హాస్య నటుడి నగలు దోపిడీ | Tamil comedian Kottachi robbed at Salem, lodges police complaint | Sakshi
Sakshi News home page

హాస్య నటుడి నగలు దోపిడీ

Published Wed, Jun 28 2017 8:05 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

హాస్య నటుడి నగలు దోపిడీ - Sakshi

హాస్య నటుడి నగలు దోపిడీ

చెన్నై‌: తమిళ హాస్యనటుడు కొట్టాచ్చి దారిదోపిడీకి గురయ్యారు. సోమవారం తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకునేందుకు అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో కొట్టాచ్చి బస్‌లో సేలం చేరుకున్నాడు. అక్కడ ఓ ఆటో ఎక్కాడు. కొంత దూరం వెళ్లిన తరువాత ఆటోలో మరో ఇద్దరు ఎక్కారు. సురమంగళం, నరసోదిపట్టి ప్రాంతానికి చేరుకోగానే ఆటోలో ఉన్నవాళ్లు కొట్టాచ్చిపై దాడిచేసి అతని వద్ద ఉన్న రెండు సవర్ల బంగారు గొలుసు, రూ.2,500 నగదు, ఏటీఎం కార్డు లాక్కొని ఆటో నుంచి కిందకు తోసేశారు.

గాయాలపాలైన కొట్టాచ్చి సేలంకు చెందిన మరో హాస్యనటుడు  బెంజిమన్‌కు ఫోన్‌ చేసి తన పరిస్థితిని వివరించాడు. బెంజిమెన్‌ అక్కడికి రాగా ఇద్దరూ దోపిడీపై సురమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి ఓ పోలీస్‌ అధికారి తెలుపుతూ కొట్టాచ్చి సేలం వచ్చినప్పుడు మద్యం సేవించి ఉన్నారని తెలిపారు. ఆటోడ్రైవర్‌ ఇద్దరు హిజ్రాలతో కలిసి కొట్టాచ్చి వద్ద దోపిడీ చేసినట్టు చెప్పారు. ఆ డ్రైవర్‌ ఎవరన్నది తెలిసిందని, అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement