సేలం: వివాహేతర సంబంధం వ్యవహారంతో సేలంలో హెడ్ కానిస్టేబుల్ సోమవారం సస్పెండ్‌కు గురయ్యాడు. సేలం ప్రభుత్వ వైద్యశాల ఔట్ పోస్ట్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా గోవిందరాజన్ (38) పనిచేస్తున్నాడు. ఇతని భార్య సంగీత (22). వీరి పిల్లలు దర్శిణి (4), రోహిత్ (8). గోవిందరాజన్ కుటుంబంతో ఇక్కడ ఉన్న పోలీసు క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. కాగా గోవిందరాజన్, సంగీతల మధ్య కుటుంబ గొడవ ఉన్నాయి.
ఈ స్థితిలో గత ఏడాది అక్టోబర్ 18వ తేదీ ఇద్దరు పిల్లలు మృతదేహాలుగా పడి ఉండగా, పక్కన సంగీత ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో గోవిందరాజ్‌కు, మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు, ఆ విష యం భార్య సంగీతకు తెలియడంతో గొవడలు జరుగుతూ వచ్చినట్టు తెలిసింది. ఆ కారణంగా జీవితంపై విరక్తి చెందిన సంగీత పిల్లలకు విషం కలిపిన నీటిని తాగించి, తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఈ ఘటనపై సోమవారం సేలం నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అభినబు గోవిందరాజ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment