నా పెళ్లి డ్రెస్ కూడా ఇలానే ఉండాలి! | My wedding dress to be the case! | Sakshi
Sakshi News home page

నా పెళ్లి డ్రెస్ కూడా ఇలానే ఉండాలి!

Published Mon, Aug 10 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

నా పెళ్లి డ్రెస్ కూడా ఇలానే ఉండాలి!

నా పెళ్లి డ్రెస్ కూడా ఇలానే ఉండాలి!

మేని ఛాయకు రెట్టింపు అందం చేకూర్చే లేలేత గులాబీ రంగు గాగ్రా చోళీలో అక్షరా హాసన్ ఎర్ర తివాచీపై ప్రత్యక్షం కాగానే, ఒక్కసారిగా అందరి చూపులూ ఆమెపైనే పడ్డాయి. చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వి, సుతిమెత్తగా అడుగులేస్తూ, వయ్యారంగా అక్షర నడుస్తుంటే చూపులు తిప్పుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. ఇటీవల అక్షర చేసిన ఓ ర్యాంప్ వాక్‌లో ఇలా జరిగింది. డిజైనర్ రీనా ధాకా కోసమే అక్షర ఈ వాక్ చేశారు. ఆమె డిజైన్ చేసిన లేలేత గులాబీ రంగు గాగ్రా చోళీలో అక్షర మెరిసిపోయారు.
 
  ఆ డిజైనర్ వేర్ చాలా సౌకర్యవంతంగా అనిపించిందని, చాలా నచ్చిందని అక్షర పేర్కొన్నారు. ఆ డ్రెస్ ఆమెకు ఎంతగా నచ్చిందంటే, తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఈ డిజైనర్ వేర్‌లాంటిదే డిజైన్ చేసివ్వమని రీనాని అడుగుతానని అంటున్నారు. ఫ్యాషన్ గురించి అక్షర మాట్లాడుతూ - ‘‘ఎంత ఖరీదు గల డ్రెస్ వేసుకున్నా, అది శరీర కొలతలకు తగ్గట్గుగా లేకపోతే వేస్ట్. అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, మనసంతా ఆ డ్రెస్ మీదే ఉంటుంది. నా మటుకు నేను ఏ డ్రెస్ వేసుకున్నా కంఫర్ట్‌గా ఉండాలనుకుంటాను.
 
 ఆ తర్వాతే ఫ్యాషన్ గురించి ఆలోచిస్తాను’’ అన్నారు. ఇదిలా ఉంటే, ‘షమితాబ్’ చిత్రం ద్వారా అక్షర కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలై, ఆరు నెలలవుతున్నా ఆమె వేరే చిత్రం అంగీకరించలేదు. ప్రస్తుతం కొన్ని చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, తాను చేయబోయే చిత్రం గురించి త్వరలో ప్రకటిస్తానని అక్షర పేర్కొన్నారు. తండ్రి కమల్‌హాసన్, అక్క శ్రుతీహాసన్‌తో కలిసి నటించే అవకాశం వస్తే, తప్పకుండా చేస్తానని కూడా ఆమె అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement