
ఆ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే, కలిసి 7 సినిమాలు చేశారు. ఆ తరువాత ఓ విషయంలో ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. అలాంటిది తాజాగా ఒకే ఫొటోలో నవ్వుతూ కనిపించారు. పైన చెప్పిన నటులెవరో కాదు. తమిళ ఇండస్ట్రీకి చెందిన విష్ణువిశాల్, హాస్య నటుడు సూరి.
(ఇదీ చదవండి: సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్!)
విష్ణువిశాల్ హీరోగా, సూరి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కలిసి 7 సినిమాలు చేశారు. కానీ ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. విష్ణువిశాల్, అతడి తండ్రి తనను మోసం చేశారని 2020లో నటుడు సూరి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు.
ఈ వివాదం చాలాకాలం కొనసాగింది. నటుడు విష్ణువిశాల్ తండ్రి రమేష్.. మాజీ డీజీపీ. ఇటీవల లాల్ సలామ్ చిత్ర ప్రచార వేదికపై కూడా తమ మధ్య నెలకొన్న సమస్య గురించి తానూ, నటుడు సూరి చర్చించుకుంటున్నామని విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా నటుడు విష్ణువిశాల్ ఆయన తండ్రి రమేష్, సూరితో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్‌మీడియాలో పోస్ట్ చేశారు.
అందులో టైమ్ అన్నింటికీ, అందరికీ బదులిస్తుంది. ఐలవ్ యూ నాన్న హీరో విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాగే నటుడు సూరి కూడా జరిగేవన్నీ మంచికే అని తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో వీరి మధ్య సమస్య పరిష్కారం అయ్యిందని అందరూ అనుకుంటున్నారు.
(ఇదీ చదవండి: స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!)
TIME is the answer to everything and everyone..
Let the positivity flow @sooriofficial na..
Love u appa ..... pic.twitter.com/Yvn28SR31B— VISHNU VISHAL - VV (@TheVishnuVishal) April 9, 2024