తెరపై మళ్ళీ ఆ జంట! | Amitabh Bachchan at Shamitabh's trailer launch: I am open to working with Rekha | Sakshi
Sakshi News home page

తెరపై మళ్ళీ ఆ జంట!

Published Thu, Jan 8 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

తెరపై మళ్ళీ ఆ జంట!

తెరపై మళ్ళీ ఆ జంట!

ఇప్పుడు హిందీ చిత్రసీమలో ఎక్కడ చూసినా ‘షమితాబ్’ చిత్రం గురించే వినిపిస్తోంది. బిగ్ బి - అమితాబ్ బచ్చన్, తమిళ హీరో ధనుష్, కమలహాసన్ కుమార్తె అక్షర హాసన్‌లు కలసి నటిస్తున్న చిత్రమిది. కథ గురించి బయటకు రాకుండా దర్శక, నిర్మాతలు జాగ్రత్తపడ్డ ఈ చిత్రంలో విశేషం ఏమిటంటే, చాలా కాలం తరువాత అమితాబ్, ఆయన నిజజీవిత మాజీ ప్రేయసి రేఖ కలసి నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో వారిద్దరూ కలసి ఏకకాలంలో తెరపై కనిపించరు. ‘‘సినిమా చూసినప్పుడు అది ఎలా చిత్రీకరించారన్నది మీకు అర్థమవుతుంది’’ అని అమితాబ్ అన్నారు.
 
  విఫలమైన ప్రేమబంధం కారణంగా అమితాబ్‌కూ, రేఖకూ మధ్య ఎంతో కాలంగా నెలకొన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడీ తాజా పరిణామం నేపథ్యంలో ‘‘ఆసక్తికరమైన స్క్రిప్టు వస్తే - భవిష్యత్తులో కూడా రేఖతో కలసి నటిస్తా’’ అని అమితాబ్ అన్నారు. ముప్ఫై ఏళ్ళ క్రితం 1985లో ‘గెరఫ్తార్’ చిత్రంలో రజనీకాంత్, కమలహాసన్‌లతో కలసి నటించిన అమితాబ్ ఇప్పుడు ‘షమితాబ్’లో వారి వారసులతో (రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమలహాసన్ కుమార్తె అక్షర) తెరపై కనిపించనుండడం విశేషమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement