సాక్షి, చెన్నై: సేలం, నామక్కల్‌లలో రీ పోలింగ్ శనివారం ప్రశాం తంగా జరిగింది. ఓ చోట ఏజెంట్ల పుణ్యమా అని ఓటింగ్ ఆలస్యం గా ఆరంభం అయింది. మరో చోట విద్యుత్ సరఫరా ఆగడంతో అగచాట్లు పడాల్సి వచ్చింది. రాష్ట్రంతో పాటుగా పుదుచ్చేరిలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలకు గత నెల 24న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు సజావుగా ప్రశాంత పూరిత వాతావరణంలో ముగిశాయి. ఎన్నికలు జరిగిన పది రోజుల తరువాత రెండు చోట్ల రీ పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. సేలం, నామక్కల్ పరిధిలోని రెండు పోలింగ్ బూత్‌లలో ఈ పోలింగ్ జరగనున్నట్టు ఈసీ ప్రకటించింది. అయితే, దీన్ని అక్కడి అభ్యర్థులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు జరిగిన పది రోజుల అనంతరం రీ పోలింగ్‌కు చర్యలేమిటంటూ ప్రశ్నించారు. అయితే, ఈసీ మాత్రం తగ్గలేదు.
ఆ బూత్‌లలో ఈవీఎం లు మొరాయించినట్టు, సాంకేతిక లోపం కారణంగానే రీ పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్టు సూచించింది. రీ పోలింగ్ : రీ పోలింగ్‌కు ఈసీ అన్ని చర్యలు తీసుకుంది. సేలం లోక్ సభ పరిధిలోని సెంగలనై రోడ్డులోని మునిసిపల్ స్కూల్ ఆవరణలోని 213 బూత్‌లో, నామక్కల్ లోక్ సభ పరిధిలోని కొట్ట పాలయం పంచాయతీలోని 37వ బూత్‌లో శనివారం ఎన్నికలు జరిగాయి. రీ పోలింగ్‌తో ఆ బూత్‌ల పరిధిలోని ఓటర్లను రప్పించేందుకు రాజకీయ పక్షాలు తీవ్రంగానే కుస్తీలు పట్టాల్సి వచ్చింది. సేలంలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ఆరంభం కావాల్సి ఉండ గా, గంట ఆలస్యం అయింది. ఇందుకు కారణం ఆయా రాజకీయ పక్షాల ఏజెంట్లు రావడంలో నెలకొన్న ఆలస్యం. ఎట్టకేలకు తొలి ఓటును పాప్పాతి అనే మహిళ నమోదు చేశారు.
గట్టి భద్రత నడుమ ఈ కేంద్రంలో పోలింగ్ జరిగిం ది. ఉదయాన్నే మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు పన్నెండు గంటల కు ఆ పోలింగ్ బూత్‌లో అత్యధికంగానే ఓట్లు నమోదు అయ్యాయి. ఇక, నామక్కల్ లోక్ సభ పరిధిలోని బూత్‌లో ఉదయాన్నే విద్యుత్ కోత పోలింగ్‌కు ఆటంకం సృష్టించిం ది. ఎట్టకేలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో కాస్త ఆల స్యంగానే ఓటింగ్ ఆరంభం అయింది. నామక్కల్ డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు గాంధీ సెల్వన్, సుందరంలో ఓటింగ్ సరళిని స్వయంగా పర్యవేక్షించారు. రీ పోలింగ్‌లో ఓట్లు వేసిన వారికి మధ్య వేలికి సిరా చుక్కను పెట్టారు. సేలం బూత్‌లో 76 శాతం, నామక్కల్ బూత్‌లో 89 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. ఓటింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఈవీఎంలకు సీల్ వేసి తిరుచంగోడు వివేకానంద కళాశాలకు తరలించారు.
రీ పోలింగ్ ప్రశాంతం
Published Sat, May 10 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement
Advertisement