్తాను. -
శృతీహాసన్ సోదరి ప్రేమ!
ముంబై: టాలీవుడ్ - కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకొని హిందీలో కూడా నటిస్తున్న శృతీహాసన్ తన సోదరి అక్షర హాసన్‌పై అమితమై ప్రేమ వ్యక్తం చేస్తోంది. తన సోదరి అక్షర హాసన్ నటించిన తొలి చిత్రం 'షమితాబ్' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. షమితాబ్ ట్రైలర్ తనకు బాగా నచ్చిందన్నారు. శృతీహాసన్ నటించిన ఆరు చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వాటిలో నాలుగు హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఒక్కో చిత్రం ఉన్నాయి. ఆర్.బల్కీ దర్శకత్వంలో రూపొందుతున్నఅక్షర హాసన్ ప్రారంభ చిత్రం షమితాబ్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అలనాటి బాలీవుడ్ హీరోయిన్ రేఖ, తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. సోదరి అక్షర హాసన్‌తోపాటు ఈ సినిమా యూనిట్ మొత్తానికి శృతీహాసన్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. -
తెరపై మళ్ళీ ఆ జంట!
ఇప్పుడు హిందీ చిత్రసీమలో ఎక్కడ చూసినా ‘షమితాబ్’ చిత్రం గురించే వినిపిస్తోంది. బిగ్ బి - అమితాబ్ బచ్చన్, తమిళ హీరో ధనుష్, కమలహాసన్ కుమార్తె అక్షర హాసన్‌లు కలసి నటిస్తున్న చిత్రమిది. కథ గురించి బయటకు రాకుండా దర్శక, నిర్మాతలు జాగ్రత్తపడ్డ ఈ చిత్రంలో విశేషం ఏమిటంటే, చాలా కాలం తరువాత అమితాబ్, ఆయన నిజజీవిత మాజీ ప్రేయసి రేఖ కలసి నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో వారిద్దరూ కలసి ఏకకాలంలో తెరపై కనిపించరు. ‘‘సినిమా చూసినప్పుడు అది ఎలా చిత్రీకరించారన్నది మీకు అర్థమవుతుంది’’ అని అమితాబ్ అన్నారు. విఫలమైన ప్రేమబంధం కారణంగా అమితాబ్కూ, రేఖకూ మధ్య ఎంతో కాలంగా నెలకొన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడీ తాజా పరిణామం నేపథ్యంలో ‘‘ఆసక్తికరమైన స్క్రిప్టు వస్తే - భవిష్యత్తులో కూడా రేఖతో కలసి నటిస్తా’’ అని అమితాబ్ అన్నారు. ముప్ఫై ఏళ్ళ క్రితం 1985లో ‘గెరఫ్తార్’ చిత్రంలో రజనీకాంత్, కమలహాసన్‌లతో కలసి నటించిన అమితాబ్ ఇప్పుడు ‘షమితాబ్’లో వారి వారసులతో (రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమలహాసన్ కుమార్తె అక్షర) తెరపై కనిపించనుండడం విశేషమే. -
రేఖతో నటించేందుకు నేను రెడీ
ముంబై: బాలీవుడ్ అందాల తార రేఖతో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. గురువారం షమితాబ్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా రేఖతో నటించేందుకు తాను సిద్ధమేనంటూ అమితాబ్ తన మనస్సులోని మాటను బయటపెట్టారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సిల్సిలా, మిస్టర్ నట్వర్లాల్, ముఖద్దార్ కా సికిందర్ చిత్రాలు బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే రేఖలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన బిగ్‌బీ మాటలకు ఆమె భార్య ఎలా స్పందిస్తుందో చూడాలి. -
'అమితాబ్, ఇళయరాజా ఇద్దరూ పిల్లలే'
ఒకరు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. మరొకరు విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా. కానీ ఇద్దరికి ఇద్దరూ చిన్న పిల్లల్లాంటి వాళ్లేనని ఓ దర్శకుడు అన్నారు. ఆయనెవరో కాదు.. షమితాబ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఆర్.బాల్కి. గతంలో అమితాబ్ నటించిన 'పా' సినిమాకు కూడా బాల్కియే దర్శకుడు. తాజాగా షమితాబ్ సినిమాలో అమితాబ్ ఓ పాట పాడారు. భారతీయ సినిమా ప్రపంచంలో రెండు పెద్ద వ్యవస్థల లాంటి ఇద్దరు ప్రముఖులతో తాను సినిమా తీయడం చాలా అదృష్టమని బాల్కి అన్నారు. తాను ఇంతవరకు దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో వీళ్లిద్దరితో పనిచేశానన్నారు. ఇద్దరికీ సరిగ్గా 73 ఏళ్ల వయసే ఉందని.. కానీ రికార్డింగ్ రూంలో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరూ చిన్న పిల్లల్లా చాలా ఉద్వేగానికి గురయ్యారని బాల్కి చెప్పారు. పిల్లలను ఏదైనా బొమ్మల దుకాణంలో వదిలేస్తే ఎంత ఆనందంగా ఉంటారో.. వీళ్లిద్దరూ అప్పుడు అంత ఆనందంగా ఉన్నారన్నారు. ఈ వయసులో కూడా వాళ్ల ఉత్సుకత అంతలా ఉండటం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని బాల్కి చెప్పారు. అమితాబ్ గతంలో రాజేష్ రోషన్, శివ్-హరి, ఆదేశ్ శ్రీవాత్సవ, ఆర్డీ బర్మన్, కళ్యాణ్‌జీ - ఆనంద్జీ ఇలా.. పలువురు సంగీత దర్శకుల వద్ద పాడారు. -
నాకే దక్కనిది..
‘నాకే దక్కనిది నా కూతురుకు దక్కింది. ఇది చాలా గొప్ప విషయంగా భావించాలి’ అంటున్నారు నటుడు కమలహాసన్ మాజీ భార్య, నటి సారిక. వీరి కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరహాసన్. ఈ నట కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తిగానే ఉంటుంది. శ్రుతిహాసన్ తమిళం, తెలుగు, హిందీ లాంటి భాషల్లో నటిగా దుమ్ము రేపుతుంటే తాజాగా ఆమె చెల్లెలు అక్షరహాసన్ నటిగా రంగ ప్రవేశం చేశారు. శ్రుతి తొలుత లక్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్గా రంగ ప్రవేశం చేసినట్లే అక్షర కూడా అక్క బాటలోనే పయనిస్తూ షమితాబ్ అనే హిందీ చిత్రంలోనే హీరోయిన్గా పరిచయమవుతున్నారు. వీరి సినీ పయనం వెనుక వాళ్ల తల్లి సారిక పాత్ర చాలా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం శ్రుతి తనీగా నివసిస్తోంది. అక్షర మాత్రం తల్లితోనే ఉంటున్నారు. అక్షర తొలుత దర్శకత్వ శాఖపై మొగ్గు చూపారు. ఆ విధంగా బాలీవుడ్ దర్శకుడు రాహుల్ దొలాక్య వద్ద శిష్యరికం కూడా చేశారు. అలాంటిది ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఆమె తల్లి సారిక స్పందిస్తూ దర్శకత్వంపై ఆసక్తి చూపిన అక్షర కథానాయకిగా మారడంతో తనకేమి ఆశ్చర్యం అనిపించలేదన్నారు. హిందీ చిత్రం షమితాబ్లో నటించే అవకాశం రాగానే తను ఒక విశ్వ విద్యాలయంలో చేరుతున్న భావం తనకు కలిగిందన్నారు. కారణం జాతీయ అవార్డు గ్రహీతలు అమితాబ్ బచ్చన్, ధనుష్‌లు ఆ చిత్రంలో నటించడమేనని అన్నారు. అక్షర గురించి ఒక్క విషయం చెప్పాలి. తను భయం అంటే ఏమిటో తెలియని వ్యక్తి. అయినా అమాయకురాలని అన్నారు. ఏవిషయమైనా అనుభవపూర్వకంగా చేస్తుందని తెలిపా రు. తన కళ్లకు చిన్నపిల్ల అనిపించినా ఎప్పటికైనా ఆమె జీవతం గురించి తనే నిర్ణయం తీసుకోవాలి కదా అని నటి అవ్వాలనే నిర్ణయాన్ని తనకే వదిలేశానని అన్నారు. షమితాబ్ షూటింగ్ మొదలైన నాటి నుంచి ప్రతిరోజూ ఆమె కోసం తాను ఇంట్లో ఎదురు చూస్తుంటానని తెలిపా రు. నటిగా ఆమె పని గురించి తనకు బాగానే తెలుసన్నారు. ఇకపోతే అమితాబ్‌బచ్చన్ లాంటి నటుడితో తనకు బుల్లితెరపైనే నటించే అవకాశం వచ్చిందని, అలాంటిది అక్షరకు తొలి చిత్రంలోనే ఆయనతో కలిసి నటించే అవకాశం కలగడం చాలా గొప్ప విషయమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
అక్షర.. సూపర్!
ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే కమల్‌హాసన్ చిన్న కూతురు అక్షరను ఆకాశానికెత్తేస్తున్నారు సినిమా జనం. తాను రూపొందిస్తున్న ‘షమితాబ్’ చిత్రంలో ముగ్గురు హీరోలంటూ ఆర్.బాల్కీ రీసెంట్గా సెలవిచ్చాడు. అందులో ఒకరు ఎవర్గ్రీన్ అమితాబ్‌బచ్చన్, ఇంకొకరు టాలెంటెడ్ ధనుష్, మూడోవారు అక్షరట. కమల్ - సారికల్లోని టాలెంట్‌ను అక్షరలో కనిపిస్తోందని చెబుతున్నాడు. ‘జెనెటిక్ సైన్స్ నిజమని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం అక్షర. ఆమెను చూస్తుంటే నటించడానికే పుట్టినట్టుంటుంది. ఇద్దరు మహామహులతో పోటీపడి అదరగొట్టింది’ అన్నాడు. పిక్చర్ బయటకు వస్తే గానీ ఎంతగా అదరగొట్టిందో తెలియదు మరి! -
కమల్ హాసన్ రెండవ కుమార్తె అక్షర హాసన్ తెరంగేట్రం
దేశం గర్వించదగ్గ హీరో కమల్ హాసన్, ప్రముఖ బాలీవుడ్ నటి సాగరికల రెండో కుమార్తె అక్షర హాసన్ వెండితెర పరిచయానికి సిద్ద అయ్యింది. తొలి అడుగు బాలీవుడ్లో వేసింది. మొదట దర్శకత్వ విభాగంలో పనిచేయాలని అక్షర ఆశించింది. అయితే చివరకు అమ్మ, అక్కలాగా హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించే హిందీ చిత్రంలో అతనికి జోడీగా నటిస్తోంది. 'షమితాబ్' అన్న పేరు ఖరారు చేసి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవల విడుదల చేశాడు. సోదరి శృతిహాసన్ ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఓ వెలుగు వెలుగుతుండటంతో అక్షర హాసన్‌కు కూడా మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు. అయితే ధనుష్, శృతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన '3' సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఇప్పుడు ధనుష్ - అక్షర జంటగా నటిస్తున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల ఆదరణ పొందగలదో విడుదల తర్వాత గానీ తెలియదు. షూటింగ్లో అక్షర పనితీరును గమనించిన సినీ పండితులు కోలీవుడ్, టాలీవుడ్‌లలో అక్క శృతి హాసన్‌కు పోటిగా నిలుస్తుందని అంటున్నారు. - శిసూర్య -
కామ్ గా పుట్టినరోజు జరుపుకున్న యువ హీరో
చెన్నై : కోలీవుడ్ యువ హీరో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ 31వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అతడు తన పుట్టినరోజు వేడుకల్ని కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితుల మధ్య ఆదివారం రాత్రి జరుపుకున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం 'షమితాబ్' ముంబయిలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అతడి సరసన కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బర్త్‌డే సందర్భంగా ధనుష్ తన తల్లిదండ్రులు, భార్య ఐశ్వర్యతో గడిపేందుకు ముంబయి నుంచి చెన్నై వచ్చాడు. ఈ సందర్భంగా ఐశ్వర్య ...ధనుష్ కు బర్త్డై పార్టీ ఏర్పాటు చేసి సర్ప్రయిజ్ చేసినట్లు సమాచారం. పుట్టినరోజు పార్టీలో కుటుంబ సభ్యులతో పాటు తమిళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు. ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్, అతని సతీమణి గీతాంజలి, హీరో శింబు, శ్రియ, అమలాపాల్, సురభి తదితరులు అ పార్టీలో హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన 26కేజీల కేక్‌ను ధనుష్ కట్ చేసాడు. ఇక ఈ సంవత్సరం ధనుష్‌కు ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఓవైపు బాలీవుడ్లో దూసుకుపోవటంతో పాటు, ధనుష్ నిర్మించి, నటించిన 'వేలై ఇల్లా పట్టాదారి' చిత్రం విజయబాటలో పయనిస్తోంది. గత వారం విడుదలైన ఈచిత్రం ఇప్పటికే రూ. 20 కోట్లు వసూలు చేసింది. -
సింహంలా షమితాబ్
పాత్రల ఎంపికలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ది ఓ విభిన్నమైన శైలి. ఐదు దశాబ్దాల సుదీర్ఘ నటప్రస్థానంలో మరపురాని పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మహానటుడాయన. ఆయన పోషించిన ఒక్కో పాత్రా నేటి తరానికి ఒక్కో పాఠ్యాంశం అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. 71 ఏళ్ల వయసులో కూడా 17 ఏళ్ల కుర్రాడిలాగా కుర్రహీరోలతో పోటీపడుతున్నారాయన. తాజాగా అమితాబ్ ’షమితాబ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. నెరిసిన జుత్తు, పెరిగిన గడ్డం, తీక్షణమైన చూపు... ఓవరాల్‌గా ఓ సింహాన్ని చూస్తున్న అనుభూతికి గురి చేస్తున్నారు ఈ ఫస్ట్‌లుక్‌లో అమితాబ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్‌బీ అభిమానులు పండుగ చేసుకునేలా ‘షమితాబ్’ ఫస్ట్‌లుక్ ఉంది. దీన్ని బట్టి... ఇందులో అమితాబ్ పాత్ర ఎలా ఉంటుందో ఓ అంచనా కొచ్చేస్తున్నారు ప్రేక్షకులు. మరో విషయం ఏంటంటే... ఈ ఫస్ట్‌లుక్ అమితాబ్‌కి కూడా విపరీతంగా నచ్చేసింది. అందుకే... ‘షమితాబ్’ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ని గోప్యంగా ఉంచడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు’అని తన సోషల్ మీడియా వైబ్సైట్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు బిగ్‌బీ. కమల్‌హాసన్ కుమార్తె అక్షర హాసన్, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ఫేం ఆర్.బాల్కీ దర్శకుడు. -
అమితాబ్ 'షమితాబ్' ఫస్ట్ లుక్ విడుదల
-
షమితాబ్ లుక్ విడుదల చేసిన అమితాబ్
తన కొత్త చిత్రం షమితాబ్ లుక్‌ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ఈ సినిమాలో అడ్డదిడ్డంగా పెరిగిన జుట్టు, గెడ్డంతో అమితాబ్ (71) చాలా విభిన్నంగా కనిపిస్తారు. ఫొటోగ్రాఫర్ల కంటపడకుండా ఈ సినిమా గెటప్‌ను ఎక్కువ కాలం దాచి ఉంచడం చాలా కష్టమని, అందుకే తాను విడుదల చేసేస్తున్నానని అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాతో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర కూడా బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వందలాది మొబైల్ కెమెరాలు తమ చుట్టూ ఉంటాయని, అలాంటప్పుడు వాటినుంచి ఈ గెటప్‌ను కాపాడటం చాలా కష్టమని బచ్చన్ తన బ్లాగులో కూడా రాశారు. షమితాబ్ సినిమాకు ఆర్ బాల్కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు అమితాబ్ నటించిన చీనీ కమ్, పా చిత్రాలకు కూడా బాల్కియే దర్శకుడు. గోవా, తమిళనాడులలో షూటింగ్ చేసుకున్న ఈ సినిమాలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. T 1551 - 'Shamitabh' in the day .. its quite an effort to live with that hair all day !! pic.twitter.com/ylY0dxUcB3 — Amitabh Bachchan (@SrBachchan) July 20, 2014 -
షమితాబ్ సినిమాలో పాట పాడుతున్న అమితాబ్
బాల్కి దర్శకత్వంలో కొత్తగా వస్తున్న 'షమితాబ్' చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ పాట పాడుతున్నారు. అవధేష్ శ్రీవాస్తవతో కలిసి ఆయన మ్యూజిక్ స్టూడియోలో రాత్రి చాలా సేపు కూర్చున్నానని, షమితాబ్ సినిమా కోసం మరోసారి తాను పాట పాడుతున్నానని అమితాబ్ తన బ్లాగ్ ద్వారా తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చిన అద్భుతమైన బాణీలకు తాను పాడానని ఆయన రాశారు. ఇళయరాజా సంగీత ప్రపంచంలో ప్రవేశించి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా, ఇప్పటికీ ఆయన స్వరాలు మాత్రం సరికొత్తగానే ఉంటాయని, ఆయన ప్రాధాన్యం అలాగే కొనసాగుతోందని అమితాబ్ చెప్పారు. చాలామంది సుప్రసిద్ధ సంగీతదర్శకులను ఆయన తయారుచేశారని, దాదాపు 900కు పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారని ప్రశంసల జల్లు కురిపించారు. షమితాబ్ చిత్రంలో రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమల్ కూతురు అక్షర కూడా నటిస్తున్నారు. అక్షర బాలీవుడ్ రంగప్రవేశం అమితాబ్ చిత్రంతో జరగడం విశేషం.