
ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు. ఈ విషాద వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి నాన్న అంటూ రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని రాహుల్ రవీంద్రన్‌కు అండగా నిలుస్తున్నారు.
ఈ విషాద సమయంలో తాను దర్శకత్వం వహించిన చి.ల.సౌ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. 'చి లా సౌ చిత్రానికి నేను ఓ లైన్ రాశాను..అది ఇప్పుడు చాలా భిన్నంగా అనిపిస్తోంది.. నాన్న ఉన్నారులే.. అన్ని చూస్కుంటారు.. అనే మాటకి విలువ నాన్నను కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది'.. నాకు ఈరోజు అర్థమైంది. నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది.. మాటల్లో వివరించలేని భావాలను మనకు అందిస్తుంది.. థ్యాంక్యూ నాన్న.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా' అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కాగా..నటుడిగా మాత్రమే కాదు డైరెక్టర్‌గా రాహుల్ రవీంద్రన్ పలు చిత్రాలు తెరకెక్కించారు. తెలుగులో పలు సినిమాల్లోనూ నటించారు. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదను రాహుల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్మయి సైతం తెలుగులో పలు సూపర్ హిట‍్ సినిమాలకు పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment