మ్యూజిక్ డైరెక్టర్ లేని సినిమా.. అంతా కోడి అరుపుతోనే | Kottukkaali Movie Trailer Telugu And Details | Sakshi
Sakshi News home page

Kottukkali Trailer: డిఫరెంట్ మూవీ.. డిఫరెంట్ అటెంప్ట్!

Aug 13 2024 12:58 PM | Updated on Aug 13 2024 1:26 PM

Kottukkaali Movie Trailer Telugu And Details

తెలుగులో కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి. ఏదో అప్పుడప్పుడు ఒకటి అరా కంటెంట్ ఓరియెంట్ మూవీస్ వస్తుంటాయి. కానీ తమిళ, మలయాళంలో మాత్రం దర్శకులు ఎప్పుడో ఏదో కొత్తదనం ట్రై చేస్తుంటారు. అలా తీసిన తమిళ సినిమా 'కొట్టుకళి'. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవసరమే లేకుండా ఈ చిత్రాన్ని తీయడం విశేషం. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్)

'కల్కి'లో కైరా పాత్రలో నటించింది మలయాళ నటి అన్నాబెన్. 'కొట్టుకళి'లో ఈమె ప్రధాన పాత్రధారి. సూరి హీరోగా చేశాడు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మించాడు. గతంలో 'పెబ్బల్స్' అనే అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన పీఎస్ వినోద్ రాజ్ దీనికి దర్శకుడు. ఆగస్టు 23న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

కోడి పుంజు సీన్‌తో ట్రైలర్ మొదలవుతుంది. చుట్టూ ఉన్న సౌండ్స్‌తో పాటు కోడీ అరుపుతోనే ట్రైలర్ అంతా చూపించారు. దెయ్యం పట్టిన ఓ అమ్మాయిని దాన్ని వదిలించడానికి హీరో అండ్ గ్యాంగ్ తీసుకుపోవడం.. పల్లెటూరిలో జరిగే చిన్న చిన్న గొడవలు.. ఇలా ఏదో ఉంది అనేలా ట్రైలర్ చూపించారు. డిఫరెంట్ మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు బహుశా ఇది నచ్చొచ్చేమో!

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన వెరైటీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement