Tv Serial Actress Vishnu Priya Father Passed Away Due to Jaundice - Sakshi
Sakshi News home page

TV Actress Vishnu Priya: నటి విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం, ఆమె తండ్రి హఠాన్మరణం

Nov 14 2022 12:33 PM | Updated on Nov 14 2022 2:40 PM

Tv Actress Vishnu Priya Father Passed Away Due to Jaundice - Sakshi

టీవీ నటి విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆమె తండ్రి ఇటీవల మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా తనే సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. కొండంత అండను కొల్పొయానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తండ్రితో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘నా గుండె ఎప్పటికి కోలుకోలేదు డాడీ. నా సూపర్‌ హీరో, బిగ్గెస్ట్‌ బ్లెస్పింగ్‌ కోల్పోయాను. ప్రతి క్షణం నేను మిమ్మల్ని మిస్‌ అవుతూనే ఉంటాను...

కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆయన వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ కష్టకాలంలో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ విష్ణు ప్రియ భావోద్వేగానికి లోనయ్యింది. కాగా విష్ణుప్రియ ప్రస్తుతం తెలుగులో త్రినయని, జానకి కలగనలేదు వంటి సీరియల్స్‌తో బిజీగా ఉంది. ఇక ఆమె తమిళంలోనూ పలు సీరియల్స్‌లో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. విష్ణుప్రియ తన సీరియల్ కో-స్టార్ సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అభిషేకం, కుంకుమ పువ్వు, ఇద్దరు అమ్మాయిలు వంటి సీరియల్స్‌తో తెలుగులో ఆమె నటిగా మంచి గుర్తింపు పొందింది. 

చదవండి: 
సూపర్‌ స్టార్‌ కృష్ణకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
కృష్ణ ఆరోగ్యంపై స్పందించిన నటుడు నరేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement