కోలీవుడ్‌లో నటుడిగా, గాయకుడిగా సినీ కళామతల్లికి విశేష సేవలు అందించిన దివంగత నటుడు ఎన్‌ఎస్.కృష్ణన్. నాటక రంగం నుంచి సినీ రంగప్రవేశం చేసిన ఈయన ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు చార్లీ చాప్లిన్ తరహాలో ప్రేక్షకులకు వినోదంతో పాటు సందేశాన్ని అందించి ఆనందపరిచారు. ఈ సేవలకుగాను ఎన్‌ఎస్.కృష్ణన్ కలైవానర్‌గా వాసికెక్కారు. ఈయన ఇల్లు తమిళనాడులోని నాగర్‌కోవిల్‌లోని చినిగినచేరి అనే ప్రాంతంలో ఉంది. అక్కడ ఆయన కుటుంబసభ్యులు నివసిస్తున్నారు.
(ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్)
అయితే ఆ కుటుంబం కడు పేదరికంలో ఉన్న విషయాన్ని ఆ నగర మేయర్ మహేష్ తెలిపారు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అప్పుడు ఎన్‌ఎస్ కృష్ణన్ ఇల్లు శిథిలావస్థలో ఉన్న విషయాన్ని గుర్తించారు. గోడలపై చెట్లు కూడా పెరిగాయి. దీంతో మేయర్ మహేష్ ఎన్‌ఎస్ కృష్ణన్ కుటుంబసభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇప్పుడు వారు చాలా పేదరికం అనుభవిస్తున్నట్లు దీంతో మేయర్ మహేష్ తాను వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి సాయం చేస్తానని ఇంటి గోడలపై పెరిగిన చెట్లను తొలగిస్తానని హామీ ఇచ్చినట్లు అనంతరం మీడియాకు వెల్లడించారు. అదేవిధంగా కలైంజర్ కరుణానిధికి సన్నిహితుడైన ఎన్‌ఎస్ కృష్ణన్ కుటుంబ సభ్యుల పరిస్థితిని ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment