
'దేవర' సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతున్న జాన్వీ కపూర్‌కి తిరుపతి వేంకటేశ్వర స్వామి చాలా సెంటిమెంట్. ఎప్పటికప్పుడు స్వామి దర్శనం చేసుకుంటూనే ఉంటుంది. మంగళవారం తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా మరోసారి స్వామి వారిని దర్శించుకుంది. కాకపోతే మెట్ల దారిలో కొండ పైకి చేరుకుంది.
(ఇదీ చదవండి: అతిలోక సుందరి శ్రీదేవి 61వ జయంతి.. రేర్ ఫొటోలు)
ఈ క్రమంలోనే తన ఇన్ స్టాలో తల్లి శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జాన్వీ కపూర్ పోస్ట్ పెట్టింది. ఇందులో తల్లితో చిన్నప్పటి ఫొటోని, మెట్ల దారిలో తాను దిగిన ఓ ఫొటోని జాన్వీ షేర్ చేసింది.
హిందీలో చాన్నాళ్ల క్రితమే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో 'దేవర', రామ్ చరణ్ కొత్త మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ రెండింటిపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఈ మూవీస్ హిట్ అయితే మాత్రం జాన్వీ దశ తిరిగినట్లే!
(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)
Our Thangam #JanhviKapoor At Lord Venkateswara Swamy Temple In Tirumala Today 💛🤩. #Chuttamalle pic.twitter.com/FMQ5tkHcGq
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) August 13, 2024