Tamil comedian
-
కమెడియన్ మృతి.. కుటుంబానికి సాయం చేసిన కెప్టెన్!
సీనియర్ సినీ హాస్యనటుడు బోండామణి (60) శనివారం రాత్రి చైన్నె సమీపంలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. శ్రీలంకకు చెందిన ఈయన అక్కడ సైనికుల యుద్ధంలో కుటుంబ సభ్యులను కోల్పోగా తను మాత్రం తప్పించుకుని చైన్నెకి చేరుకున్నారు. చైన్నెలో సినీ ప్రయత్నాలు చేసి చివరకు 1981లో విడుదలైన పవును పవును దాన్ చిత్రం ద్వారా నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో చిన్న పాత్ర చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మంచి హాస్యనటుడుగా గుర్తింపు పొందారు. వందల సినిమాల్లో నటించి.. అలా సుందర ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుధం, జిల్లా.. తదతిర చిత్రాల్లో నటించారు. దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వడివేలు వంటి హాస్యనటులతో కలిసి పలు చిత్రాలు చేశారు. కొంతకాలంగా బోండామణి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తన రెండు కిడ్నీలు పాడవడంతో చైన్నె ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదికి పైగా చికిత్స పొందుతూ వచ్చారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో బోండామణికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. స్వగృహంలో కన్నుమూత రోజూ డయాలసిస్ చేసుకుంటూ వచ్చిన బోండామణి డిసెంబర్ 23న రాత్రి 11 గంటల ప్రాంతంలో రాత్రి ఉన్నట్లుండి కింద పడిపోయారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా బోండామణి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈయనకు భార్య మాధవి, కొడుకు సాయిరాం, కూతురు సాయికుమారి ఉన్నారు. బోండామణి మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్ష సాయం కమెడియన్ మృతి పట్ల నటుడు, డీఎండీకే పార్టీ నేత విజయకాంత్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ లక్ష రూపాయలను నటుడు మీసై రాజేంద్రన్ ద్వారా ఆయన భార్యకు అందించారు. కాగా ఆదివారం క్రోంపేటలోని శ్మశాన వాటికలో బోండామణి అంత్యక్రియలు నిర్వహించారు. బోండామణి కొడుకు సాయిరాం మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి జీవనాధారం లేదని, అద్దె ఇంటిలోనే ఉంటున్నామని నడిగర్ సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: రొమాన్స్ సీన్లో నేనేం సిగ్గుపడలేదు కానీ..: ఆండ్రియా -
పేదరికంలో అలనాటి ప్రముఖ నటుడి కుటుంబం..
కోలీవుడ్‌లో నటుడిగా, గాయకుడిగా సినీ కళామతల్లికి విశేష సేవలు అందించిన దివంగత నటుడు ఎన్ఎస్.కృష్ణన్. నాటక రంగం నుంచి సినీ రంగప్రవేశం చేసిన ఈయన ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు చార్లీ చాప్లిన్ తరహాలో ప్రేక్షకులకు వినోదంతో పాటు సందేశాన్ని అందించి ఆనందపరిచారు. ఈ సేవలకుగాను ఎన్ఎస్.కృష్ణన్ కలైవానర్‌గా వాసికెక్కారు. ఈయన ఇల్లు తమిళనాడులోని నాగర్‌కోవిల్‌లోని చినిగినచేరి అనే ప్రాంతంలో ఉంది. అక్కడ ఆయన కుటుంబసభ్యులు నివసిస్తున్నారు. (ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్) అయితే ఆ కుటుంబం కడు పేదరికంలో ఉన్న విషయాన్ని ఆ నగర మేయర్ మహేష్ తెలిపారు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అప్పుడు ఎన్ఎస్ కృష్ణన్ ఇల్లు శిథిలావస్థలో ఉన్న విషయాన్ని గుర్తించారు. గోడలపై చెట్లు కూడా పెరిగాయి. దీంతో మేయర్ మహేష్ ఎన్ఎస్ కృష్ణన్ కుటుంబసభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు వారు చాలా పేదరికం అనుభవిస్తున్నట్లు దీంతో మేయర్ మహేష్ తాను వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి సాయం చేస్తానని ఇంటి గోడలపై పెరిగిన చెట్లను తొలగిస్తానని హామీ ఇచ్చినట్లు అనంతరం మీడియాకు వెల్లడించారు. అదేవిధంగా కలైంజర్ కరుణానిధికి సన్నిహితుడైన ఎన్ఎస్ కృష్ణన్ కుటుంబ సభ్యుల పరిస్థితిని ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా పరిశ్రమ ఏదైనా తనదైన నటనతో ఆకట్టుకున్న ప్రముఖ హాస్య నటుడు వివేక్. ఆయన అకాల మరణం మొత్తం సినీరంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 500కి పైగా చిత్రాలు, తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వివేక్ తీవ్రమైన గుండెపోటుకు గురై అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడటం తీవ్ర విషాదాన్ని నింపింది. చాలా తొందర పడ్డారు సార్ అంటూ ఆయన హితులు, సన్నిహితులు తీరని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు సూర్య, విక్రం, నటి జ్యోతిక, మహానటి ఫేం కీర్తి సురేష్‌తోపాటు పలువురు ప్రముఖులు వివేక్ మృతదేహానికి నివాళుర్పించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విటర్ ద్వారా వివేక్‌కు సంతాపం తెలియజేస్తూ శివాజీ సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నటనపైన మక్కువ మాత్రమే కాదు..వివేక్ ప్రకృతి ప్రేమికుడు కూడా. పర్యావరణ పరిరక్షణకోసం నిరంతరం పాటుపడేవారు. తన నటనా కౌశలంతో పద్మశ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్న వివేక్ తనకు గురువు మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం అని ఎపుడూ చెబుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే కలాం కోరిక మేరకు గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారంతోపాటు, చెట్ల పెంపకాన్ని తన జీవిత మిషన్‌గా చేపట్టారు. తన వంతు బాధ్యతగా కోటి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులోభాగంగా 2011 లో భారీ చెట్ల పెంపకం కోసం ‘గ్రీన్ కలాం’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే 33.23 లక్షల మొక్కలు నాటారు. ఈ విషయాన్నే ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కోరిక తీరకుండానే వివేక్ ప్రకృతిలో కలిసిపోయారంటూ కంటతడిపెట్టారు. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియోలను రీపోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆర్ఐపీ వివేక్ సార్ హ్యాష్‌ట్యాగ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. #RipVivek pic.twitter.com/MSYVv9smsY — Rajinikanth (@rajinikanth) April 17, 2021 Bye Sir. Even in death you were too ahead of your time. We will all miss you terribly. ❤️ There will be laughter and food for thought in the heavens tonight. #VIVEKH pic.twitter.com/zGRcUhEwmt — Siddharth (@Actor_Siddharth) April 17, 2021 Thalaivi Pays Homage to #Vivek sir #RIPVivekSir 💔🙏🏻 pic.twitter.com/enqgAOYmWY — sᴀɴᴅʜʏᴀ 🦄 ᴋᴇᴇʀᴛʜʏ 𝐃𝐞𝐯𝐨𝐭𝐞𝐞 (@Sandy_kitty_) April 17, 2021 We are shocked and saddened.. I missed sharing screen space with you and missed learning so much from a legend like you.. will miss you forever sir. Deepest condolences to the family🙏 #RIPVivekSir pic.twitter.com/DSSxzb7cG6 — Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 17, 2021 Gone tooooo soon saar. Life is truly unfair. #RIPVivekSir deepest condolences to friends and family — venkat prabhu (@vp_offl) April 17, 2021 End of an era 💔 pic.twitter.com/QmoCBvMKcI — Hansika (@ihansika) April 17, 2021 -
కావాలనే విమర్శిస్తున్నారు : హాస్య నటుడు
సినిమా సమీక్షల విషయంలో భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. పెద్ద సినిమాల నిర్మాతలు రివ్యూల కారణంగా తమ సినిమాలకు నష్టం జరుగుతుందంటే.. చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం రివ్యూల కారణంగానే తమ సినిమాలకు గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. అయితే తాజాగా ఓ తమిళ కమెడియన్ రివ్యూలపై ఫైర్ అయ్యాడు. కోలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న కమెడియన్ సూరి ఇటీవల సామి స్క్వేర్, సీమ రాజ సినిమాల్లో కనిపించారు. ఈ రెండు సినిమాల్లో సూరి నటనపై విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా సీమరాజ సినిమా కు రివ్యూలు నెగెటివ్‌గా రావటంతో.. కావాలనే తమ సినిమా మీద దాడి చేస్తున్నారంటూ ఆరోపించారు సూరి. అంతేకాదు విమర్శకులు తమిళ సినిమాలపై దాడి చేయటం ఆపి సినిమాలను కాపాడేందుకు ప్రయత్నించాలన్నారు. -
హాస్య నటుడి నగలు దోపిడీ
చెన్నై: తమిళ హాస్యనటుడు కొట్టాచ్చి దారిదోపిడీకి గురయ్యారు. సోమవారం తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకునేందుకు అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో కొట్టాచ్చి బస్‌లో సేలం చేరుకున్నాడు. అక్కడ ఓ ఆటో ఎక్కాడు. కొంత దూరం వెళ్లిన తరువాత ఆటోలో మరో ఇద్దరు ఎక్కారు. సురమంగళం, నరసోదిపట్టి ప్రాంతానికి చేరుకోగానే ఆటోలో ఉన్నవాళ్లు కొట్టాచ్చిపై దాడిచేసి అతని వద్ద ఉన్న రెండు సవర్ల బంగారు గొలుసు, రూ.2,500 నగదు, ఏటీఎం కార్డు లాక్కొని ఆటో నుంచి కిందకు తోసేశారు. గాయాలపాలైన కొట్టాచ్చి సేలంకు చెందిన మరో హాస్యనటుడు బెంజిమన్‌కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించాడు. బెంజిమెన్ అక్కడికి రాగా ఇద్దరూ దోపిడీపై సురమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి ఓ పోలీస్ అధికారి తెలుపుతూ కొట్టాచ్చి సేలం వచ్చినప్పుడు మద్యం సేవించి ఉన్నారని తెలిపారు. ఆటోడ్రైవర్ ఇద్దరు హిజ్రాలతో కలిసి కొట్టాచ్చి వద్ద దోపిడీ చేసినట్టు చెప్పారు. ఆ డ్రైవర్ ఎవరన్నది తెలిసిందని, అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
నేను చనిపోలేదు.. బాగానే ఉన్నా: కమెడియన్
'ఏయ్ అల్లుడి చెప్పింది చేయ్' అంటూ 'అరుణాచలం' సినిమాలో రజనీకాంత్ వెంట ఉంటూ నవ్వులు పంచిన తమిళ సీనియర్ కామెడియన్ సెంథిల్ చనిపోయాడనే వార్త శుక్రవారం ఇంటర్నెట్ లో దావానలంలా పాకింది. ఈ వార్త వైరల్ కావడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. తమిళ చిత్ర పరిశ్రమ నటులు కూడా కలవరం చెందారు. తాను చనిపోయినట్టు వార్తలు గుప్పుమనడంతో తాజాగా సెంథిల్ వివరణ ఇచ్చారు. 'నేను చాలా బాగున్నా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు నా గురించి వచ్చిన వదంతుల్ని పట్టించుకోకండి' అంటూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమిళ చిత్రాల్లో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సెంథిల్. ఆయన 500లకు పైగా చిత్రాల్లో నటించాడు. 'జెంటిల్మన్', 'నరసింహ', 'ముత్తు', 'అరుణాచలం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆయన విశేషంగా నవ్వించారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీకి ఆయన మద్దతు పలికారు. ఇక, ఈ మధ్యకాలంలో సీనియర్ నటులు చనిపోయారంటూ ఇంటర్నెట్ లో వదంతులు పుట్టడం తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటిమొన్న బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తదితరులు చనిపోయినట్టు వదంతులు గుప్పుమన్నాయి.