Salem
-
అత్త కొడుకుతో సన్నిహితం, ఏడు నెలల గర్భం.. బలవంతంగా ప్రసవం
చెన్నై: గర్భం దాల్చిన మైనర్ బాలికకు గుట్టుచప్పుడు కాకుండా ఓ మహిళా డాక్టర్ ప్రసవం చేసింది. దీంతో బాలిక అస్వస్థతకు గురై మృతిచెందింది. విషయం బయటకు పొక్కడంతో డాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇందిరానగర్‌కు చెందిన జగదీశన్ కుమార్తె ఐశ్వర్య (17) అత్త కొడుకుతో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు వాలప్పాడిలో ఉన్న డాక్టర్ సెల్వంపాల్ రాజ్‌కుమార్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్ సెల్వం పాల్ ఆమె ఏడు నెలల గర్భవతి అని తెలిపారు. శనివారం ఉదయం ఐశ్వర్యకి ప్రసవం పేరుతో అబార్షన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అబార్షన్ వీలుకాకపోడంతో బాలికకు ప్రసవం చేశారు. దీంతో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలిక అస్వస్థత ఏర్పడింది. వెంటనే వైద్యం కోసం అంబులెన్స్‌లో సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐశ్వర్యను వైద్యులు పరిశీలించి మృతి చెందినట్టు నిర్ధారించారు. పుట్టిన శిశువుకు సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సేలం జిల్లా వైద్య సేవల డైరెక్టర్ వరమతి, ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ జయశెల్వి, పేలూరు జిల్లా వైద్యాధికారి నంబలం, ఇతర సభ్యులు డాక్టర్ సెల్వం పాల్‌ను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్యురాలితోపాటు బాలిక గర్భం దాల్చడానికి కారణమైన బంధువుపై చర్యలు తీసుకోనున్నారు. -
చేదు మిగిల్చిన షుగర్ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా..
సాక్షి, తమిళనాడు: బిడ్డలు మధుమేహం (షుగర్) బారిన పడడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చికిత్స అందిస్తున్నా.. వ్యాధి అదుపులోకి రాకపోవడంతో తట్టుకోలేకపోయారు. దీంతో కుటుంబమంతా పాలారులో దూకి మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. సేలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. సేలం నగరంలో పరిధిలోని దాదగాపట్టి నెసవాలర్ కాలనీకి చెందిన యువరాజ్ (35) పాన్‌విళి (30) దంపతులకు నితీషా (7), అక్షర (5) అనే కుమార్తెలున్నారు. నితీషా మూడేళ్ల క్రితం మధుమేహం బారిన పడింది. అప్పటి నుంచి బాలికకు చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో మూడు రోజుల క్రితం అక్షర కూడా మధుమేహం బారినపడినట్టు వైద్య పరిశోధనల్లో తేలింది. దీంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమార్తెలిద్దరూ పడుతున్న వేదనను చూసి తట్టుకోలేక పోయారు. ఈ క్రమంలో సోమవారం యువరాజ్ తన తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లకు ఓ లేఖ రాసి పెట్టి కుటుంబంతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మేట్టూరు సమీపంలోని తమిళనాడు – కర్ణాటక సరిహద్దుల్లోని ఈరోడ్ జిల్లా పరిధిలోని అడి పాలారు నదిలో యువరాజ్, పాన్‌విలి, నితిషా, అక్షర మృతదేహాలు మంగళవారం సాయంత్రం తేలాయి. సమాచారం అందుకున్న భవానీ డీఎస్పీ అమృత వర్షిణి ఘటనా స్థలానికి చేరుకుని ఆ నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అందియూరు జీహెచ్‌కు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ లేఖ ఆధారంగా కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు నిర్ధారించారు. -
సిలిండర్ పేలి ఐదుగురు దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని సేలంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. సేలం జిల్లా కరుంగల్ పట్టి పాండురంగన్ విట్టల్ వీధిలో వెంకటరాజన్, ఇంద్రాణి దంపతులకు నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో గోపినాథ్, ఆయన తల్లి, అత్తతో నివసిస్తున్నారు. మరో రెండు ఇళ్లల్లో వేర్వేరు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ ఇంటికి పక్కనే సేలం అగ్నిమాపక విభాగంలో ఎస్ఎస్ఐగా పనిచేస్తున్న పద్మనాభన్ ఇల్లు ఉంది. మంగళవారం తెల్లవారుజామున గోపినాథ్ తల్లి స్టౌవ్ వెలిగించే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ధాటికి ఆ నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలుసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం స్టాలిన్ తలా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
బిడ్డ వేదనను చూడ లేక.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి..
సాక్షి, చెన్నై: కేన్సర్‌తో తన కుమారుడు అనుభవిస్తున్న నరకయాతనను చూడలేక ఓ తండ్రి కారుణ్య హత్యకు పాల్పడ్డాడు. బంధువు సాయంతో తన కుమారుడికి విషం ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చాడు. సేలంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని కొంగనాపురం కరుసవల్లి గ్రామానికి చెందిన పెరియ స్వామి లారీ డ్రైవర్. ఆయనకు వన్నతమిళ్(14) కుమారుడు ఉన్నాడు. గత ఏడాది వన్న తమిళ్ కూడి వైపు కాలిలో ఓ కణితి బయట పడింది. వైద్యులు దీన్ని కేన్సర్ గడ్డగా తేల్చారు. దీనికి కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్ది రోజుల పాటు చికిత్స అందించారు. ఆ తదుపరి తరచూ చికిత్సకు తీసుకెళ్తూ వస్తున్నారు. వైద్య ఖర్చులు భారం కావడమే కాకుండా, కేన్సర్ క్రమంగా శరీరం అంతా వ్యాపించడం, ఆ కణితి భాగం చీము పట్టడంతో వన్నతమిళ్ పడుతున్న నరకాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేక పోయాడు. ఆ వేదన నుంచి కుమారుడికి విముక్తి కల్గించేందుకు నిర్ణయించారు. ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్న సమీప బంధువు ప్రభు సాయం తీసుకున్నాడు. విషం ఇంజెక్షన్ ద్వారా కారుణ్య హత్యకు సిద్ధం అయ్యారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు ఆదివారం రాత్రి ఆ టీకాను ఆ బాలుడికి వేశారు. నిద్రలోనే ఆ బాలుడు మరణించాడు. సోమవారం ఉదయాన్నే కేన్సర్ కారణంగా మరణించినట్టు ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే, పోలీసులకు ఆ బాలుడిని కారుణ హత్య చేసినట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ బాలుడి తండ్రి, బంధువును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
సీఎం సార్ రక్షించండి ప్లీజ్..! కదిలించిన చిన్నారి వీడియో
సాక్షి, చెన్నై: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో నరకాన్ని అనుభవిస్తున్న ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో సీఎం ఎంకే స్టాలిన్‌ను కదిలించింది. సోమవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఆ బాలికను పరామర్శించారు. వివరాలు.. సేలం జిల్లా అరిసియాపాళయంకు చెందిన విజయకుమార్, రాజ నందిని దంపతులకు జనని(14) కుమార్తె పదో తరగతి చదువుతోంది. పదేళ్ల వయస్సులోనే కర్రసాము, విలువిద్య, స్కేటింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించింది. 2019లో హఠాత్తుగా ఈ బాలిక ఇంట్లో స్పృహ తప్పింది. చదవండి: CM MK Stalin: ఒక మహిళ చమత్కారం.. స్టాలిన్ నవ్వులు రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు తేల్చారు. దీంతో బిడ్డను రక్షించుకునేందుకు ఆ తల్లి తన కిడ్నీని దానం చేసింది. శస్త్రచికిత్స జరిగిన 15 రోజుల్లో తల్లి దానం చేసిన కిడ్నీ కూడా దెబ్బతింది. ప్రస్తుతం రెండు కిడ్నీలు పాడైపోవడంతో పాటుగా కాలేయం కూడా చెడిపోయింది. దీంతో తన బిడ్డ ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఆ తల్లి సీఎం సెల్‌ను ఆశ్రయించింది. చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో ఆ బాలికకు వైద్యానికి ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో సీఎం స్టాలిన్‌ను కదిలించింది. చదవండి: ఒకవైపు వర్షం మరోవైపు బంద్: క్యాబ్, ఆటోల చార్జీల మోత! ఆస్పత్రిలో జనని తల్లి రాజనందినిని ఓదారుస్తున్న సీఎం ‘‘సీఎం సార్, నమస్తే...రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి..రెండేళ్లుగా నరకం చూస్తున్నాను.. డయాలసిస్ చేస్తున్నారు ..నొప్పి భరించలేకున్నాను.. నన్ను రక్షించండి..ప్లీజ్ ’’ అని ఆ బాలిక పెట్టిన వీడియోతో సీఎం చలించిపోయారు. సోమవారం మంత్రులు సుబ్రమణియన్, శేఖర్‌బాబుతో కలిసి స్టాన్లీ ఆస్పత్రికి సీఎం చేరుకున్నారు. ఆ బాలికను పరామర్శించారు. మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. బాలిక తల్లి రాజనందిని ఓదార్చారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. -
నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
చెన్నె: వైద్య విద్య కోర్సు (యూజీ)ల్లో ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే ‘నీట్’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై విద్యార్థుల్లో భయాందోళన నెలకొని ఉంది. ఆ పరీక్షపై ఒత్తిడి పెంచుకుని తాజాగా ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పటికే రెండుసార్లు నీట్ రాయగా అర్హత సాధించలేకపోయాడు. ఏడాదిగా మూడోసారి నీట్‌కు శిక్షణ పొందాడు. చివరకు ఆదివారం పరీక్ష ఉండగా ఫెయిలవుతాననే భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. ఈ ఘటనపై తమిళనాడులో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చదవండి: సీఎం జగన్ ప్రత్యేక చొరవ.. 48 గంటల్లో భూవివాదం పరిష్కారం సేలం జిల్లా కుజయ్యూర్‌కు చెందిన ధనుశ్ (19) నీట్‌కు ప్రిపేరవుతున్నాడు. గతంలో రెండుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించకపోయాడు. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో శిక్షణ తీసుకున్నాడు. తీరా ఆదివారం పరీక్ష ఉండగా భయాందోళన పెంచుకున్నాడు. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించలేమోననే భయంతో పరీక్షకు కొన్ని గంటలు ఉందనగా ఆ యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్‌పై ఒత్తిడి పెంచుకున్నట్లు తల్లిదండ్రులు, మృతుడి సోదరుడు నిశాంత్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ధనుశ్ తల్లిదండ్రులు ‘నీట్ పరీక్ష రద్దు చేయాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్ విద్యార్థి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నీట్ బలిపీఠం మీద మరొక మరణం. ఈ ఘటన నన్ను షాక్‌కు గురి చేసింది. నీట్‌కు శాశ్వత మినహాయింపు బిల్లును తీసుకువస్తాం’ అని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. நீட் எனும் பலிபீடத்தில் மற்றுமொரு மரணம்! கல்வியால் தகுதி வரட்டும்; தகுதி பெற்றால் மட்டுமே கல்வி எனும் அநீதி நீட் ஒழியட்டும்! நாளை நீட் நிரந்தர விலக்கு சட்ட மசோதா கொண்டு வருவோம்; #NEET-ஐ இந்தியத் துணைக்கண்டத்தின் பிரச்சினையாகக் கொண்டு செல்வோம். pic.twitter.com/iAI4zm9knA — M.K.Stalin (@mkstalin) September 12, 2021 -
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం
సాక్షి, చెన్నై : తమిళనాడులోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వివరాల ప్రకారం తమిళనాడులోని సేలం జిల్లా కురుంగచావడి గ్రామానికి చెందిన అన్బళగన్ కుటుంబంలో ఐదుగురు మరణించడంతో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. మొత్తం 11 మంది ఉన్న ఆ కుటుంబంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనం కాగా మిగిలిన ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఎ. రామన్ ఆదేశించారు. (ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం, మూడేళ్ల చిన్నారిపై...) -
32 మంది రైతులపై కేసు
సాక్షి, తమిళనాడు: గ్రీన్ వేకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన 32 మంది రైతులపై కేసులు నమోదుచేశారు. సేలం–చెన్నై మధ్య గ్రీన్ వే పథకాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఆ కేసును త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఇటీవల అప్పీల్ చేసింది. దీనిపై సేలం జిల్లా లాలికాల్ పట్టిలో ఆదివారం ఆందోళన చేసిన 21 మంది రైతులపై మల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కుల్లంపట్టిలో మరో 11 మంది రైతులపై కారిపట్టి పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి సొంత పొలంలో భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ సోమవారం సేలం జిల్లా అయోద్యపట్నంలో 7వ మైల్, రామలింగపురంలో రైతులు తమ ఇళ్ల ముందు నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. చదవండి: విషమంగా డీఎంకే ఎమ్మెల్యే ఆరోగ్యం -
మోదీకి వ్యతిరేకంగా ఆందోళన
సేలం: చదువుకున్న యువకులు పకోడీ విక్రయించైన బతకవచ్చని తెలిపిన మోదీ వ్యాఖ్యను ఖండిస్తూ సేలం రైల్వేస్టేషన్లో డైఫీ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం సేలం రైల్వే స్టేషన్లో పకోడి పంపిణీ చేశారు. తర్వాత స్టేషన్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులను పక్కను తోసివేసి రైల్వే స్టేషన్లోకి చొరబడి, రైల్వే పట్టాలపై బైటాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో యువకులకు అవకాశం కల్పించాలి, రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాని విరమించాలని నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు 63 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. రైలు పట్టాలపై ఆందోళన చేస్తున్న డైఫీ నేతలు, కార్యకర్తలు -
కావేరిలో విద్యార్థుల గల్లంతు..
సాక్షి, సేలం: ధర్మపురి జిల్లాలో కావేరి నదిలో మునిగి కర్ణాటక విద్యార్థులు ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సంతోష్ కారులో స్నేహితులు సూర్య, బాలాజీ, అరుణ్ కుమార్, కార్తిక్, నందకుమార్, పిజిలీ రావు, ఎస్ఎస్ అని మొత్తం ఎనిమిది మంది శుక్రవారం ధర్మపురి జిల్లాలో ఉన్న హొగ్నెకల్‌కు పర్యటనకు వచ్చారు. ఇక్కడ ఉన్న జలపాతాల్లో స్నానాలు చేసి ఆనందించారు. తర్వాత కర్ణాటకకు వెనుదిరిగిన వారు అంజట్టి వద్ద వెళుతుండగా ఆలంబాడి అనే ప్రాంతంలో ఉన్న కావేరి నదిలో స్నానం చేయడానికి దిగారు. అయితే అక్కడ స్నానం చేయకూడదు– ప్రమాదం అనే బోర్డు ఉన్నప్పటికీ దాన్ని బేఖాతరు చేస్తూ నీటిలో స్నానం చేయడానికి దిగారు. వారిలో సంతోష్ కొంత దూరం వెళ్లగా నీటి ఉధృతి అధికంగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు బాలాజి, ఎస్ఎస్ ప్రయత్నించారు. అయితే వారు కూడా నీళ్లలో గల్లంతయ్యారు. దీంతో మిగిలిన వారు ఒడ్డుకు చేరి పెన్నగరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పెన్నగరం డీఎస్పీ అన్బురాజ్, అగ్నిమాపక సిబ్బంది చుట్టు పక్కల గాలించి బాలాజి మృతదేహాన్ని బయటకు తీశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సరదాగా షికారుకు వచ్చి తిరిగి రాని లోకానికి వెళ్లిన స్నేహితుడిని చూసి సహ మిత్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. -
రౌడీని కొట్టి చంపిన మహిళలు
సాక్షి, సేలం (తమిళనాడు): నీళ్ల కుళాయి వద్ద దౌర్జన్యం చేసిన ఓ రౌడీని పది మందికిపైగా మహిళలు రాళ్లు, దుడ్డుకర్రలు, ఇనుప రాడ్లతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన గురువారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఈరోడ్ జిల్లాలోని సిత్తోడు ఆర్ఎన్ పుదూర్ మాదేష్‌వరా నగర్‌కు చెందిన సెల్వం(38)పై పలు స్టేషన్లలో అనేక కేసులున్నాయి. ఓ హత్య కేసులో జైలు శిక్ష పడి రెండేళ్ల కిందట బెయిల్‌పై విడుదలయ్యాడు. గురువారం సాయంత్రం తాగునీటి కుళాయి వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటుండగా సెల్వం అక్కడికి వెళ్లాడు. కుళాయి కిందనున్న బిందెను పక్కకు తీసి నీళ్లు తాగేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉన్నవారు సెల్వంతో గొడవ పడ్డారు. ఆగ్రహానికి గురైన సెల్వం.. రంగనాథన్ అనే వ్యక్తి చేతిని కత్తితో నరికాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళలంతా సెల్వంపై మూకుమ్మడిగా దాడికి దిగారు. రాళ్లు, దుడ్డుకర్రలు, ఇనుప రాడ్లతో చితకబాదారు. సెల్వాన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హాస్య నటుడి నగలు దోపిడీ
చెన్నై: తమిళ హాస్యనటుడు కొట్టాచ్చి దారిదోపిడీకి గురయ్యారు. సోమవారం తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకునేందుకు అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో కొట్టాచ్చి బస్‌లో సేలం చేరుకున్నాడు. అక్కడ ఓ ఆటో ఎక్కాడు. కొంత దూరం వెళ్లిన తరువాత ఆటోలో మరో ఇద్దరు ఎక్కారు. సురమంగళం, నరసోదిపట్టి ప్రాంతానికి చేరుకోగానే ఆటోలో ఉన్నవాళ్లు కొట్టాచ్చిపై దాడిచేసి అతని వద్ద ఉన్న రెండు సవర్ల బంగారు గొలుసు, రూ.2,500 నగదు, ఏటీఎం కార్డు లాక్కొని ఆటో నుంచి కిందకు తోసేశారు. గాయాలపాలైన కొట్టాచ్చి సేలంకు చెందిన మరో హాస్యనటుడు బెంజిమన్‌కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించాడు. బెంజిమెన్ అక్కడికి రాగా ఇద్దరూ దోపిడీపై సురమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి ఓ పోలీస్ అధికారి తెలుపుతూ కొట్టాచ్చి సేలం వచ్చినప్పుడు మద్యం సేవించి ఉన్నారని తెలిపారు. ఆటోడ్రైవర్ ఇద్దరు హిజ్రాలతో కలిసి కొట్టాచ్చి వద్ద దోపిడీ చేసినట్టు చెప్పారు. ఆ డ్రైవర్ ఎవరన్నది తెలిసిందని, అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
సేలంలో భారీ చోరీ
► 700 సవర్ల బంగారు నగలు, రూ. 2లక్షలు అపహరణ ► నిఘా కెమెరాల కనెక్షన్లు కట్ ► రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు సేలం: సేలంలోని వ్యాపార వేత్త ఇంట్లో భారీ చోరీ సంఘటన చోటు చేసుకుంది. సేలం కిచ్చిపాళయం అంకమ్మాల్ ఆలయ వీధికి చెందిన ఆదియప్పన్ (74). ఈయన సెవ్వాపేట ప్రాంతంలో కొయ్య, ఇనుప వస్తువుల వ్యాపారం చేస్తున్నాడు. ఇతని మొదటి భార్య మృతి చెందింది. ఆ తర్వాత అదే ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి(40) అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు మనోజ్ కుమార్, కుమార్తె దేవిప్రియ ఉన్నారు. గత ఏడాదిన్నర కిందట అనారోగ్యం కారణంగా ఆదియప్పన్ మృతి చెందాడు. అప్పటి నుంచి ఆయన భార్య విజయలక్ష్మి వ్యాపారం నడుపుతూ వస్తోంది. ఆమెకు సహాయంగా సోదరుడు భాస్కర్ కూడా ఉన్నాడు. ఆయన తన కుటుంబం సహా సోదరి ఇంట్లోనే ఉంటున్నాడు. విజయలక్ష్మి తన కుటుంబంతో అంకమ్మాల్ ఆలయ వీధిలో ఉన్న మూడంతస్తుల భవనంలో ఉంటోంది. ఆదివారం సాయంత్రం విజయలక్ష్మి తన కుటుంబంతో తిరుమల వెళ్లారు. ఇంటికి భద్రతగా తన తండ్రి దక్షిణా మూర్తి(63), శివభాగ్యం(58) ఉన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం తిరుమల నుంచి తిరిగి వచ్చిన విజయలక్ష్మి కారు డ్రైవర్‌కు డబ్బు ఇవ్వడం కోసం బీరువాను తెరిచి చూసింది. అప్పుడు బీరువాలో ఉన్న 700 సవర్ల నగలు, రూ. 2 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిచ్చిపాళయం పోలీసుల విచారణ : విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కిచ్చిపాళయం పోలీసులు, జాగిలం, ఫోరెన్సిక్ నిపుణులతో అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇంటి వెనుక వైపు ఉన్న స్నానపు గది తలుపులు, కిటికీలు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఇంట్లో పలు గదుల్లో 8 నిఘా కెమెరాలు ఉన్నాయని, అయితే వీడియో దృశ్యాలను నమోదు చేసే బాక్స్‌ను దొంగలు దోచుకెళ్లినట్లు తెలిసింది. మంత్రించిన నిమ్మ పండు : బీరువాలో మంత్రించిన నిమ్మపండు, దానితోపాటు పసుపు కుంకుమలు పూసిన ఒక లేఖ ఉంది. ఆ లేఖలో ‘ఈ విషయం గురించి బయట చెబితే కుటుంబం నాశనమవుతుంది’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో తమ ఇంట్లో అప్పుడప్పుడు పూజలు చేస్తారని విజయలక్ష్మి తెలిపారు. ఆ పూజలు చేసే ఒక స్వామీజీ వద్ద పలుమార్లు డబ్బు, నగలు చూపినట్టు చెప్పింది. అంతేకాకుండా ఇటీవల పూజ చేసిన సమయంలో తమను తిరుపతికి వెళ్లి రావాల్సిందిగా సూచించింది కూడా ఆ స్వామీజీనే అని వెల్లడించింది. దీంతో పూజలు చేసిన ఆ స్వామీజీపై పోలీసులకు సందేహం ఏర్పడింది. ఇంటిలోపల ఒక్క కిటికీ అద్దాలుకానీ, తలుపులు, తాళాలు కానీ ఏవీ పగులగొట్టలేదు. నిఘా కెమెరాల కనెక్షన్లు కట్ చేసి ఉన్నాయి. దీంతో ఆ కుటుంబీకులకు బాగా తెలిసిన వ్యక్తే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని పోలీసులు సందేహిస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాల పోలీసులు : సేలం నగర పోలీస్ కమిషనర్ సంజయ్‌కుమార్, నేర విభాగ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణన్, పోలీసు అధికారులు చోరీ జరిగిన ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం సంజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సహాయక కమిషనర్ల అధ్యక్షతన ఆరుగురు ఇన్స్పెక్టర్లతో కూడిన రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నేరస్తులను పట్టుకుంటామన్నారు. సీసీటీవీ కెమెరాల కనెక్షన్ కట్ చేసి ఉందని, త్వరలో నేరస్తులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ చోరీ గురించి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు సమాచారం వెల్లడైంది. -
కేంద్ర మంత్రిపై చెప్పు విసిరాడు
-
కేంద్ర మంత్రిపై చెప్పు విసిరాడు
సేలం: కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడులోని సేలంలో జేఎన్ యూ దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్ అంత్యక్రియలకు హాజరైన ఆయనపై ఆంగతకుడొకరు చెప్పు విసిరాడు. అది ఆయనకు కొంతదూరంలో పడింది. జేఎన్‌యూలో సమానత్వానికి చోటులేదని పేర్కొంటూ ముత్తుకృష్ణన్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుల వివక్షకు మరో విద్యార్థి బలయ్యాడన్న ప్రచారంతో తమిళనాట ఆగ్రహ జ్వాలలు రేగాయి. కుల వివక్షతో ఓ ప్రొఫెసర్ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ముత్తుకృష్ణన్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. ముత్తుకృష్ణన్ మృతిపై న్యాయ విచారణ జరపాలని సేలంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు చెన్నైలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. -
పళనికి బ్రహ్మరథం
► సొంత జిల్లాలో ఘన స్వాగతం ► నాలుగు జిల్లాలకు రూ. 331 కోట్లు ► అభివృద్ధి పనులకు శంకుస్థాపన సాక్షి, సేలం: సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా మంగళవారం సొంత జిల్లా సేలంలో అడుగు పెట్టిన పళనిస్వామికి పశ్చిమ తమిళనాడులోని జిల్లాల్లోని అన్నాడీఎంకే వర్గాలు, మద్దతుదారులు, అధికార యంత్రాంగం బ్రహ్మరథం పట్టాయి. పశ్చిమ తమిళనాడులోని నాలుగు జిల్లాల అభివృద్ధికి రూ. 331 కోట్లను సీఎం కేటాయించారు. పలు పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, సేలం తిరుప్పూర్, ధర్మపురి, కృష్ణగిరిలు పశ్చిమ తమిళనాడులోని జిల్లాలుగా పిలుస్తున్నారు. పశ్చిమంలోని సేలం జిల్లా ఎడపాడికి చెందిన పళనిస్వామి ప్రస్తుతం సీఎం కావడం అక్కడి ప్రజలకు ఆనందమే. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం పశ్చిమం మీద పళనిస్వామి దృష్టి పెట్టినట్టున్నారు. ప్రప్రథమంగా మంగళవారం సొంత జిల్లా వేదికగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం సొంత జిల్లాకు వచ్చిన పళనిస్వామికి నామక్కల్, సేలంలో బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానాలు సాగాయి. పార్టీ కేడర్, మద్దతుదారులు, ప్రజలు, అధికార వర్గాలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రూ. 331 కోట్లతో: సేలం కలెక్టరేట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రూ.331 కోట్లతో చేపట్టనున్న పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో సేలం జిల్లాలో రూ.115 కోట్లు, నామక్కల్ జిల్లాలో రూ.61 కోట్లు, ధర్మపురి జిల్లాలో 60 కోట్లు, కృష్ణగిరి జిల్లాలో రూ. 93 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఉన్నాయి. అలాగే, లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. నిర్మాణాలను పూర్తి చేసుకున్న పలు భవనాలను ప్రారంభించారు. పశ్చిమ జిల్లాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించడం లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. గతంలో అమ్మ జయలలిత అసెంబ్లీలో 110 నిబంధనల మేరకు చేసిన ప్రకటనల హామీలనంటినీ నెరవేరుస్తాననన్నారు. -
బిడ్డల్ని కడతేర్చి తల్లి ఆత్మహత్య
సేలం : కన్న తల్లి కర్కశత్వం, కన్న తండ్రి వివాహేతర సంబంధం ముక్కుపచ్చలారని పిల్లల ప్రాణాలను తీసింది. ఓ నిండు కుటుంబాన్ని నిలువునా కూల్చేసిం ది. ఈ హృదయవిదారక సంఘటన ఈరోడ్ జిల్లాలో చోటుచేసుకుంది.ఈరోడ్ జిల్లా చెన్నిమలై ప్రాంతానికి చెందిన వరదరాజన్ (41) బనియన్ కంపెనీలో ఉద్యో గి. ఇతని భార్య సుందరి (30) సైతం అదే బనియన్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ దంపతులకు జనని (11) అనే కుమార్తె, రాజేష్‌కన్నన్ (6) అనే కుమారుడు ఉన్నారు. మనస్పర్థలతో భార్యాభర్తలు రెండేళ్ల క్రితం విడిపోయారు. సుందరి ఇద్దరి పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటల వరకు సుందరి ఇంటి తలుపులు తెరచుకోలేదు. సమీపంలో నివాసం ఉంటున్న సుందరి తల్లి మోహన కుమార్తె ఇంటికి వెళ్లింది. తలుపులు తీయకపోవడంతో సందేహం కలిగి ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా చిన్నారులు జనని, రాజేష్‌కన్నన్ గొంతుకోసి రక్తపు మడుగులో శవాలుగా పడివున్నారు. సుందరి చీరతో ఉరి వేసుకుని శవంగా వేలాడుతోంది. ఫిర్యాదు అందుకున్న చెన్నిమలై పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెరుందురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై చెన్నిమలై పోలీసు ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటాచలం మాట్లాడుతూ బుధవారం రాత్రి సుందరి పక్క వీధిలో నివాసం ఉంటున్న తన తల్లి మోహన ఇంటికి రేషన్‌కార్డు కోసంవెళ్లింది. ఆ సమయంలో తల్లి మోహన, తన భర్త వరదరాజన్ సన్నిహితంగా ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది. వారి మధ్య వివాహేతర సంబంధం ఉండడం చూసి విరక్తి చెందిన సుందరి ఇద్దరి పిల్లల గొంతు కోసి హతమార్చి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. -
తల్లి, తమ్ముడిని కడతేర్చిన అన్న
సేలం: తల్లి, తమ్ముడ్ని ఓ అన్న అతి కిరాతకంగా గొంతు కోసి కడతేర్చాడు. అయితే అతడు మానసిక రోగిగా అనుమానాలు బయలు దేరడంతో ఆసుపత్రికి తరలించారు. వాలప్పాడిలో బుధవారం ఈ ఘాతుకం చోటు చేసుకుంది. సేలం జిల్లా వాలప్పాడి సమీపంలో నడు పట్టి గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, రాజమ్మాల్ దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో సెంథిల్(35) పెద్ద వాడు. రాజశేఖరన్(32) చిన్నవాడు. కుమార్తె విజయ. వీరి లో రాజశేఖరన్, విజయలకు వివాహాలు అయ్యాయి. వీరు చెన్నైలో నివాసం ఉంటున్నారు. అయితే, పెద్దవాడు రాజశేఖరన్‌కు వివాహం కాలేదు. తండ్రి సుబ్రమణ్యం ఇటీవల మరణించడంతో ఆయన పనిచేస్తున్న ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాన్ని రాజమ్మాల్‌కు తపాలా శాఖ కల్పించింది. దీంతో పెద్దవాడి పెళ్లిని పక్కన పెట్టిన రాజమ్మాల్ విధుల మీదే ఎక్కువ దృష్టిపెట్టింది. తనకు పెళ్లి చేయాలంటూ పదే పదే సెంథిల్ తల్లి మీద ఒత్తిడి తెచ్చేవాడు. అతడికి ఎలాంటి సంపాదన లేని దృష్ట్యా, తన సంపాదన మీద ఆధార పడాల్సి ఉండడంతో అతడికి వివాహం చేయకుండా రాజమ్మాల్ కాలం నెట్టుకు వచ్చి ఉన్నది. ఈ పరిస్థితుల్లో చెన్నై నుంచి రెండు రోజుల క్రితం రాజశేఖరన్ గ్రామానికి వచ్చాడు. తన పెళ్లి మీద తమ్ముడు కూడా పట్టించుకోక పోవడంతో సెంథిల్ ఉన్మాదిగా మారాడు. బుధవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న తన తమ్ముడ్ని కత్తితో గొంతు కోసం హతమార్చాడు. దీన్ని అడ్డుకునే యత్నం చేసిన రాజమ్మాల్ గొంతును సైతం కోసి పడేశాడు. పెద్ద ఎత్తున కేకలు పెడుతూ తాను కూడా గొంతు కోసుకునే యత్నం చేశాడు. ఉరి పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇంట్లో నుంచి వస్తున్న శబ్దంతో పరుగులు తీసిన ఇరుగు పొరుగు వారు అక్కడ దృశ్యాల్ని చూసి ఆందోళనలో పడ్డాడు. ఆత్మహత్యాయత్నం చేస్తున్న సెంథిల్‌ను పట్టుకుని చెట్టుకు కట్టి పడేశారు. సమాచారం అందుకున్న సేలం ఎస్పీ సుబ్బులక్ష్మినేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని విచారణ చేపట్టింది. రాజమ్మాల్, రాజశేఖరన్‌లు సంఘటనా స్థలంలోనే విగత జీవిగా మారడంతో మృత దేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు. సెంథిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. గొంతు కోసుకోవడంతో స్వల్పంగా గాయపడ్డ అతడ్ని చికిత్స నిమిత్తం సేలం జిహెచ్‌కు తరలించారు. కాగా, సెంథిల్ మానసిక రోగిగా ఆ పరిసర వాసులు పేర్కొంటున్నారు. అతడు రెండేళ్లు చెన్నై కీల్పాకం ఆసుపత్రిలో చికిత్సను సైతం పొంది ఉన్నట్టు పేర్కొనడంతో అరెస్టు విషయంగా పోలీసులు సంయమనం పాటిస్తున్నారు. వైద్యులు జరిపే పరీక్షల అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా అతడు మానసిక రోగినా, లేదా అన్నది తేలనున్నది. వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఎస్పీ సుబ్బులక్ష్మి పేర్కొన్నారు. -
ఏటీఎంలో రూ. 12 లక్షలు మాయం
సేలం : ఏటీఎంలో నగదు మాయం సంఘటన ఓ ప్రైవేటు బ్యాంక్ వర్గాల్లో కలకలం రేపింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు 24 గంటల్లో నిందితుడ్ని అరెస్టు చేశాయి. నామక్కల్ జిల్లా తిరుచంగోడు-సేలం రోడ్డులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎం ఉంది. ఇక్కడ సోమవారం మధ్యాహ్నం నగదు నింపడానికి సిబ్బంది వచ్చారు. ఏటీఎంలో ఉన్న నగదు వివరాల్ని సేకరించగా అందులో రూ. 12 లక్షల డబ్బు తగ్గి ఉండడం సిబ్బంది గమనించారు. దీంతో అనుమానం చెందిన వారు తిరుచంగోడు డీఎస్పీ విష్ణు ప్రియకు ఫిర్యాదు చేశారు. తిరుచంగోడు ఇన్స్పెక్టర్ కుల శేఖరన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తనిఖీలను ముమ్మరం చేసింది. నిందితుణ్ని వెంటాడి పట్టుకున్న పోలీసులు సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి బ్యాంక్ పరిసరాల్లో బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. పోలీసుల్ని చూసి ఆ వ్యక్తి ఉడాయించాడు. అతడ్ని సినీ ఫక్కీలో వెంటాడి పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా శాలపురం గ్రామానికి చెందిన ప్రభాకరన్ అని తేలింది. గతంలో ఇతను సదరు బ్యాంక్ ఏటీఎంలకు నగదు ఫిల్లింగ్ చేసినట్లు, ఆ సమయంలో రూ. యాభై వేలు డబ్బును దొంగలించడంతో సస్పెండ్ అయినట్లు తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించడంతో అస్సలు బండారం బయట పడింది. అత్యాశతో దొరికిపోయాడు సోమవారం వేకువ జామున నాలుగున్నర గంటల సమయంలో ఏటీఎం వాచ్‌మన్ టీ తాగేందుకు వె ళ్లడాన్ని అదునుగా తీసుకుని ప్రభాకరన్ ఏటీఎంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరాను పనిచేయకుండా చేసి, తన వద్దనున్న సీక్రెట్ పాస్వర్డ ఆధారంగా ఏటీఎం లాకర్ తెరిచి అందులో ఉన్న రూ. 12,23,0100 డబ్బు తీసుకుని ఉడాయించాడు. అత్యాశతో ఏటీఎంలో మిగిలిన డబ్బును దొంగలించడానికి మళ్లీ రాత్రి వచ్చాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేసి కట కటాల్లోకి తరలించారు. అతడి వద్ద నుంచి దొంగలించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో కేసు చేధించిన పోలీసుల్ని జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ అభినందించారు. -
ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
సేలం: సేలం కలెక్టరేట్లో ఇద్దరు మహిళలు వేర్వేరు సమయాల్లో ఆత్మాహుతి యత్నాలు చేశారు. తమ శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునే యత్నం చేశారు. ఆ మహిళల్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఓమలూరుకు చెందిన ఇలంగో కూలీ కార్మికుడు. ఆయన భార్య శాంతి(48) సోమవారం ఉదయం సేలం కలెక్టరేట్‌కు వచ్చింది. తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను మీద పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేసింది. దీన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారనలో 2012లో అనారోగ్యంతో ఓమలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. అయితే, వాళ్లు తన గర్భ సంచి తొలగించినట్టు వివరించారు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, చివరకు కోర్టును ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ఆ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవడంలో ఓమలూరు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని, స్వయంగా సేలం కమిషనర్ అమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే సేలం కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానని, అందుకు అనుమతి లభించని దృష్ట్యా, ఆత్మహుతి యత్నం చేసినట్టు పేర్కొన్నారు. ఈమెను అదుపులోకి తీసుకుని అలా పోలీసు స్టేషన్‌కు తరలించారో లేదో, మరో మహిళ హఠాత్తుగా లోనికి ప్రవేశించి ఆత్మాహుతి యత్నం చేయడం కలకలం రేపింది. ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. నామక్కల్‌జిల్లా రాశిపురానికి చెందిన గుణశేఖరన్ భార్య రాణిగా ఆమెను గుర్తించారు. ఆమె భర్త సేలం జైలులో హెడ్ వార్డెన్‌గా పనిచేసి పదవీ విరమణ పొందినట్టు తేలింది. ఆయనకు వచ్చిన పెన్షన్ రూ.7 లక్షలను జైలర్ జయరామన్, ఆయన భార్య అరుణ, స్నేహితుడు భూపతిలో మింగేసినట్టు తేలింది. తమకు ఇళ్లు ఇస్తామని నమ్మబలికి ఆ ఏడు లక్షల్ని తీసుకుని మోసం చేశారని, ఈ విషయంగా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వాళ్లు లేక చివరకు ఆత్మాహుతి చేసుకుందామని ఇక్కడికి వచ్చినట్టు పేర్కొన్నారు. -
ప్రేమి‘కుల’ చిచ్చు
భగ్గుమన్న సోమం పట్టి ఇళ్లపై దాడులు గుడిసెలకు నిప్పు వాహనాల ధ్వంసం దళిత సంఘాల్లో ఆగ్రహం ఉద్రిక్తత, బలగాల మొహరింపు సేలం: ప్రేమి‘కుల’ చిచ్చు మళ్లీ భగ్గుమంది. దళిత సామాజిక వర్గంపై వన్నియర్ సామాజిక వర్గం తమ ప్రతాపం చూపించింది. సోమం పట్టిలో ఇళ్లపై దాడులు చేశారు. గుడిసెలకు నిప్పు పెట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. ప్రాణ భయంతో అర్ధరాత్రి వేళ ఆ గ్రామంలోని దళిత సామాజిక వర్గం పక్కనే ఉన్న మరో గ్రామంలో తలదాచుకుంది. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తత నెలకొనడంతో బలగాలను మోహరింప చేశారు. సేలం, ధర్మపురి, నామక్కల్ జిల్లాల్లో ఇటీవల కాలంగా ప్రేమ వ్యవహారం చిచ్చు రేపుతుంది. గత ఏడాది ధర్మపురిలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఇలవరసన్, వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన దివ్యను ప్రేమించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. చివరకు ప్రేమ కుల చిచ్చుకు రైలు పట్టాలపై ఇళవరసన్ శవం అయ్యారు. ఈ ఘటన మరువక ముందే, వారం రోజులుగా ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ రైలు పట్టాలపై శవం కావడం సేలంలో ఉద్రిక్తతను కొనసాగుతోంది. వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడన్న నెపంతో గోకుల్‌రాజ్‌ను హతమార్చినట్టుగా, హత్య కేసు నమోదుకు డిమాండ్ చేస్తూ సేలం నిరసన జ్వాల రగులుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో మరో ప్రేమ వ్యవహారం సోమం వాలప్పాడి సమీపంలోని సోమం పట్టిని రణరంగంగా మారింది. ప్రేమి‘కుల’ చిచ్చు : సేలం జిల్లా వాలప్పాడి సమీపంలోని సోమం పట్టి గ్రామం ఉంది. ఇక్కడ వందకు పైగా దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన శరవణన్ చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. చదువుకునే రోజుల నుంచే విలాడి పాళయంకు చెందిన వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన వన్నియ ప్రియను ప్రేమించాడు. ప్రస్తుతం వన్నియ ప్రియ ఓ పాఠశాలలో టీ చర్. తమకు ఉద్యోగం రావడంతో ప్రేమికులు పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించారు. ఈ ఇద్దరు ఆదివారం ఉడాయించారు. సోమవారం ఉదయాన్నే సేలం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సమాచారం వన్నియ ప్రియ కుటుంబీకుల్లో , బంధు వర్గంలో ఆగ్రహాన్ని రేపింది. అర్ధరాత్రి దాడులు: సోమవారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో యాభై మందికి పైగా వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు దుడ్డు కర్రలను చేత బట్టి సోమం పట్టిలోకి ప్రవేశించారు. అక్కడున్న గుడిసెలకు నిప్పులు పెడుతూ, ఆ పరిసరాల్లోని వాహనాలపై తమ ప్రతాపం చూపిస్తూ ముందుకు సాగారు. అర్ధరాత్రి వేళ ఈ దాడులతో అక్కడున్న దళిత సామాజిక వర్గంలో ఆందోళన బయలు దేరింది. తమను ఎక్కడ కొట్టి చంపేస్తారోనన్న భయంతో పిల్లలతో కలసి చీకట్లో కూత వేటు దూరంలో ఉన్న మరో గ్రామంలోకి పరుగులు తీశారు. తమను రక్షించాలని శరణు కోరారు. దీంతో ఆ గ్రామస్తులు దళితులకు అండగా ముందుకు సాగారు. అప్పటికే ఆ వ్యక్తులు మూడు గుడిసెలకు నిప్పు పెట్టడం, రెండు ఆటోలు, మోటారు సైకిల్, సైకిళ్లను ధ్వంసం చేసి ఉడాయించారు. వెళ్తూ వెళ్తూ పల్లత్తనూరు వద్ద గుడిసెలు వేసుకుని ఉన్న దళితుల మీద తమ ప్రతాపం చూపించి వెళ్లారు. అక్కడున్నకొన్ని గుడిసెల్ని దగ్ధం చేశారు. రంగంలోకి బలగాలు: అర్ధరాత్రి దాడులతో బెంబేళెత్తిన పోలీసులు సోమం పట్టికి పరుగులు తీశారు. అప్పటికే పక్క గ్రామస్తులు మంటల్ని ఆర్పి ఉండడంతో ఆస్తి నష్టం తగ్గిందని చెప్పవచ్చు. స్వల్పంగా గాయ పడ్డ పలువుర్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారంతో దళిత సంఘాల్లో ఆగ్రహం రేగింది. దాడులకు నిరసనగా దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తుండడంతో ఉద్రిక్తత చోటు చేసుకుని ఉంది. రెండు సామాజిక వర్గాల మధ్య వాతావరణం వేడెక్కే అవకాశం ఉండడంతో ఆ పరిసరాల్లో బలగాల్ని రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ సుబ్బులక్ష్మి పర్యవేక్షణలో బలగాలు ఆ గ్రామం, పరిసరాల్లో తిష్ట వేసి ఉన్నారు. ఇటీవల కాలంగా ఇక్కడ కులాంతర ప్రేమ వ్యవహారాలు గ్రామాల్లో చిచ్చు రేపుతుండడం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే పలు కుల ప్రేమ వ్యవహారాల కేసులు కొలిక్కి రాని సమయంలో, గోకుల్ రాజ్ మృతి వెలుగులోకి రావడం, తాజాగో, మరో జంట ఉడాయించడం వెరసి పోలీసులకు పని భారాన్ని పెంచుతోంది. తాజా వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్న దృష్ట్యా, ఈ ప్రేమి‘కుల’ చిచ్చు ఎపిసోడ్ మరెన్ని రోజులు సాగుతుందో వేచి చూడాల్సిందే. అదే సమయంలో, గోకుల్ రాజ్ మృతి వ్యవహారంలో తానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా చేసిన వ్యాఖ్యలు వాట్సాప్‌లో కలకలం రేపుతున్నాయి. అయితే, గోకుల్ రాజ్‌ను బెదిరించి ఆ వ్యాఖ్యలు చెప్పించినట్టుగా ఉందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రేమ వ్యవహారాలు అటు దళితులు, ఇటు వన్నియర్ల మధ్య మరో యుద్ధానికి దారి తీసి ఉండడంతో ఆ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
విద్యార్థిని ఆత్మహత్య
సేలం: సేలంలోని ఓ హాస్టల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉరి పోసుకుని వేలాడుతున్న స్థితి అనుమానాలకు తావిస్తోంది. సేలం శంకగిరికి చెందిన పన్నీరు సెల్వం, ఉమా దంపతుల కుమార్తె ప్రియదర్శిని చిన్నప్పం పట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో తొ మ్మిదో తరగతి చదువుతోంది. శుక్రవారం ఆమెను ఆ పాఠశాల్లో చేర్పిం చారు. ఆ పాఠశాలకు చెందిన హాస్టల్లో ఆమెకు బస సౌకర్యం కల్పించా రు. ఈ పరిస్థితుల్లో శనివారం ఉద యం ప్రియదర్శిని శవంగా మారింది. దుపట్టాతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆ హాస్టల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, కిటికీలకు ఉ న్న ఇనుప రాడ్డు సాయంతో దుపట్టా ను ఉపయోగించి గొంతు బిగిసి ఉం డడం, రెండు కాళ్ల మోకాళ్లు నేలను తాకుతుండడంతో అనుమానాలు బ యల్దేరాయి. అయితే, స్కూలుకు ఆల స్యంగా వెళ్లినందుకు టీచరు మందలించినట్టు అందుకే ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టుగా హాస్టల్ వర్గా లు పేర్కొంటున్నాయి. అయితే, ఆ బాలిక మృతి మిస్టరీని ఛేదించాలని డిమాండ్ చేస్తూ ఆ పరిసరవాసులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన కారుల్ని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమిం చాల్సి వచ్చింది. చివరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
సేలం: భర్తను ప్రియుడితో కలసి హతమార్చి, అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పాతి పెట్టిన ఓ భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేలం అమ్మా పాళయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సేలం అమ్మాపాళయంకు చెందిన బాలకృష్ణన్(45) స్థానికంగా సెలూన్ షాపు నడుపుతున్నాడు. ఇతని భార్య సుందరి(35). వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అదే ప్రాంతంలోని రాజేంద్రన్ ఇంట్లో కుటుంబంతో కలసి బాలకృష్ణన్ అద్దెకు ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది సెప్టెంబర్‌లో బాలకృష్ణన్ అదృశ్యం అయ్యాడు. బాలకృష్ణన్ అదృశ్య మిస్టరీని ఛేదించేందుకు సూర మంగళం పోలీసులు రంగంలోకి దిగారు. సేలం పోలీసు కమిషనర్ అమల్ రాజ్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ మురుగేషన్ విచారణ వేగవంతం చేశారు. భర్తను కడతేర్చి: పోలీసు రహస్య విచారణలో బాలకృష్ణన్ ఇంట్లోకి తరచూ ఇంటి ఓనర్ రాజేంద్రన్ తనయుడు లోకనాథన్(27) వెళ్లి వస్తుండడం వెలుగులోకి వచ్చింది. లోకనాథన్, బాలకృష్ణన్ భార్య సుందరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. దీంతో మంగళవారం ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టు అయింది. లోకనాథన్, సుందరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం తెలిసి బాలకృష్ణన్ ఇద్దరిని మందలించాడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుండడంతో ఆగ్రహించిన ఆ ఇద్దరు బాలకృష్ణన్‌ను హతమార్చేందుకు పథకం వేశారు. గత ఏడాది సెప్టెంబర్ 26వ తేదీ ఇంట్లో మద్యం మత్తులో బాలకృష్ణన్ ఉండడాన్ని గుర్తించి పథకం అమలుకు నిర్ణయించారు. తన స్నేహితులు కుమార్ (24), రేవన్(25)తో కలసి ఆ ఇంట్లోకి లోకనాథన్ చొరబడ్డారు. ఈ ముగ్గురు, సుందరి కలిసి కత్తులతో బాలకృష్ణన్‌ను పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేయడం కష్టతరం కావడంతో, దానిని ముక్కలు మక్కలుగా కోశారు. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఎవరి దారిన వారు అన్నట్టుగా ఉండి పోయారు. మరుసటి రోజు ఆ ముక్కల్ని తీసుకెళ్లి ఓ శ్మశానంలో నాలుగైదు చోట్ల పూడ్చి పెట్టారు. వీరి వివాహేతర గుట్టు, హత్య బండారం బయట పడడంతో ఆ పరిసర వాసులు షాక్‌కు గురి అయ్యారు. ఆ నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహం ముక్కలు పాతి పెట్టిన ప్రాంతాల్లో తవ్వకాల్లో పడ్డారు. కేసు నమోదు చేసిన ఆ నలుగుర్ని కటకటాల్లోకి నెట్టారు. తన సుఖం కోసం వివాహేతర సంబంధం భర్తను కడతేర్చి సుందరి జైలుకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు అనాథగా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
విద్యార్థిని ఆత్మహత్య
సేలం:ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టికి చెందిన మురుగన్. ఆయన కుమార్తె సౌందర్య (18) నామక్కల్‌లో ఉన్న కింగ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెతో పాటు హాస్టల్ గదిలో ఐదుగురు బస చేస్తున్నారు. సౌందర్య బుధవారం ఉదయం హాస్టల్ గది నుంచి కళాశాలకు స్నేహితులతో బయలుదేరింది. మార్గమధ్యంలో తను గదికి వెళ్లిపోతానని తెలిపి వెను తిరిగి హాస్టల్ గదికి వెళ్లింది. కొంతసేపటికి మరొక విద్యార్థిని గదిలో మరిచిపోయిన నోట్ బుక్‌ను తీసుకునేందుకు వెళ్లగా అక్కడ గదిలో సౌందర్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెంది ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది. సమాచారం అందుకున్న నామక్కల్ ఎస్పీ సెంథిల్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి గదిలో సోదా చేశారు. ఆ సమయంలో టేబుల్‌పై సౌందర్య రాసిన ఒక లేఖ లభించింది. అందులో తల్లిదండ్రులు బలవంతంగా చదివిస్తున్నారని, అందువల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి ఉంది. అనంతరం ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం నామక్కల్ జీహెచ్‌కు తరలించారు. నామక్కల్ పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. -
మరణం కూడా విడదీయలేకపోయింది
సేలం: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా తనువు చాలించిన విదారక ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. 44 ఏళ్లు అన్యోన్యంగా కలిసి జీవించిన ఆ దంపతులను మరణం కూడా వేరు చేయలేకపోయింది. మనోహరన్(70) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మరణించారు. ఆయనకు కొడుకు స్టీఫెన్, కూమార్తె ఉన్నారు. క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో మనోహరన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగానే ఆయన భార్య క్రిస్ట్రీ(67) కూడా ప్రాణాలు కోల్పోయింది. భర్త శవపేటికపై కుప్పకూలి ఆమె తుదిశ్వాస విడిచింది. మనోహరన్, క్రిస్టీ మృతదేహాలను పక్కపక్కనే ఖననం చేశారు.