సినిమా సమీక్షల విషయంలో భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. పెద్ద సినిమాల నిర్మాతలు రివ్యూల కారణంగా తమ సినిమాలకు నష్టం జరుగుతుందంటే.. చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం రివ్యూల కారణంగానే తమ సినిమాలకు గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. అయితే తాజాగా ఓ తమిళ కమెడియన్ రివ్యూలపై ఫైర్ అయ్యాడు.
కోలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న కమెడియన్ సూరి ఇటీవల సామి స్క్వేర్, సీమ రాజ సినిమాల్లో కనిపించారు. ఈ రెండు సినిమాల్లో సూరి నటనపై విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా సీమరాజ సినిమా కు రివ్యూలు నెగెటివ్‌గా రావటంతో.. కావాలనే తమ సినిమా మీద దాడి చేస్తున్నారంటూ ఆరోపించారు సూరి. అంతేకాదు విమర్శకులు తమిళ సినిమాలపై దాడి చేయటం ఆపి సినిమాలను కాపాడేందుకు ప్రయత్నించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment