![Comedian Soori Donates Rs 10 lakh To TN CM COVID Relief Fund - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/5/soori.gif.webp?itok=FZlyUiTk)
ఉదయనిధి స్టాలిన్‌కు చెక్కు అందిస్తున్న సూరి
సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రముఖ హాస్యనటుడు సూరి సీఎం రిలీఫ్ ఫండ్ నిధికి తన వంతుగా రూ.10 లక్షలు, తన కొడుకు సర్వాన్, కూతురు వెన్నెల పేరుతో మరో రూ.25వేలను విరాళంగా అందించారు. ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను కలిసిన సూరి రూ.10 లక్షలు చెక్కు రూపంలోనూ, రూ.25వేలు నగదును అందించారు.
ప్రజలకు కోవిడ్ వైద్యం, ఆక్సిజన్, వ్యాక్సిన్ సదుపాయాలను సమకూర్చడానికి దాతలు సీఎం సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు తమ వంతు విరాళాలను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment