![Akshara Haasan Opens Up On Parents Kamal Haasan Sarika Separation](/styles/webp/s3/article_images/2024/07/18/Akshara-Haasan_0.jpg.webp?itok=aMglI0Cn)
తల్లిదండ్రులు కమల్ హాసన్- సారిక పేరు మోసిన యాక్టర్స్. అక్క శృతి హాసన్ కూడా సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అక్షర హాసన్ మాత్రం సినీ ఫీల్డులో కాస్త వెనుకబడే ఉంది. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఈ బ్యూటీ షమితాబ్ మూవీతో నటిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. వివేగం, కరం కొందాన్, అచ్చం మేడమ్ నానమ్ పయిరప్పు వంటి చిత్రాలతో కోలీవుడ్‌లోనూ పేరు సంపాదించుకుంది. కానీ స్టార్ స్టేటస్‌కు మాత్రం దూరంగానే ఉండిపోయింది.
![](/sites/default/files/inline-images/kamal_1.jpg)
ఒంటరిగా వదిలేయలేదు
తాజాగా ఈ బ్యూటీ తన పేరెంట్స్ విడాకులు తమను ఎంత బాధపెట్టాయో వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సెలబ్రిటీ పిల్లలమైనంత మాత్రాన మాకు ఎమోషన్స్ ఉండవా? మేమూ మనుషులమే! తల్లిదండ్రులు విడిపోతే అందరూ ఎలా బాధపడతారో మేమూ అలాగే బాధపడ్డాం. కానీ వారు మమ్మల్ని ఒంటరిగా వదిలేయలేదు. ఎంతో ప్రేమ చూపించారు. ఇద్దరి మధ్య ఎన్ని ఉన్నా పేరెంట్స్‌గా మాకు అండగా నిలబడ్డారు.
![](/sites/default/files/inline-images/sruthi_0.jpg)
అండగా నిలబడ్డ శ్రుతి హాసన్
కొన్నిసార్లు నాకేదైనా అవసరమైతే మా అక్క దగ్గరకు వెళ్లేదాన్ని. స్కూల్‌లో కొందరు ఏడిపిస్తున్నారని, కొట్టాలని ఉందని చెప్తే హింస వద్దని సూచించేది. తను రంగంలోకి దిగి పరిస్థితులు చక్కబెట్టేది. మేము ఒకరి కోసం ఒకరం నిలబడతాం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే మా కుటుంబంలో అందరం ఒకరికొకరు సపోర్ట్‌గానే ఉన్నారు. ఆ ప్రేమానురాగాలను అలాగే కొనసాగించాం' అని పేర్కొంది. కాగా కమల్- సారిక 2002లో విడిపోగా 2004లో విడాకులు తీసుకున్నారు.
చదవండి: ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment