హీరో విశాల్ (Vishal) నటించిన సినిమా పుష్కరకాలం తర్వాత రిలీజవుతోంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ (Madha Gaja Raja Movie) షూటింగ్ 2012లోనే పూర్తయింది. కానీ పలు కారణాల వల్ల ఎన్నో ఏళ్లుగా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న రిలీజ్ అవుతోంది. తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు.
వణికిపోతున్న విశాల్
ఈ కార్యక్రమానికి విశాల్ పంచెకట్టులో హాజరయ్యాడు. అయితే ఆయన బక్కచిక్కిపోయి దీన స్థితిలో కనిపించాడు. తను మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే చేతులు, గొంతు వణుకుతోంది. ఆయన కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని.. దానివల్లే శరీరం, గొంతు వణుకుతోందని పలువురూ చెప్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా విశాల్ ఈవెంట్‌కు వచ్చాడని తెలుసుకున్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఇంకేదైనా..?
ఇలాంటి పరిస్థితిలో తన సినిమా కోసం ఈవెంట్‌కు రావడం చిన్న విషయం కాదని, అతడి అంకితభావాన్ని మెచ్చుకోవాల్సిందేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే జ్వరం వస్తే మరీ ఇంత చిక్కిపోతారా? విశాల్ ఇంకేదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా విషయానికి వస్తే..
మదగజరాజ మూవీలో విశాల్ ఎయిట్ ప్యాక్స్‌లో కనిపిస్తాడట! ఈ విషయాన్ని డైరెక్టర్ సుందర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించాడు. క్లైమాక్స్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించాలన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్‌గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది.
Actor #Vishal 🥹❤️
Though he is suffering from high fever, he came to promote his film #MadhaGajaRaja ...
Dedication 💪 ❤️pic.twitter.com/qb1o3vHvuh— Movies4u Official (@Movies4u_Officl) January 5, 2025
చదవండి: 'గేమ్ ఛేంజర్' కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: దిల్ రాజు
Comments
Please login to add a commentAdd a comment