
సాక్షి, కరీంనగర్ : అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు పెద్దలు. అందుకేనేమో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రోజుకో పిడికెడు చొప్పున బియ్యం పక్కన పెట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. అలా సేకరించిన దాదాపు 70 క్వింటాళ్ల బియ్యాన్ని నిరుపేద కుటుంబాలకు పది కిలోల చొప్పున పంపిణీ చేశారు.
లాఠీలతో కాఠిన్యం ప్రదర్శించే పోలీసులు పేదల ఆకలి తీర్చేందుకు నడుంబిగించడాన్ని జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు. మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment