Soori
-
విజయ్ సేతుపతి 'విడుదల 2' సాంగ్ రిలీజ్
విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రధారులుగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విడుదల2. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సాంగ్ ' పావురమా పావురమా' మేకర్స్ విడుదల చేశారు. గతేడాదిలో రిలీజైన విడుదల చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. 'సంగీత మాంత్రికుడు ఇళయరాజా స్వరపరిచిన 'విడుదల 2' చిత్రంలోని తొలిపాటను తాజాగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. కాసర్ల శ్యామ్ కలం నుంచి వెలువడిన ఈ పాటను తెలుగు ప్రేక్షకులు ఇంత స్పీడుగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా విడుదల2 ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది.ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రిమారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్ర హక్కులను మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతున్నాం. డిసెంబర్ 20న ఇండియన్ సెల్యూలాయిడ్ పై ప్రేక్షకులంతా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.' అని ఆయన తెలిపారు.విజయ్ సేతుపతి, మంజు వారియర్ విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్,రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ శక్తివేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు. -
మ్యూజిక్ డైరెక్టర్ లేని సినిమా.. అంతా కోడి అరుపుతోనే
తెలుగులో కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి. ఏదో అప్పుడప్పుడు ఒకటి అరా కంటెంట్ ఓరియెంట్ మూవీస్ వస్తుంటాయి. కానీ తమిళ, మలయాళంలో మాత్రం దర్శకులు ఎప్పుడో ఏదో కొత్తదనం ట్రై చేస్తుంటారు. అలా తీసిన తమిళ సినిమా 'కొట్టుకళి'. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవసరమే లేకుండా ఈ చిత్రాన్ని తీయడం విశేషం. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్)'కల్కి'లో కైరా పాత్రలో నటించింది మలయాళ నటి అన్నాబెన్. 'కొట్టుకళి'లో ఈమె ప్రధాన పాత్రధారి. సూరి హీరోగా చేశాడు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మించాడు. గతంలో 'పెబ్బల్స్' అనే అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన పీఎస్ వినోద్ రాజ్ దీనికి దర్శకుడు. ఆగస్టు 23న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.కోడి పుంజు సీన్‌తో ట్రైలర్ మొదలవుతుంది. చుట్టూ ఉన్న సౌండ్స్‌తో పాటు కోడీ అరుపుతోనే ట్రైలర్ అంతా చూపించారు. దెయ్యం పట్టిన ఓ అమ్మాయిని దాన్ని వదిలించడానికి హీరో అండ్ గ్యాంగ్ తీసుకుపోవడం.. పల్లెటూరిలో జరిగే చిన్న చిన్న గొడవలు.. ఇలా ఏదో ఉంది అనేలా ట్రైలర్ చూపించారు. డిఫరెంట్ మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు బహుశా ఇది నచ్చొచ్చేమో!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన వెరైటీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ) -
కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా పేరు తెచ్చుకునేంత వరకు వెళ్లిన నటుడు సూరి. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇతడు గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా మారి హిట్ కొట్టాడు. ఇప్పుడు 'గరుడన్'గా రాబోతున్నాడు. ఉన్ని ముకుందన్, సముద్రఖని, రేవతీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మే 31న థియేటర్లలోకి రాబోతుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ అందించిన ఈ సినిమాకు దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. 'గరుడన్' ఆడియో ఈవెంట్ తాజాగా జరగ్గా దీనికి తమిళ స్టార్ హీరోలు విజయసేతుపతి, శివకార్తీకేయన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'హాస్య నటులని చులకనగా చూడొద్దు. ఓ టైంలో హీరోగా చేయమని సూరికి సలహా ఇచ్చాను. కానీ ఆయన కాస్త భయపడ్డాడు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి.. వెట్రిమారన్ తనని హీరోగా పెట్టి మూవీ చేస్తున్నానని, కానీ కాస్త దడ పుడుతోందని అన్నాడు. అయితే కామెడీ నటులు సీరియస్ పాత్రల్లో నటించగలరు గానీ సీరియస్ నటులు కామెడీ పాత్రలు చేయలేరు. అందుకు సూరినే ఓ ఉదాహరణ' అని శివకార్తికేయన్ చెప్పాడు. తనని హీరోగా మార్చిన వెట్రిమారన్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని సూరి ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్) -
నాలుగేళ్ల గొడవ క్లియర్.. హీరో-కమెడియన్ కలిసిపోయారు!
ఆ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే, కలిసి 7 సినిమాలు చేశారు. ఆ తరువాత ఓ విషయంలో ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. అలాంటిది తాజాగా ఒకే ఫొటోలో నవ్వుతూ కనిపించారు. పైన చెప్పిన నటులెవరో కాదు. తమిళ ఇండస్ట్రీకి చెందిన విష్ణువిశాల్, హాస్య నటుడు సూరి. (ఇదీ చదవండి: సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్!) విష్ణువిశాల్ హీరోగా, సూరి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కలిసి 7 సినిమాలు చేశారు. కానీ ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. విష్ణువిశాల్, అతడి తండ్రి తనను మోసం చేశారని 2020లో నటుడు సూరి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈ వివాదం చాలాకాలం కొనసాగింది. నటుడు విష్ణువిశాల్ తండ్రి రమేష్.. మాజీ డీజీపీ. ఇటీవల లాల్ సలామ్ చిత్ర ప్రచార వేదికపై కూడా తమ మధ్య నెలకొన్న సమస్య గురించి తానూ, నటుడు సూరి చర్చించుకుంటున్నామని విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా నటుడు విష్ణువిశాల్ ఆయన తండ్రి రమేష్, సూరితో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్మీడియాలో పోస్ట్ చేశారు. అందులో టైమ్ అన్నింటికీ, అందరికీ బదులిస్తుంది. ఐలవ్ యూ నాన్న హీరో విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాగే నటుడు సూరి కూడా జరిగేవన్నీ మంచికే అని తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో వీరి మధ్య సమస్య పరిష్కారం అయ్యిందని అందరూ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!) TIME is the answer to everything and everyone.. Let the positivity flow @sooriofficial na.. Love u appa ..... pic.twitter.com/Yvn28SR31B — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) April 9, 2024 -
హీరోగా స్టార్ కమెడియన్.. మరో మాస్ చిత్రం రెడీ
తెలుగులో తక్కువ గానీ తమిళంలో పలువురు కమెడియన్స్ కూడా హీరోలుగా రాణిస్తున్నారు. సంతానం.. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. తాజాగా కమెడియన్ సూరి కూడా డిఫరెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోతున్నాడు. గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు 'గరుడన్'గా వచ్చేందుకు రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాసిన స్టోరీతో 'గరుడన్' మూవీ తీశారు. ఇందులో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. అలానే హీరోని కుక్కతో పోల్చుతూ చెప్పిన డైలాగ్స్, విజువల్స్ కూడా సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) -
విడుదల సినిమా టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
Vidudhala Movie Review: వెట్రిమారన్ ‘విడుదల పార్ట్-1’ రివ్యూ
టైటిల్: విడుదల పార్ట్-1 నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి,భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు తదితరులు నిర్మాత : ఎల్రెడ్ కుమార్ దర్శకత్వం: వెట్రిమారన్ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్ విడుదల తేది: ఏప్రిల్ 15, 2023 కథేంటంటే.. పోలీసులకు, ప్రజా దళం అనే ఒక రివల్యూషనరీ గ్రూప్ కి మధ్య నడిచే కథ ఇది. కుమరేశన్ (సూరి) పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ప్రజాదళం సభ్యులకు, పోలీసులకు నిత్యం ఎన్కౌంటర్ జరుగుతుంటాయి. ప్రజాదళం లీడర్ పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకుప్రైవేట్ కంపెనీతో కలిసి క్యాంపుని నిర్వహిస్తుంది పోలీసు శాఖ. ఇక డ్రైవర్ కుమరేశన్ అడవిప్రాంతంలో డ్యూటీ చేసే పోలీసులకు నిత్యం ఆహారం సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో అడవిలో నివసించే యువతి తమిళరసి అలియాస్ పాప(భవాని శ్రీ)తో ప్రేమలో పడతాడు. మరోవైపు తనపై అధికారికి తెలియకుండా కొండ ప్రాంతానికి చెందిన మహిళను కాపాడి అతని ఆగ్రహానికి గురవుతాడు. ఓసారి పెరుమాళ్ ఆచూకి కోసం కొండప్రాంతంలో నివసించేవారందరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతుంటారు. అందులో కుమరేశన్ ఇష్టపడిన యువతి తమిళరసి కూడా ఉంటుంది. పోలీసులు పెట్టే చిత్ర హింసలు చూడలేక కుమరేశన్ ఏం చేశాడు? పెరుమాళ్ కోసం సాగించే వేటలో కుమరేశన్ ఎలాంటి పాత్ర పోషించాడు? డీఎస్పీ సునీల్ మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? చివరకు పెరుమాళన్ దొరికాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కల్ట్ కంటెంట్ తో సామాజిక మూలలలోకి వెళ్లి కథలని తెర పై ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా సమాజంలో అణచివేయబడుతున్న ఒక వర్గం వేదన కనిపిస్తుంది. మనం ఎక్కడో విన్న, చూసిన సంఘటలనే ఆయన సినిమాగా తెరకెక్కిస్తుంటాడు. విడుదల పార్ట్ 1 కూడా ఆ తరహా సినిమానే. 1987 ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం లోని ఒక ప్రాంతం లో జరిగే కథ. పోలీసులకు, ప్రజాదళం అనే ఒక విప్లవ పార్టీ కి మధ్య జరిగే సంఘర్షణ ఇది. ట్రైన్ యాక్సిడెంట్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. రైలు ప్రమాదపు దృశ్యాలను చాలా సహజంగా చూపించాడు. ఆ తర్వాత కథ మొత్తం కుమరేశన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. నిజాయితీగా ఉండే పోలీసులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? పై అధికారులు కిందిస్థాయి అధికారులతో ఎలా ప్రవర్తిస్తారనేది కుమరేశన్ పాత్ర ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ఈ తరహా చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. పోలీసులు, నక్సలైట్ల మధ్య పోరు కారణంగా సామాన్య ప్రజలు ఎలా నలిగిపోయారనే కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం లేదు. తమిళ నెటివిటీ మరీ ఎక్కువైంది. కాకపోతే ప్రతి సన్నివేశాన్ని చాలా సహజంగా తీర్చిదిద్దారు. కొన్ని సన్నివేశాలు హృదయాలను కలిచివేస్తాయి. ముఖ్యంగా పెరుమాళ్ కోసం ఊర్లోని ఆడవాళ్లను పోలీసులు హింసించే సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. అదే సమయంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పార్ట్ 2 కోసం కొన్ని అనవసరపు సన్నివేశాలను జోడించారనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఆట్టుకోవడంతో పాటు పార్ట్ 2పై ఆసక్తిని పెంచేస్తుంది. ఎవరెలా చేశారంటే.. కమెడియన్‌గా ఇన్నాళ్లు నవ్వించిన సూరి.. ఇందులో కొత్త పాత్రను పోషించాడు. కుమరేశన్ పాత్రలో సూరి జీవించేశాడు. అసలు ఈ పాత్ర కోసం వెట్రిమారన్.. సూరిని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కమెడియన్లో ఈ యాంగిల్ ఎలా పసిగట్టాడనిపిస్తుంది. ఈ చిత్రంతో సూరి కేరీర్ చేంజ్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రజాదళం నాయకుడు పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి అదరగొట్టేశాడు. ఆయన తెరపై కనిపించేంది కొన్ని నిమిషాలే అయితే.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పార్ట్ 2లో విజయ్ సేతుపతి పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కొండప్రాంతానికి చెందిన యువతి పాప అలియాస్ తమిళరసిగా భవాని శ్రీ అద్భుతంగా నటించింది. గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఇళయరాజా నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. కెమెరామెన్ పనితీరు అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్ : 2.75/5 -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తమిళ సూపర్ హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
విజయ్‌సేతుపతి, సూరి కీలక పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'విడుతలై పార్ట్ 1'. ఈ సినిమాను వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ 'విడుదల పార్ట్1' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 15వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. విచారణ పేరుతో మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్న పోలీసులపై పెరుమాళ్ మాస్టర్ (విజయ్ సేతుపతి ) పోరాటం, అతని కోసం పోలీసు బలగాలు వెతకడం గురించి ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవవుతుంది. సూరి ఈ చిత్రంలో కానిస్టేబుల్ కుమరేశన్‌గా నటిస్తున్నారు. అన్యాయం గురించి అతను పడే నిరాశ, అసమర్థతను కూడా ట్రైలర్లో చూపించారు. పెరుమాళ్‌కు ఏం జరుగుతుంది? చివరకు అతన్ని ఎవరు పట్టుకుంటారు? అనేది అసలు కథ. కాగా.. ఈ చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ ప్రధానపాత్రల్లో నటించారు, రజినీకాంత్ ప్రశంసలు ఇప్పటికే ఈ సినిమాపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. చిత్రబృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇళయరాజా సంగీతం అద్భుతంగా ఉందని కొనియాడారు. పార్ట్-2 సినిమా కోసం ఎదురు చూస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన విడుదల పార్ట్1 టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. pic.twitter.com/FawO7l1oqA — Rajinikanth (@rajinikanth) April 8, 2023 -
హీరోగా మారిన కమెడియన్.. రెండు భాగాలుగా సినిమా
వెన్నెలా కబడి కుళు చిత్రం ద్వారా చిన్న పాత్రలో పరిచయమైన నటుడు సూరి. ఆ చిత్రంలో సూరి కామెడీ అందరినీ ఆకర్షించింది. దీంతో ఆయనకు వరుసగా అవకాశాలు లభించాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రముఖ హాస్యనటుడి స్థాయికి ఎదిగాడు. ఇంకేముంది ఆ క్రేజ్ సూరిని కథానాయకుడిని చేసేసింది. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై ఎల్ రెడ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రంలో సూరి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. వెట్రిమాన్ దర్శకత్వంలో విడుదలై పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సూరి హీరోగా నటిస్తున్న తొలి చిత్రమే రెండు భాగాలుగా రూపొందించడం విశేషం. ఇందులో నటుడు ప్రధాన పాత్రలో నటించడం మరో విశేషం. కాగా ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే ఈయనకు హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. మదయానై చిత్రం ఫేమ్ విక్రమ్ సుకుమార్ నటుడు సూరి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మరో చిత్రంలోనూ సూరి హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో విడుదలై చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా దర్శకుడు వెట్రిమారన్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా హాస్యనటులుగా పేరుతెచ్చుకుని హీరోల అవతారమెత్తిన వడివేలు, సంతానం వంటి వాళ్లు ఇప్పుడు మళ్లీ మొదటికే వస్తున్నారు. మరి హీరోగా సూరి భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. -
సీఎం సహాయనిధికి హాస్యనటుడు సూరి విరాళం
సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రముఖ హాస్యనటుడు సూరి సీఎం రిలీఫ్ ఫండ్ నిధికి తన వంతుగా రూ.10 లక్షలు, తన కొడుకు సర్వాన్, కూతురు వెన్నెల పేరుతో మరో రూ.25వేలను విరాళంగా అందించారు. ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను కలిసిన సూరి రూ.10 లక్షలు చెక్కు రూపంలోనూ, రూ.25వేలు నగదును అందించారు. ప్రజలకు కోవిడ్ వైద్యం, ఆక్సిజన్, వ్యాక్సిన్ సదుపాయాలను సమకూర్చడానికి దాతలు సీఎం సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు తమ వంతు విరాళాలను అందించారు. -
క్యాన్సర్‌తో కమెడియన్.. చేయూతనిచ్చిన హీరోలు
తమిళనాడు: తన కామెడితో తమిళ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు తవసి కొంతకాలంగా మాయదారి మహమ్మారితో బాధపడుతున్నారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయనకు క్యాన్సర్ నాలుగో స్టేజ్‌లో ఉంది. ఈ క్రమంలో ఆయన బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనందగా మారిపోయారు. దీంతో ఆయన చికిత్సకు ఆర్థిక సాయం చేయాలంటూ తవసి కుమారుడు అరుముగన్ కోలీవుడ్ పెద్దలను ఆర్జించాడు. దీంతో ఆయనను ఆర్థికంగా ఆదుకునేందుకు తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, సూరిలతో పాటు మరికొంత మంది పరిశ్రమ పెద్దలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. హీరో శివకార్తికేయన్ తన ఫ్యాన్స్ అసోయేషన్తో రూ. 25వేల చెక్‌ను తవసి కుటుంబానికి అందించినట్లు సమాచారం. (చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్) అంతేగాక విజయ్ సేతుపతి, తన స్నేహితుడైన సుందర్ రాజ్‌తో కలిసి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. అయితే ఇందులో సుందర్ రాజ్ తన వంతుగా పది వేలు ఇవ్వగా.. నటుడు సూరి నిత్యవసర సరుకులు అందించారు. ఇక ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ ఇప్పటి తవసికి వైద్య ఖర్చులను చూసుకున్నట్లు సమాచారం. అయితే స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతున్న తవసి ప్రస్తుతం ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో అయనకు పైపు ద్వారా పళ్ల రసాలను ఆహారంగా ఇస్తున్నారు. కాగా తవసి ‘సువరాపాండియన్’, ‘వరుతాపాధ వాలిబార్ సంగం’, ‘రజిని మురుగన్’ తదితర చిత్రాల్లో సహా నటుడిగా నటించి నటుడిగా గుర్తింపు పొందారు. (చదవండి: ఆ హీరో ఫ్యాన్స్‌తో నాకు ప్రమాదం..) -
హీరో తండ్రిపై ప్రముఖ కమెడియన్ ఫిర్యాదు
చెన్నై: తమిళ హీరో విష్ణు విశాల్ తండ్రి రమేశ్ కడవ్లా మీద ప్రముఖ హాస్య నటుడు సూరి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ప్లాట్ అమ్మకానికి ఉందంటూ తన దగ్గర 2.70 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని పేర్కొన్నాడు. తన డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా ఎన్నోసార్లు అడిగానని, అయినా ఐదేళ్లుగా వారి నుంచి సమాధానం రాలేదని తెలిపాడు. రమేశ్‌తో పాటు ఫినాన్షియర్ అంబువేల్ రాజన్‌కు కూడా ఇందులో ప్రమేయం ఉందని, అంతేగాకుండా వీర ధీర సూరన్ సినిమాకు గానూ తనకు ఇవ్వాల్సిన రూ. 40 లక్షల పారితోషికాన్ని ఎగ్గొట్టారని ఆరోపించాడు. సూరి ఫిర్యాదు మేరకు అడయార్ పోలీసులు రమేశ్‌తో పాటు అంబువేల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా రమేశ్ గతంలో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. (చదవండి: అబ్బే... ఆ ఉద్దేశం లేదు) షాకింగ్‌గా ఉంది: విష్ణు విశాల్ ఇక ఈ విషయంపై స్పందించిన విష్ణు విశాల్.. తమ కుటుంబంపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశాడు. ‘‘ఇది చాలా షాకింగ్‌గానూ, బాధ కలిగించేది గానూ ఉంది. నాపై, మా నాన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి వెనుక ఏదో దురుద్దేశం ఉంది. నిజానికి సూరి, విష్ణు విశాల్ స్టూడియో నుంచి 2017లో కవరిమాన్ పరాంబరై సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చెల్లించాల్సి ఉంది. ఆ సినిమా నుంచి అతడు తప్పుకొన్నాడు’’ అని పేర్కొన్నాడు. ఇతరులపై నిందలు వేయడం సులభమే కానీ, అంతకంటే ముందు తమ గురించి తాము పరిశీలన చేసుకోవాలన్న కోట్‌ను ఉటంకిస్తూ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. ITS EASY TO ACCUSE OTHERS HARDER TO CHECK ON YOURSELF - BLESS#MOMENTOFTRUTH#உண்மைஒருநாள்வெல்லும் pic.twitter.com/nXaV7bLM9E — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) October 9, 2020 -
కావాలనే విమర్శిస్తున్నారు : హాస్య నటుడు
సినిమా సమీక్షల విషయంలో భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. పెద్ద సినిమాల నిర్మాతలు రివ్యూల కారణంగా తమ సినిమాలకు నష్టం జరుగుతుందంటే.. చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం రివ్యూల కారణంగానే తమ సినిమాలకు గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. అయితే తాజాగా ఓ తమిళ కమెడియన్ రివ్యూలపై ఫైర్ అయ్యాడు. కోలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న కమెడియన్ సూరి ఇటీవల సామి స్క్వేర్, సీమ రాజ సినిమాల్లో కనిపించారు. ఈ రెండు సినిమాల్లో సూరి నటనపై విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా సీమరాజ సినిమా కు రివ్యూలు నెగెటివ్‌గా రావటంతో.. కావాలనే తమ సినిమా మీద దాడి చేస్తున్నారంటూ ఆరోపించారు సూరి. అంతేకాదు విమర్శకులు తమిళ సినిమాలపై దాడి చేయటం ఆపి సినిమాలను కాపాడేందుకు ప్రయత్నించాలన్నారు. -
నాన్న నటనలో 5 శాతం చేయలేను!
చెన్నై: తనకు హీరో అవ్వాలని లేదని కమెడియన్ సూరి అంటున్నాడు. విశాల్ హీరోగా నటించిన రాయుడు తెలుగులో ఇటీవల విడుదలైంది. ఆ మూవీలో విశాల్ ఫ్రెండ్ గా సూరీ నటించాడు. అయితే కొన్ని మూవీలతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. కమెడీయన్లలో త్వరగా పేరు తెచ్చుకుని, ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి సూరీ. ప్రస్తుతం తన ఖాతాలో ఏడు సినిమాలు ఉన్నాయని గర్వంగా చెబుతున్నాడు. కోలీవుడ్ ప్రేక్షకులను పదేళ్లకు పైగా తనదైన కామెడీతో నవ్వించిన సూరీ, ఇప్పుడు రాయుడుతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కామెడీనే తనకు లైఫ్ ఇచ్చిందని, తాను కమెడియన్ గానే ఉంటానని పేర్కొన్నాడు. తన సినిమాలు చూసిన వారు ఎవరైనా తనను ఓ మంచి గుర్తుంచుకుంటారని చెప్పాడు. కొన్ని సీన్లలో తనదైన టైమింగ్ తో అదనంగా డైలాగ్ లు చెప్పినా హీరోలు, డైరెక్టర్లు తనను ఒక్కమాట కూడా పోవడంతో పాటు మెచ్చుకున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఫ్రెండ్స్ తో కలిసి స్టేజీ నాటకాలు వేసిన వాడిని ఈ రోజు ఓ స్థాయికి చేరుకున్నాను. క్షణాల్లో సీన్ పండించడం తన తండ్రి నుంచి నేర్చుకున్నానని, మా ఊరిలో నాన్నే అందరికంటే ఫన్నీ మ్యాన్ అంటున్నాడు. మా నాన్న నటనలో నేను 5 శాతం చేయలేనని సూరి చెప్పుకొచ్చాడు. కామెడీ చాలా సీరియస్ అంశమని, విశాల్ నుంచి మొదలుకుని కార్తీ వరకూ అందరితో తాను ఫ్రెండ్లీగా ఉంటానని వివరించాడు. ప్రస్తుతం సూర్య మూవీ ఎస్3 లో నటిస్తున్నట్లు కమెడియన్ సూరి చెప్పాడు.