కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా పేరు తెచ్చుకునేంత వరకు వెళ్లిన నటుడు సూరి. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇతడు గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా మారి హిట్ కొట్టాడు. ఇప్పుడు 'గరుడన్'గా రాబోతున్నాడు. ఉన్ని ముకుందన్, సముద్రఖని, రేవతీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మే 31న థియేటర్లలోకి రాబోతుంది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ అందించిన ఈ సినిమాకు దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. 'గరుడన్' ఆడియో ఈవెంట్ తాజాగా జరగ్గా దీనికి తమిళ స్టార్ హీరోలు విజయసేతుపతి, శివకార్తీకేయన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
'హాస్య నటులని చులకనగా చూడొద్దు. ఓ టైంలో హీరోగా చేయమని సూరికి సలహా ఇచ్చాను. కానీ ఆయన కాస్త భయపడ్డాడు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి.. వెట్రిమారన్ తనని హీరోగా పెట్టి మూవీ చేస్తున్నానని, కానీ కాస్త దడ పుడుతోందని అన్నాడు. అయితే కామెడీ నటులు సీరియస్ పాత్రల్లో నటించగలరు గానీ సీరియస్ నటులు కామెడీ పాత్రలు చేయలేరు. అందుకు సూరినే ఓ ఉదాహరణ' అని శివకార్తికేయన్ చెప్పాడు. తనని హీరోగా మార్చిన వెట్రిమారన్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని సూరి ఎమోషనల్ అయ్యాడు.
(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్)
Comments
Please login to add a commentAdd a comment