Poor life
-
పేదరికంలో అలనాటి ప్రముఖ నటుడి కుటుంబం..
కోలీవుడ్‌లో నటుడిగా, గాయకుడిగా సినీ కళామతల్లికి విశేష సేవలు అందించిన దివంగత నటుడు ఎన్ఎస్.కృష్ణన్. నాటక రంగం నుంచి సినీ రంగప్రవేశం చేసిన ఈయన ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు చార్లీ చాప్లిన్ తరహాలో ప్రేక్షకులకు వినోదంతో పాటు సందేశాన్ని అందించి ఆనందపరిచారు. ఈ సేవలకుగాను ఎన్ఎస్.కృష్ణన్ కలైవానర్‌గా వాసికెక్కారు. ఈయన ఇల్లు తమిళనాడులోని నాగర్‌కోవిల్‌లోని చినిగినచేరి అనే ప్రాంతంలో ఉంది. అక్కడ ఆయన కుటుంబసభ్యులు నివసిస్తున్నారు. (ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్) అయితే ఆ కుటుంబం కడు పేదరికంలో ఉన్న విషయాన్ని ఆ నగర మేయర్ మహేష్ తెలిపారు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అప్పుడు ఎన్ఎస్ కృష్ణన్ ఇల్లు శిథిలావస్థలో ఉన్న విషయాన్ని గుర్తించారు. గోడలపై చెట్లు కూడా పెరిగాయి. దీంతో మేయర్ మహేష్ ఎన్ఎస్ కృష్ణన్ కుటుంబసభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు వారు చాలా పేదరికం అనుభవిస్తున్నట్లు దీంతో మేయర్ మహేష్ తాను వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి సాయం చేస్తానని ఇంటి గోడలపై పెరిగిన చెట్లను తొలగిస్తానని హామీ ఇచ్చినట్లు అనంతరం మీడియాకు వెల్లడించారు. అదేవిధంగా కలైంజర్ కరుణానిధికి సన్నిహితుడైన ఎన్ఎస్ కృష్ణన్ కుటుంబ సభ్యుల పరిస్థితిని ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
ఒకరి ఆస్తి 660కోట్లు మరొకరి ఆస్తి రూ.1,823
ఎన్నికలంటేనే కోట్ల రూపాయల వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో పట్టుమని పదివేలు కూడా లేకుండా ఎన్నికల బరిలో దిగడం సాహసమే అనాలి. లేదా తెలివి తక్కువతనమనాలి. మధ్య ప్రదేశ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఇలాంటి నిరుపేదలు ఉన్నారని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) విశ్లేషణలో తేలింది.ఈ ఎన్నికల్లో కోటీశ్వరులతో పాటు పేదలు, నిరక్షరాస్యులు కూడా పోటీ చేస్తున్నారు. సిద్ధి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్న లలన్ కుమార్ ఆస్తి కేవలం 1,823 రూపాయలు. రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న 104 మందిలో ఈయనే కడు పేదవాడని ఏడీఆర్ పేర్కొంది. అలాగే,ఇక్కడ నుంచే బరిలో దిగిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి రాం సహాయ్ ఆస్తి 6,134 రూపాయలు. కాగా జబల్పూర్ అభ్యర్థి ధనుక్ పరిస్థితి వీరిద్దరికంటే కొంచెం మెరుగు.ఆయన ఆస్తి విలువ 10,300 రూపాయలు. ఇక కోటీశ్వరుల విషయానికి వస్తే, చింద్వారా కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్(సీఎం కమల్‌నాథ్ కుమారుడు) ఆస్తి 660 కోట్లు. జబల్పూర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ తన్ఖా 66 కోట్ల ఆస్తిపరుడు. సిద్ధి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ సింగ్‌కు 37కోట్ల విలువైన ఆస్తిపాస్తులున్నాయని ఏడీఆర్ తెలిపింది.వివేక్ తన వార్షికాదాయం 11 కోట్ల రూపాయలని ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్‌లో పేర్కొంటే, నకుల్ 2 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం 104 మంది అభ్యర్థుల్లో 14శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 17శాతం మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడవిట్లలో తెలిపారు. అభ్యర్థుల్లో 41 మంది డిగ్రీ ఆపై చదువులు చదివారు. 55 మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరు అసలు చదువుకోలేదు. మరో నలుగురికి చదవడం, రాయడం వచ్చు. ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎక్కువగా యువకులనే బరిలో దింపాయని ఏడీఆర్ తెలిపింది. మొత్తం అభ్యర్థుల్లో 60శాతం పాతిక నుంచి 50 ఏళ్ల లోపు వారే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు(షాదోల్, సిద్ధి, జబల్పూర్, మాండ్లా, బాలాఘాట్, చింద్వారా)కు ఏప్రిల్ 29న పోలింగు జరుగుతుంది. -
పిడికెడు బియ్యం పట్టెడు అన్నం
సాక్షి, కరీంనగర్ : అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు పెద్దలు. అందుకేనేమో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రోజుకో పిడికెడు చొప్పున బియ్యం పక్కన పెట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. అలా సేకరించిన దాదాపు 70 క్వింటాళ్ల బియ్యాన్ని నిరుపేద కుటుంబాలకు పది కిలోల చొప్పున పంపిణీ చేశారు. లాఠీలతో కాఠిన్యం ప్రదర్శించే పోలీసులు పేదల ఆకలి తీర్చేందుకు నడుంబిగించడాన్ని జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు. మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నారు. -
పాలకుల పాపం కంగుందికి శాపం
దుర్భర జీవనం గడుపుతున్న ప్రజలు నాటి పాలకుల తప్పిదాలు.. నేటి ప్రజాప్రతినిధులు, మండల అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామాల పాలిట శాపంగా మారింది. ఉన్నది తమిళనాడులో.. పాలన ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో. దీంతో ఆ ఊర్లలోని ప్రజలకు ప్రభుత్వ పథకాలంటే ఏమిటో తెలియ దు. ఆ పల్లెలు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. విద్య కరువు. అరకొరగా చదివిన వారికి స్థానికత సమస్య. చివరకు వారిలో 95 శాతం మందికి తెలుగు రాదు. ఇదీ కుప్పం నియోజకవర్గంలోని కంగుంది పంచాయతీ దుస్థితి. కుప్పంరూరల్: కుప్పం నియోజకవర్గంలోని రిజర్వ్ ఫారెస్టు వెనుక తమిళనాడు సరిహద్దులో కంగుంది పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ పరిధిలో బ్రహ్మదేవరచేన్లు, తరగవాని మూల, వెంకటరాపురం, గొల్లపల్లి గ్రామాలు ఉన్నాయి. ఈ పల్లెల్లో సుమారు 2500 మంది జనాభా ఉంది. ఈ ఊర్లు తమిళనాడుకు ఆనుకుని, ఆంధ్రాకు విసిరేసినట్లు దూరంగా ఉన్నా యి. దీంతో ఈ గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు, రేషన్, పింఛన్లు తదితర సౌకర్యాలు అందడం లేదు. మద్రా సు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పాల కులు, అధికారులు చేసిన తప్పిదాలతోనే ఈ నాలుగు గ్రా మాల ప్రజలను అష్టకష్టాలు పడుతున్నారు. అప్పుట్లో ఈ గ్రామాలు తమిళనాడులోనే కలిపి ఉంటే నేడీ సమస్యలు వచ్చేవి కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రానికి 45 కిలో మీటర్ల దూరం కంగుంది పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన కుప్పం పట్టణానికి రావాలంటే 25 కిలో మీటర్ల దూరం తమిళనాడులో ప్రయాణించిన అనంతరం అక్కడ బస్సు మారి మరో 20 కిలో మీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణం చేయాల్సి ఉంది. కంగుంది రిజర్వు ఫారెస్టు వెనుక తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో ఇంత దూరం ప్రయాణం తప్పడం లేదు. గతంలో బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ రోడ్డు సక్రమంగా లేకపోవడం, కలెక్షన్ల పేరిట సర్వీసు రద్దు చేశారు. మండల కేంద్రం రావాలంటే తమిళనాడు బస్సులు, ఆటోలే శరణ్యం. ఒక వ్యక్తి బ్రహ్మదేవరచేన్లు నుంచి కుప్పం రావాలంటే రూ. 60 నుంచి 70 రూపాయలు వెచ్చించాల్సి ఉంది. వెక్కిరిస్తున్న ప్రభుత్వ పథకాలు నిరక్ష్యరాస్యులు, కూలీలే అధికంగా ఉన్న ఈ గ్రామాలకు సంవత్సరానికి ఒక మారు అయినా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. విద్యుత్ రీడింగ్‌ల కోసం ఒక రెస్కో లైన్మెన్ మాత్రం నెల మొదటి వారంలో ఒక రోజు వెళుతుంటాడు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ పథకాలైన పెన్షన్లు, రేషన్‌కార్డులు, పాసుపుస్తకాలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు ఒక్కటేమిటి ప్రతీది ఈ గ్రామాల ప్రజలకు అందక వెక్కిరిస్తున్నాయి. బీసీ, ఎస్సీ, కాపు లోన్లు అంటే ఏమిటవని ప్రశ్నిస్తున్నారు. పారిశుద్ధ్యం విషయానికి వస్తే గ్రామాల్లో ఎక్కడా కాలువలు, సిమెంట్ రోడ్లు గానీ లేకపోవడంతో వీధుల్లో నడవ లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నాలుగు గ్రామాల్లో ఎక్కడ వెతికినా ఒక మరుగుదొడ్డి గానీ, గ్యాస్ ఉన్న ఇల్లు గానీ కనిపించదు. ఉపాధి హామీ పనులు అయితే మొదట్లో ఒకటి రెండు పనులు ఇచ్చారు, ప్రస్తుతం దాని జాడే లేదు. దీంతో ఆ గ్రామాల ప్రజలు నగరాలకు వలసపోక తప్పడం లేదు. విద్యార్థులను వేధిస్తున్న స్థానికత కంగుంది పంచాయతీలోని నాలుగు గ్రామాల్లో ఉన్న విద్యార్థులు ప్రాథమిక విద్య బ్రహ్మదేవరచేన్లులో అభ్యసించవచ్చు. ఆ తరువాత ఉన్నత పాఠశాల కోసం తమిళనాడులోని నారాయణపురం, కళాశాల చదువులకు వాణియంబాడిని ఆశ్రయిస్తున్నారు. అయితే అక్కడ వారికి స్థానికత సమస్య ఎదురవుతోంది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో సీట్లు దొరకని సందర్భాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుంచి నిత్యం 120 మంది విద్యార్థులు నడక దారిన రాకపోకలు సాగిస్తూ చదువులు కొనసాగిస్తున్నారు. చదువులు పూర్తి చేసుకున్న వారికి కూడా వారు ఉపాధి పొందడానికి నాన్‌లోకల్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఎదురవుతుండడంతో కొంత మంది పాఠశాల దశలోనే చదువులు మాన్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు రాయడం, చదవడం, చివరకు 95 శాతం మందికి తెలుగు మాట్లాడడం రాకపోవడం కొసమెరుపు. మా గ్రామాలను తమిళనాడులో కలపండి కుప్పంకు వెళ్లిరావాలంటే బస్సు లు, ఆటోలు అయితే రూ.70, ద్విచక్రవాహనంలో అయితే 120 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉదయం బయలుదేరితే తిరిగిరావడానికి సాయంత్రం పడుతుంది. మా ఊళ్ల కు ఏసారు రారు. దయవుంచి మమ్మల్ని తమిళనాడులో కలపండి అదే పదివేలు. -పెరుమాళ్, బ్రహ్మదేవరచేన్లు ఏ ప్రభుత్వ పథకమూ అందదు ఏ ప్రభుత్వ పథకమూ అందడం లేదు. ప్రభుత్వాస్పత్రికి రావాలంటే 45 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంది. రోడ్లు, ఆస్పత్రి నిర్మిస్తే మీకు పుణ్యం ఉంటుంది. - చిన్నతాయి, బ్రహ్మదేవరచేన్లు