
బిగిల్, పాగల్, విరుమాన్ తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ ఇంద్రజ శంకర్.. గతేడాది పెళ్లి చేసుకుంది. డాక్టర్ కార్తిక్ తో ఏడడుగులు వేసింది. వీళ్లకు రీసెంట్ గానే కొడుకు కూడా పుట్టాడు. ఇప్పుడు ఆ పిల్లాడికి స్వయంగా కమల్ హాసన్ నామకరణం చేయడం విశేషం.
(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)
ఇంద్రజ శంకర్ తండ్రి కూడా కమెడియనే. రోబో శంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన పలు సినిమాల్లో నటించడంతో పాటు తమిళ బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్నాడు. ఇప్పుడు ఈయన.. తన కూతురు-కొడుకుతో పాటు మనవడిని పట్టుకుని ఆదివారం కమల్ హాసన్ ని కలిశారు.
ఈ క్రమంలోనే కమల్ హాసన్.. ఇంద్రజ శంకర్ కొడుక్కి నక్షత్రన్ అనే పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఇంద్రజ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కమల్ ప్రస్తుతం 'థగ్ లైఫ్' అనే మూవీ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో 25 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతున్న సినిమా)



Comments
Please login to add a commentAdd a comment