![Comedian Seshu Passes Away At Chennai - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/26/seshu.jpg.webp?itok=gpw-E-vz)
తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు శేషు(60) మృతి చెందారు. కొన్నాళ్ల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నై ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న శేషు.. నేడు(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. శేషు పూర్తి పేరు లక్ష్మీ నారాయణన్ శేషు.2002లో ధనుష్ చిత్రం తుళ్లువదో ఇలామైలో వెండితెర అరంగేట్రం చేశారు. విజయ్ టీవీ కామెడీ షో ‘లొల్లు సభ’తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
తమిళ్ లో 30కి పైగా చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా నటుడు సంతానంతో గొప్ప స్నేహం ఉంది. అందుకే ఆయన నటించిన ప్రతి సినిమాలో శేషు ఉంటాడు. ఇక ఈ మధ్య సంతానం హీరోగా నటించిన వడక్కుపట్టి రామసామి లో కూడా శేషు నటించి మెప్పించాడు. అదే ఆయన చివరి చిత్రం. శేషుకు ముగ్గురు కొడుకులు. బుధవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. శేషు మరణ వార్త విన్న ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment