
కమల్ హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'థగ్ లైఫ్' (Thug Life). మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి జింగుచా పాట రిలీజైంది. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో నటీనటులకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. త్రిష (Trisha Krishnan) మాట్లాడుతూ.. పెళ్లిపై తనకు నమ్మకం లేదని తెలిపింది. పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా తనకు పర్వాలేదని పేర్కొంది.
రెండుసార్లు పెళ్లేంటి?
కమల్ హాసన్ (Kamal Haasan) మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 15 ఏళ్ల క్రితం అనుకుంటా.. ఎంపీ బ్రిట్టాస్ నాకు మంచి స్నేహితుడు. చాలామంది కాలేజీ విద్యార్థులు చుట్టూ గుమిగూడినప్పుడు నన్నో ప్రశ్న అడిగాడు. మంచి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన నువ్వు రెండుసార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని ప్రశ్నించాడు. మంచి కుటుంబానికి, పెళ్లికి సంబంధం ఏంటి? అని అడిగాను.
రాముడి తండ్రిని ఫాలో అవుతా: కమల్
అది కాదు.. నువ్వు రాముడిని పూజిస్తావ్.. మరి ఆయనలాగే జీవించాలి కదా అని ప్రశ్నించాడు. దానికి నా సమాధానం ఏంటంటే.. మొదటగా.. నేను ఏ దేవుడినీ ప్రార్థించను. రాముడి అడుగుజాడల్లో అసలే నడవను. అందుకు బదులుగా రాముడి తండ్రి (దశరథుడికి ముగ్గురు భార్యలు) బాటలో నడుస్తాను అని చెప్పుకొచ్చాడు. థగ్ లైఫ్ సినిమా జూన్ 5న విడుదల కానుంది.
కమల్ రెండు పెళ్లిళ్లు- విడాకులు
కమల్ హాసన్ 1978లో హీరోయిన్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. దశాబ్దకాలం తర్వాత ఆమెకు విడాకులిచ్చి 1988లో సారికను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి ముందే 1986లో శృతి హాసన్ జన్మించింది. పెళ్లి తర్వాత 1991లో అక్షర హాసన్ పుట్టింది. తర్వాతి కాలంలో కమల్-సారిక బంధం కూడా ఎంతోకాలం కొనసాగలేదు. 2002లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2004లొ డివోర్స్ మంజూరయ్యాయి. ఆ మరుసటి ఏడాది నటి గౌతమితో కమల్ సహజీవనం చేశాడు. 2016లో ఆమెకు బ్రేకప్ చెప్పాడు.
చదవండి: సినిమా బాగోలేదని ప్రచారం చేస్తారా?.. విజయశాంతి వార్నింగ్