Tamil Movie Viduthalai Part 1 Movie Trailer Released In Telugu - Sakshi
Sakshi News home page

Viduthala Part1: తమిళ సూపర్ హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!

Published Sat, Apr 8 2023 4:32 PM | Last Updated on Sat, Apr 8 2023 5:07 PM

Tamil Movie Viduthala Part1 Movie Trailer Released In Telugu - Sakshi

విజయ్‌సేతుపతి, సూరి కీలక పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'విడుతలై పార్ట్ 1'. ఈ సినిమాను వెట్రిమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ 'విడుదల పార్ట్‌1' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ  చిత్రం ఏప్రిల్‌ 15వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

విచారణ పేరుతో మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్న పోలీసులపై పెరుమాళ్ మాస్టర్ (విజయ్ సేతుపతి ) పోరాటం, అతని కోసం పోలీసు బలగాలు వెతకడం గురించి ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవవుతుంది. సూరి ఈ చిత్రంలో కానిస్టేబుల్ కుమరేశన్‌గా నటిస్తున్నారు. అన్యాయం గురించి అతను పడే  నిరాశ, అసమర్థతను కూడా ట్రైలర్‌లో చూపించారు. పెరుమాళ్‌కు ఏం జరుగుతుంది? చివరకు అతన్ని ఎవరు పట్టుకుంటారు? అనేది అసలు కథ. కాగా.. ఈ చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ ప్రధానపాత్రల్లో నటించారు,

రజినీకాంత్ ప్రశంసలు

ఇప్పటికే ఈ సినిమాపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. చిత్రబృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇళయరాజా సంగీతం అద్భుతంగా ఉందని కొనియాడారు. పార్ట్-2 సినిమా కోసం ఎదురు చూస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన విడుదల పార్ట్1 టాలీవుడ్‌ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement