నాన్న నటనలో 5 శాతం చేయలేను!
చెన్నై: తనకు హీరో అవ్వాలని లేదని కమెడియన్ సూరి అంటున్నాడు. విశాల్ హీరోగా నటించిన రాయుడు తెలుగులో ఇటీవల విడుదలైంది. ఆ మూవీలో విశాల్ ఫ్రెండ్ గా సూరీ నటించాడు. అయితే కొన్ని మూవీలతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. కమెడీయన్లలో త్వరగా పేరు తెచ్చుకుని, ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి సూరీ. ప్రస్తుతం తన ఖాతాలో ఏడు సినిమాలు ఉన్నాయని గర్వంగా చెబుతున్నాడు. కోలీవుడ్ ప్రేక్షకులను పదేళ్లకు పైగా తనదైన కామెడీతో నవ్వించిన సూరీ, ఇప్పుడు రాయుడుతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కామెడీనే తనకు లైఫ్ ఇచ్చిందని, తాను కమెడియన్ గానే ఉంటానని పేర్కొన్నాడు. తన సినిమాలు చూసిన వారు ఎవరైనా తనను ఓ మంచి గుర్తుంచుకుంటారని చెప్పాడు.
కొన్ని సీన్లలో తనదైన టైమింగ్ తో అదనంగా డైలాగ్ లు చెప్పినా హీరోలు, డైరెక్టర్లు తనను ఒక్కమాట కూడా పోవడంతో పాటు మెచ్చుకున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఫ్రెండ్స్ తో కలిసి స్టేజీ నాటకాలు వేసిన వాడిని ఈ రోజు ఓ స్థాయికి చేరుకున్నాను. క్షణాల్లో సీన్ పండించడం తన తండ్రి నుంచి నేర్చుకున్నానని, మా ఊరిలో నాన్నే అందరికంటే ఫన్నీ మ్యాన్ అంటున్నాడు. మా నాన్న నటనలో నేను 5 శాతం చేయలేనని సూరి చెప్పుకొచ్చాడు. కామెడీ చాలా సీరియస్ అంశమని, విశాల్ నుంచి మొదలుకుని కార్తీ వరకూ అందరితో తాను ఫ్రెండ్లీగా ఉంటానని వివరించాడు. ప్రస్తుతం సూర్య మూవీ ఎస్3 లో నటిస్తున్నట్లు కమెడియన్ సూరి చెప్పాడు.