
తమిళనాడు: తన కామెడితో తమిళ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు తవసి కొంతకాలంగా మాయదారి మహమ్మారితో బాధపడుతున్నారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయనకు క్యాన్సర్ నాలుగో స్టేజ్‌లో ఉంది. ఈ క్రమంలో ఆయన బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనందగా మారిపోయారు. దీంతో ఆయన చికిత్సకు ఆర్థిక సాయం చేయాలంటూ తవసి కుమారుడు అరుముగన్ కోలీవుడ్ పెద్దలను ఆర్జించాడు. దీంతో ఆయనను ఆర్థికంగా ఆదుకునేందుకు తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, సూరిలతో పాటు మరికొంత మంది పరిశ్రమ పెద్దలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. హీరో శివకార్తికేయన్ తన ఫ్యాన్స్ అసోయేషన్‌తో రూ. 25వేల చెక్‌ను తవసి కుటుంబానికి అందించినట్లు సమాచారం. (చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్)
అంతేగాక విజయ్ సేతుపతి, తన స్నేహితుడైన సుందర్ రాజ్‌తో కలిసి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. అయితే ఇందులో సుందర్ రాజ్ తన వంతుగా పది వేలు ఇవ్వగా.. నటుడు సూరి నిత్యవసర సరుకులు అందించారు. ఇక ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ ఇప్పటి తవసికి వైద్య ఖర్చులను చూసుకున్నట్లు సమాచారం. అయితే స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతున్న తవసి ప్రస్తుతం ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో అయనకు పైపు ద్వారా పళ్ల రసాలను ఆహారంగా ఇస్తున్నారు. కాగా తవసి ‘సువరాపాండియన్’, ‘వరుతాపాధ వాలిబార్ సంగం’, ‘రజిని మురుగన్’ తదితర చిత్రాల్లో సహా నటుడిగా నటించి నటుడిగా గుర్తింపు పొందారు. (చదవండి: ఆ హీరో ఫ్యాన్స్‌తో నాకు ప్రమాదం..)
Comments
Please login to add a commentAdd a comment