నటన అక్షర రక్తంలోనే ఉంది:ధనుష్ | Acting is in Akshara's blood,says Dhanush | Sakshi
Sakshi News home page

నటన అక్షర రక్తంలోనే ఉంది:ధనుష్

Published Sat, Jan 24 2015 12:02 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

నటన అక్షర రక్తంలోనే ఉంది:ధనుష్

నటన అక్షర రక్తంలోనే ఉంది:ధనుష్

చెన్నై:  కమల హాసన్ గారాల పట్టి అక్షర హాసన్ ను నటుడు ధనుష్ పొగడ్తలతో ముంచెత్తాడు. అక్షర రక్తంలోనే  నటన ఉందని ధనుష్ కితాబిచ్చాడు. ఆమె తొలి చిత్రం "షమితాబ్" ను ఎంతో  ఛాలెంజింగ్ తీసుకుని చేయడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు.  "ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా కీలకమైంది.  ఈ పాత్ర చేయడానికి  అక్షర ఎలాంటి సమస్యా ఎదుర్కొన్నట్లు నాకు అనిపించలేదు. ఎందుకంటే నటన అనేది ఆమె రక్తంలోనే ఉంది కాబట్టే అది సాధ్యమైందనుకుంటున్నాను' అని ధనుష్ పేర్కొన్నారు.

 

షమితాబ్  చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.  ఆర్. బాలకృష్ణన్(బాల్కీ) దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన అనుభవాల గురించి వివరిస్తూ.. తాను ఆయనతో కలిసి నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. అలాంటి మెగాస్టార్ తో కలిసి నటిస్తున్నప్పుడు సహ నటులు సినిమాకోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదని ధనుష్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement