ఓటీటీలోకి మరో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అంటే ఇష్టపడేవాళ్లకు ఇది మరింత నచ్చేయొచ్చు. ఇప్పటికే కన్నడ వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉందనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)
'దసరా' సినిమాలో నాని పక్కన నటించిన దీక్షిత్ శెట్టి.. 'బ్లింక్' మూవీలో హీరోగా చేశాడు. మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేస్తే తొలుత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత తర్వాత మౌత్ టాక్‌తో హిట్ అయింది. ఇప్పుడు దీన్ని తెలుగులో నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చేశారు.
'బ్లింక్' విషయానికొస్తే.. పీజీలో ఫెయిల్ అయిన కుర్రాడు అపూర్వ(దీక్షిత్ శెట్టి). తల్లి దగ్గర ఈ విషయం దాచి, పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో ఉంటాడు. మంచి జాబ్ చేసి సెటిల్ కావాలనేది డ్రీమ్. అలాంటిది తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ ఇతడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కనురెప్పల్ని మూస్తే టైమ్ ట్రావెల్‌లో ముందుకు వెనక్కి వెళ్తుంటాడు? అసలు ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ!
(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!)
Comments
Please login to add a commentAdd a comment