Namakkal
-
వేకువజామున భారీ విస్పోటనం.. నలుగురి మృతి.. ఛిద్రమైన..
సాక్షి, చెన్నై(సేలం): నామక్కల్ జిల్లా మోగనూరు శనివారం వేకువజామున బాణసంచా మోతతో దద్దరిల్లింది. ఓ వ్యాపారి ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులకు గ్యాస్ సిలిండర్ల పేలుడు తోడు కావడంతో భారీ విస్పోటనం జరిగింది. ఐదు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. నలుగురి శరీరాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. కొన్ని గంటల పాటుగా శ్రమించి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. వివరాలు.. నామక్కల్ జిల్లా మోగనూరుకు చెందిన తిల్లైకుమార్ (35) బాణసంచా వ్యాపారి. ఆయనకు ఓడ పాళయంలో గోడౌన్ కూడా ఉంది. మోగనూరు మేట్టు వీధిలోని నివాసంలో భార్య ప్రియాంక(30), కుమార్తె సజనీ(4), తల్లి సెల్వి(55)తో తిల్లైకుమార్ నివాసం ఉన్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా బాణసంచా వ్యాపారం అధికంగా జరిగే అవకాశం ఉండడంతో శివకాశి నుంచి స్టాక్‌ను శుక్రవారం రాత్రి ఓ మినీ వ్యాన్‌లో మోగనూరుకు తెప్పించాడు. గోడౌన్‌కు తరలించకుండా ఇంటి వద్దే ఓ గదిలో స్టాక్‌ను ఉంచి నిద్రకు ఉపక్రమించాడు. ఉలిక్కి పడ్డ మోగనూరు.. శనివారం వేకువ జామున రెండున్నర గంటల సమయంలో మోగనూరు ఉలిక్కి పడింది. భారీ విస్పోటనం తరహాలో శబ్దాలు రావడంతో జనం నిద్ర నుంచి లేచి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తిల్లైకుమార్ ఇంటి నుంచి మంటలు చెలరేగుతుండడంతో అటువైపుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించ లేదు. ఈ ఇంటికి పక్క పక్కనే ఉన్న ఇళ్లలోని వారంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. క్షణాల్లో బాణసంచా మోతకు తోడు గ్యాస్ సిలిండర్లు పేలిన శబ్దాలతో స్థానికుల్లో కలవరం బయలు దేరింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. 3 గంటల పాటు బాణసంచా మోతతో సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. ఎట్టకేలకు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. నాలుగు సిలిండర్లు కూడా.. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అనుమతి లేకుండా ఇంటిలో బాణసంచా ఉంచడంతో పాటు విద్యుత్ స్విచ్ బోర్డుల వద్ద టపాకాయల బాక్సులను ఉంచడంతో విద్యుదాఘాతం ఏర్పడి ఉండవచ్చుననే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అలాగే ఆ ఇంట్లో ఉన్న రెండు, పక్కింట్లో ఉన్న మరో రెండు సిలిండర్లు పేలడంతో భారీ విస్పోటనం జరిగినట్లు తేల్చారు. సమాచారం అందుకున్న మంత్రి మందివేందన్, ఎంపీ రాజేష్‌కుమార్, ఎమ్మెల్యే రామలింగం ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రు.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేసియా అందజేశారు. ఛిద్రమైన మృతదేహాలు.. ఈ పేలుడు ధాటికి తిల్లైకుమార్ ఇంటితో పాటు పక్క పక్కనే ఉన్న మరో నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇళ్ల ఆనవాళ్లే లేని విధంగా పరిస్థితి మారింది. ఆ ఇంటికి 50 అడుగుల దూరంలో మరో ఇంటి పై కప్పు పై ఛిద్రమైన తిల్లైకుమార్ మృతదేహం బయట పడింది. మంటలకు అతడి భార్య ప్రియాంక, తల్లి సెల్వి సజీవ దహనమయ్యారు. అయితే వీరి ఇంటికి పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉన్న యువకుడు సాహసం చేసి రక్షించడంతో సజినీ గాయాలతో బయట పడింది. మరో ఇంట్లో ఉన్న పెరియక్క(73) ప్రమాద సమయంలో బీరువాలో ఉన్న నగదు కోసం లోనికి వెళ్లి పేలుడు కారణంగా మరణించింది. దీంతో మృతుల సంఖ్య నాలుగుగా నమోదైంది. పక్క పక్క ఇళ్లల్లో ఉన్న కార్తికేయన్(28) అన్బరసి (25), సెంథిల్(45), పళనియమ్మాల్ (60) తీవ్రంగా గాయపడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నారు. అలాగే, సుమిత్ర(38), రమేష్ (44), ముత్తులక్ష్మి (60), ప్రియాంక(22) జయమణి (50), సౌందరరాజన్ (50), ధనం (44), షణ్ముగ పెరుమాల్ (40), సజినీతో పాటు ఓ యువకుడు స్వల్పంగా గాయపడ్డారు. -
వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ..
స్మార్ట్ ఫోన్లు వచ్చేశాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది. ఇలాంటి ఈ కంప్యూటర్ యుగంలో ఇంకా చాలామంది మూడనమ్మకాలను విశ్వసిస్తున్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఈ మూఢనమ్మకాల పేరిట చేస్తున్న హింసాత్మక ఆచారాలను కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికి పాటిస్తున్నారు. అన్నింటికంటే ఆశ్చర్యం ఏమిటంటే చదువుకున్న కొంతమంది కూడా వాటిని నమ్ముతుండటం కాస్త విస్మయానికి గురి చేస్తుంది. అచ్చం అలానే ఇక్కడొకప్రాంతంలో ఆచారం పేరిట మహిళలను కొరడాతో హింసిస్తుంటారు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని ఒక పూజారి ‘కాటేరి’(చెడును దూరంగా ఉంచమని ప్రార్థించే దేవత)లా నల్లని దుస్తులను ధరించి మహిళలపై కొరడాతో కొడుతుంటాడు. ఆ పూజారి దృష్టిలో వాళ్లంతా చేతబడికి గురయ్యారని అర్థం. ఇతను అలా కొరడాతో కొడుతుంటే చుట్టు ఉన్న చుట్టు ఉన్న ప్రజలు ఈలలు వేస్తూ, అరుస్తే ఉత్సాహపరుస్తుంటారు. సదరు మహిళ ఆ పూజారికి చేతులెత్తి నమస్కరిస్తుంటే పూజారి దుష్టగాలి సోకకుండా ఉండేదు కోసం వారిని కొరడాతో కొడుతుంటాడు. తాజా ఘటన నమక్కల్ జిల్లా వర్దరాజపెరుమాళ్ చెల్లియమ్మన్ మారియమ్మన్ ఆలయంలో చోటుచేసుకోవడంతో..అది వైరల్ అయ్యింది. ఐతే పూజారి ఇలా చేస్తే తమకెంతో మేలు జరుగుతుందని ప్రజలు చెబుతుండటం విశేషం. వాస్తవానికి రెండు వర్గాల మధ్య గొడవ కారణంగా గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరగలేదు. మళ్లీ ఇప్పుడే ఈ ఆలయంలో తొలిసారిగా ఈ వింత ఆచారానికి సంబంధించిన ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలను నెల రోజులు పాటు నిర్వహిస్తారు. (చదవండి: పెళ్లైన కాసేపటికే వరుడికి షాకిచ్చి వధువు.. ఇజ్జత్ మొత్తం పోయింది) -
యువతి అదృశ్యం కలకలం: హీరో సూర్య ఆందోళన
చెన్నె: నీట్ భయం ఇంకా తమిళనాడు విద్యార్థులను వెంటాడుతోంది. ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు నీట్ ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. నీట్‌ను మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినా కూడా విద్యార్థులు ఊరట చెందడం లేదు. తాజాగా ఓ విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నీట్ పరీక్ష రాసి వచ్చిన అనంతరం కీ పేపర్ చూసుకున్న విద్యార్థిని కనిపించకుండాపోయింది. దీంతో కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు విద్యార్థిని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తమిళనాడులోని నమక్కర్ జిల్లాకు రాసిపురం పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన శ్వేత (19) జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్-నీట్)ను ఈనెల 12వ తేదీన రాసింది. ఈనెల 17వ తేదీన రాసిన పరీక్షకు సంబంధించిన కీ పేపర్ చూసుకుంది. ఉత్తీర్ణత సాధించలేనని గ్రహించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు అదృశ్యం కేసు ఫిర్యాదు చేయడంతో రాసిపురం పోలీసులు గాలిస్తున్నారు. అయితే విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే నీట్ మినహాయింపు ఇస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. అయినా కూడా విద్యార్థుల బలవన్మరణాలు ఆగకపోవడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో సందేశం విడుదల చేశారు. ‘పరీక్షపై ఆందోళనతో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దు. బంగారు భవిష్యత్ ఎంతో ఉంది’ అని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే సినీ నటుడు సూర్య కూడా విద్యార్థులకు ఓ పిలుపునిచ్చారు. -
మాజీ ఎంపీ మనవడి హత్య
తిరువొత్తియూరు: నామక్కల్ సమీపంలో డీఎంకే మాజీ ఎంపీ మనవడిని హత్య చేసిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. నామక్కల్ జిల్లా సేందమంగళం సమీపం బేలకురిచ్చి వాసి జేపీఎస్ సోమసుందరం. డీఎంకేకు చెందిన ఇతను రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఈయన మనవడు రాజేంద్రన్ (52) రైతు. బేలకురిచ్చిలో నివాసముంటున్నాడు. అతని భార్య సుగుణ (45). ఇద్దరు పిల్లలకు వివాహం కావడంతో ఈ దంపతులు ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి రాజేంద్రన్ ఇంటికి వచ్చిన నలుగురు దుండగులు తలుపు కొట్టారు. అతను బయటకు రావడంతో కత్తులతో దాడి చేసి పారిపోయారు. రాజేంద్రన్ అక్కడికక్కడే మృతి చెందాడు. బేలకురిచ్చి ఎస్పీ సరోజ్ కుమార్ ఠాగూర్, రాసిపురం డీఎస్పీ సెంథిల్ కుమార్, బెలచ్చేరి ఇన్స్పెక్టర్ శివ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజేంద్ర మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించి నిందితుల కోసం గాలిస్తున్నారు. అన్నను హత్య చేసిన తమ్ముడు అరెస్ట్ తిరువారూరు జిల్లా వలంగై మాన్ సమీపం నల్లూరుకు చెందిన రోజాపతికి కార్తీక్ (31), ప్రశాంత్ (29), వినోద్ (27)అనే కుమారులు ఉన్నారు. వినోద్ ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దీంతో కార్తీక్ తనకు ఎందుకు ఇంకా వివాహం చేయలేదని తల్లితో గొడవ పడ్డాడు. కార్తీక్ తీరును ఖండించే క్రమంలో వినోద్ కత్తితో అన్నపై దాడి చేయడంతో అతడు మరణించాడు. వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
అముల్ బేబీ లాంటి బిడ్డ కావాలా?
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘పిల్లలు కావాలా బాబు.. బిడ్డను బట్టి రేటు’ అంటూ వాట్సాప్‌లో సందేశాలిస్తూ చిన్నారులను అమ్మేస్తున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ కేసులో రిటైర్డు నర్సు, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాశీపురం కేంద్రంగా రెండ్రోజులుగా ఒక వాట్సాప్ ఆడియో సందేశం వైరలయ్యింది. ‘బాబు కావాలా.. పాప కావాలా.. తెల్లగా ఉండాలా.. నల్లగా ఉన్నా పరవాలేదా? బిడ్డను బట్టి రేటు. మగబిడ్డకు రూ.4 లక్షల నుంచి రూ.4.50 లక్షలు, ఆడ బిడ్డయితే రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షలు. అముల్ బేబీ లాగా ఉంటే మరో రేటు. బిడ్డ కోసం కొంత అడ్వాన్సు చెల్లిస్తే వెంటనే సిద్ధం చేస్తాను. సంతానం లేని దంపతులకు 30 ఏళ్లుగా బిడ్డలను అమ్ముతున్నాను. రాశీపురం మున్సిపాలిటీ నుంచి కేవలం 25 నుంచి 30 రోజుల్లో బర్త్ సర్టిఫికెట్‌ను కూడా పొందేలా చేస్తాను. ఇందుకు మరో రూ.70 వేలు ఖర్చవుతుంది. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దు’’ అని రిటైర్డు నర్సు అముదవల్లి, ఆమె భర్త సేలం జిల్లా ఓమలూరుకు చెందిన దంపతులతో ఇటీవల జరిపిన సంభాషణ వాట్సాప్ ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో అముదవల్లి (50), ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అంజన్నకు మాల వేస్తూ అనంతలోకాలకు..!
సాక్షి, చెన్నై : ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామి పూజా కార్యక్రమాల్లో అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి విగ్రహానికి పూలమాల వేస్తూ ఓ పూజారి కిందపడడంతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు..18 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంతో ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామి గుడిలో వెంకటేశన్ అనే ఆలయ పూజారి నిత్యపూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 11 అడుగుల ఎత్తైన స్టాండ్‌పై నిల్చుని స్వామివారి విగ్రహానికి మాల వేసే క్రమంలో తూలి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలయ సిబ్బంది వెంకటేశన్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. దేవుడికి పూజలు చేస్తూ పూజారి మృత్యువాత పడడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. -
అంజన్నకు మాల వేస్తూ అనంతలోకాలకు..!
-
రెండు కార్లు ఢీ: అయ్యప్ప భక్తులు సహా నలుగురు మృతి
సేలం (తమిళనాడు): తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామక్కల్-తిరుచెంగోడు జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెరుదురుగా ఢీకొన్న సంఘటనలో ఒక హెడ్‌కానిస్టేబుల్, ముగ్గురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. నామక్కల్ జిల్లా తిరుచెంగోడు సమీపంలోని పిలిక్కల్ పాళయం ప్రాంతానికి చెందిన సెంథిల్ కుమార్ (43) మద్యం నిషేధ విభాగంలో హెడ్ కానిస్టెబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తన కారు (షిఫ్ట్ డిజైర్)లో తిరుచెంగోడుకు బయలుదేరారు. ఈ క్రమంలో పనక్కాడు వద్ద ఎదురుగా వస్తున్న మారుతీ కారు అదుపుతప్పి ఈయన కారును ఢీకొంది. దీంతో సెంథిల్‌కుమార్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన కారులో శబరిమల వెళుతున్న అయ్యప్ప భక్తులు కుమారపాళ్యంకు చెందిన మురుగన్ (45), అతని స్నేహితుడు (శబరిమలై వెళ్లేందుకు దుబాయ్ నుంచి వచారు) శరవణన్ (45)లు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. వీరి కారును నడిపిన డ్రైవర్ వెంకటేశన్ (45) తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అదే కారులో ఉన్న వెంకటేశన్ కుమారుడు హర్షిత్ (12), దుబాయ్‌లో నాలుగో తరగతి చదువుతున్న శరవణన్ కుమార్తె ప్రియదర్శిని (9) తీవ్రంగా గాయపడ్డారు. వారిని తిరుచెంగోడు రూరల్ పోలీసులు ఈరోడ్ ఆస్పత్రికి తరలించారు. -
వాయు పుత్రుడికి భారీ వడ మాల
సేలం (తమిళనాడు): తమిళనాడులోని సేలం జిల్లా నామక్కల్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేసి లక్షా ఎనిమిది వడలతో రూపొందించిన మాలతో అలంకరించారు. నామక్కల్ కోటలో అతి పురాతనమైన 18 అడుగుల ఎల్తైన శ్రీ ఆంజనేయ స్వామి ఏక శిలా విగ్రహం ఉంది. స్వామికి ప్రతి ఏడాది మార్గశిర నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను నిర్వహి స్తారు. ఆదివారం వేకువజామున 3.00 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. 5.00 గంటలకు లక్షా ఎనిమిది వడల తో రూపొందించిన మాలను అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 11 గంటలకు విశేష అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు ఆంజనేయ స్వామికి ముత్తంగి అలంకరణ చేశారు. -
వాయుపుత్రుడికి భారీ వడమాల
సేలం: నామక్కల్ ఆంజనేయ స్వామి ఆలయంలో జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భారీ వడల మాలతో విశేషంగా అలంకరించారు. నామక్కల్ కోటలోని అతి పురాతనమైన ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తులో నిలుచున్న భంగిమలో ఏక శిలా విగ్రహంగా ఉన్న ఆంజనేయ స్వామికి ఏటా మార్గళి నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. వేకువజామున 3 గంటలకు ప్రత్యేక అభిషేకాలు, 5 గంటలకు 1,00,008 వడల మాలను అలంకరించి కర్పూర హారతులు ఇచ్చారు. 11 గంటలకు పసుపు, కుంకుమ, నూనె, షీకాయ్, 1008 లీటర్ల పాలు, పెరుగు, వెన్న, తేనె వంటి వస్తువులు(పంచామృతాలు)తో విశేష అభిషేకం చేశారు. తర్వాత ప్రత్యేక అలంకరణ, మహా దీపారాధన నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ముత్తంగి అలంకరణ చేశారు. లక్ష మందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి రీతిలో అలంకరణ ఏడు కొండలవాడికి బ్రహ్మోత్సవాల సమయంలో నామక్కల్‌కు చెందిన శ్రీ తిరుమల తిరుపతి శ్రీమాన్ నారాయణ నిత్య పుష్ప కైంకర్య సభ ఆధ్వర్యంలో టన్నుల కొలది పుష్పాలను కైంకర్యంగా సమర్పిస్తారు. అదేమాదిరి నామక్కల్ ఆంజనేయుడికి తొలిసారిగా మూడు టన్నుల పుష్పాలు, పండ్లు వంటి వాటిని ఈ సభ కైంకర్యంగా అందించింది. వీటితో శ్రీవారికి మాదిరి ఆంజనేయ స్వామికీ అలంకరించారు. -
పళనికి బ్రహ్మరథం
► సొంత జిల్లాలో ఘన స్వాగతం ► నాలుగు జిల్లాలకు రూ. 331 కోట్లు ► అభివృద్ధి పనులకు శంకుస్థాపన సాక్షి, సేలం: సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా మంగళవారం సొంత జిల్లా సేలంలో అడుగు పెట్టిన పళనిస్వామికి పశ్చిమ తమిళనాడులోని జిల్లాల్లోని అన్నాడీఎంకే వర్గాలు, మద్దతుదారులు, అధికార యంత్రాంగం బ్రహ్మరథం పట్టాయి. పశ్చిమ తమిళనాడులోని నాలుగు జిల్లాల అభివృద్ధికి రూ. 331 కోట్లను సీఎం కేటాయించారు. పలు పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, సేలం తిరుప్పూర్, ధర్మపురి, కృష్ణగిరిలు పశ్చిమ తమిళనాడులోని జిల్లాలుగా పిలుస్తున్నారు. పశ్చిమంలోని సేలం జిల్లా ఎడపాడికి చెందిన పళనిస్వామి ప్రస్తుతం సీఎం కావడం అక్కడి ప్రజలకు ఆనందమే. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం పశ్చిమం మీద పళనిస్వామి దృష్టి పెట్టినట్టున్నారు. ప్రప్రథమంగా మంగళవారం సొంత జిల్లా వేదికగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం సొంత జిల్లాకు వచ్చిన పళనిస్వామికి నామక్కల్, సేలంలో బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానాలు సాగాయి. పార్టీ కేడర్, మద్దతుదారులు, ప్రజలు, అధికార వర్గాలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రూ. 331 కోట్లతో: సేలం కలెక్టరేట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రూ.331 కోట్లతో చేపట్టనున్న పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో సేలం జిల్లాలో రూ.115 కోట్లు, నామక్కల్ జిల్లాలో రూ.61 కోట్లు, ధర్మపురి జిల్లాలో 60 కోట్లు, కృష్ణగిరి జిల్లాలో రూ. 93 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఉన్నాయి. అలాగే, లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. నిర్మాణాలను పూర్తి చేసుకున్న పలు భవనాలను ప్రారంభించారు. పశ్చిమ జిల్లాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించడం లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. గతంలో అమ్మ జయలలిత అసెంబ్లీలో 110 నిబంధనల మేరకు చేసిన ప్రకటనల హామీలనంటినీ నెరవేరుస్తాననన్నారు. -
కాలుదువ్వి.. రంకెలేసి..
► జల్లికట్టు జోష్.. ► పౌరుషాన్ని చాటిన క్రీడాకారులు ► 50 మందికి గాయాలు ► బహుమతులే..బహుమతులు ►అవనీయాపురం, నామక్కల్‌లలో పండుగ సందడి సాక్షి, చెన్నై: తమిళుల సాహసక్రీడ జల్లికట్టు ఆదివారం అవనీయాపురం, నామక్కల్‌లలో వీరత్వాన్ని చాటే రీతిలో సాగింది. రంకెలు కొట్టే బసవన్నల పొగరును అణచివేసే విధంగా తమ సాహసాన్ని ప్రదర్శించి బహుమతుల్ని తన్నుకెళ్లారు. కొన్ని ఎద్దులు క్రీడాకారుల చేతికి చిక్కకుండా తమ యజమానుల్ని విజేతలుగా నిలబెట్టాయి. తమిళుల సంప్రదాయ, సాహసక్రీడగా పేరెన్నికగన్న జల్లికట్టును సంక్రాంతి పర్వదినాల్లో శతాబ్దాల తరబడి దక్షిణాది జిల్లాల్లో కోలాహలంగా జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. అయితే, జంతు ప్రేమికులు కన్నెర్ర చేయడం, సుప్రీంకోర్టు తీర్పు వెరసి రెండేళ్లు జల్లికట్టుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ ఏడాది కూడా సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టుకు దూరంగా ఉన్నా, విద్యార్థి ఉద్యమంతో జల్లికట్టుకు విధించిన నిషేధపు ముడులు తెగాయి. రాష్ట్రం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పడడంతో ఇక, జల్లికట్టులో రంకెలు వేస్తూ ఎద్దులు, క్రీడాకారులు వీరత్వాన్ని చాటుకునే పనిలో పడ్డారు. వీరత్వం చాటిన జల్లికట్టు : ప్రతి ఏటా మదురై జిల్లా అవనీయాపురంలో జరిగే అధికారిక జల్లికట్టుతో సాహస క్రీడకు శ్రీకారం చుడతారు. ఆ దిశగా ఆదివారం ఉదయం ఆరు గంటలకే అవనీయాపురం జనసంద్రంలో మునిగింది. ఎటుచూసినా మదురై, శివగంగై, విరుదునగర్, దిండుగల్, తిరుచ్చి, ఈరోడ్, కరూర్, పుదుకోటై, తేని, తూత్తుకుడి, తంజావూరు జిల్లాల నుంచి వచ్చిన కొమ్ములు తిరిగిన బసవన్నలు బుసలు కొడుతూ కన్పించాయి. తొమ్మిది వందల రిజిస్ట్రేషన్లు రాగా, అందులో ఏడు వందల యాభై ఎద్దులను వైద్య తదితర పరీక్షల అనంతరం జల్లికట్టులో రంకెలు కొట్టేందుకు అనుమతి ఇచ్చారు. ముందుగా టోకెన్లు పొందిన క్రీడాకారులను మాత్రమే క్రీడారంగంలోకి అనుమతించారు. సరిగ్గా ఎనిమిది గంటల సమయంలో రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ ఉదయకుమార్, మదురై జిల్లా కలెక్టర్ వీరరాఘవులు జల్లికట్టును ప్రారంభించారు. తొలుత అవనీయాపురంలోన నాలుగు ఆలయాలకు చెందిన ఎద్దులను కదనరంగంలోకి దించారు. వీటి పొగరును అణచివేయడానికి క్రీడాకారులు తీవ్రంగానే ప్రయత్నించారు. తదుపరి ఒక్కో ఎద్దులను వాడి వాసల్ (జల్లికట్టు జరిగే ప్రవేశద్వారం) నుంచి వదలి పెట్టారు. భద్రత నడుమ: ఎద్దులు జనంలోకి చొచ్చుకు వెళ్లకుండా , ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. కోర్టు ఆగ్రహానికి గురి కాని రీతిలో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. ప్రారంభోత్సవ సమయంలో క్రీడాకారుల చేత నిబంధనల్ని తప్పనిసరిగా పాటించి తీరుతామని కలెక్టర్ వీరరాఘవులు ప్రతిజ్ఞ చేయించారు. భద్రత ఏర్పాట్ల నడుమ మధ్యాహ్నం వరకు జల్లికట్టు సాగగా, క్రీడా కారులు తమ పౌరుషాన్ని ప్రదర్శించారు. చిన్న పొరబాటు వచ్చినా, నిబంధనల్ని ఉల్లంఘించినా అట్టి క్రీడాకారుల్ని తక్షణం బయటకు పంపించేశారు. బహుమతుల జోరు : రంకెలేస్తూ వాడి వాసల్ నుంచి ఒక దాని తర్వాత మరొకటి చొప్పున రంగంలోకి దిగిన ఎద్దుల పొగరును అణచివేస్తూ క్రీడాకారులు తమ పౌరుషాన్ని చాటి బహుమతుల్ని తన్నుకెళ్లారు. గెలిచిన క్రీడాకారులకు సెల్‌ఫోన్ లు, బిందెలు, పాత్రలు, రేడియో సెట్లు, బీరువా, మంచాలు, వాషింగ్ మిషన్లు, ఏసీ, ఫ్యాన్లు, మిక్సీ, సైకిళ్లు, స్టీలు, వెండి పాత్రలు, మోటార్ సైకిళ్లతో పాటు ఆకర్షణీయమైన బహుమతుల్ని నిర్వాహకులు అందజేశారు. క్రీడాకారుల చేతికి చిక్కని బసవన్నలు సైతం ఆకర్షణీమైన బహుమతుల్ని తన్నుకెళ్లాయి. రంకెలేసే బసవన్నలు కొన్నింటిని క్రీడాకారులు పట్టుకోగా, మరికొన్ని ఎద్దులు క్రీడాకారులతో కలసి రంకెలేస్తూ ఉత్సాహంగా ముందుకు వెనక్కు ఉరకలేస్తూ సహకరించాయి. వేలాదిగా తరలి వచ్చిన జనం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జల్లికట్టును ఆనందోత్సాహాలతో తిలకించారు. ఇక్కడ ఎద్దుల దాడిలో 50 మంది క్రీడాకారులతో పాటు ఓ వృద్ధుడు స్వల్పంగా గాయపడ్డారు. ఇక, నామక్కల్లోనూ జల్లికట్టులో బసవన్నులు దూసుకొచ్చాయి. క్రీడాకారులు వాటిని పట్టుకునేందుకు దూసుకెళ్లారు. ఇక, ఈ జల్లికట్టును అనేక మీడియా ప్రత్యక్ష ప్రసారాలు చేయడంతో ఎక్కడ చూసినా వాటిని వీక్షించే జనం ఎక్కువే. అలాగే, అవనీయాపురంలో తమకు పండుగ రోజు అన్నట్టుగా ఆనందోత్సాహాల్లో అక్కడి ప్రజలు మునిగారు. -
సెల్ఫీ కోసం కొండ పై నుంచి పడి..
నమక్కల్: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఓ ఇంజినీరింగ్ విద్యార్ధి పర్వతం అంచున నిలుచుని సెల్ఫీ తీసుకునే క్రమంలో 60 అడుగుల కిందకు పడి ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని నమక్కల్‌కు చెందిన ప్రకాశ్ అనే విద్యార్థి ఆరుగురు హాస్టల్ మేట్స్‌తో కలసి కోలి హిల్స్‌కు వెళ్లాడు. అక్కడి జలపాతంలో అందరూ స్నానం చేసి సెల్ఫీలు తీసుకున్నారు. కాగా ప్రకాశ్ పర్వతం చివరన ఓ చిన్న రాయిపై నించుని పర్వతం వెనుకవైపు ప్రాంతాన్ని కవర్ చేసేలా సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో రాయి దొర్లడంతో ప్రకాశ్ అదుపుతప్పి పర్వతంపై నుంచి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ప్రకాశ్ అక్కడికక్కడే మరణించాడు. -
బస్‌ను లారీ ఢీకొనడంతో ఆరుగురి మృతి
నెల్లూరు/చెన్నై: తమిళనాడులోని నమక్కల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రభుత్వ బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలురువు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా, కావలి ఎన్‌హెచ్5పై గరుడ బస్సు బోల్తాపడింది. పలువురు గాయపడ్డారు. ఈ బస్సు విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ** -
నటి నమితకు తప్పిన ప్రమాదం
నటి నమిత నామక్కల్ సమీపంలో జరిగిన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. నామక్కల్ సమీపంలోని రెడ్డిపట్టి గ్రామంలోని భగవతి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి నామక్కల్ యువ నాటక సంఘం ఆధ్వర్యంలో మణ వాళ్కై అనే నాటకాన్ని ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ నాటకాన్ని ప్రారంభించడానికి చెన్నై నుంచి నటి నమిత, దర్శక నటుడు కె.భాగ్యరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటి నమిత వస్తున్నారని తెలియడంతో ఆ గ్రామ ప్రజలతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనం అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఆ ప్రాంతం జన సంద్రంగా మారింది. సరిగ్గా రాత్రి 9.30 గంటలకు నటి నమిత నాటకాన్ని ప్రారంభించడానికి స్టేజ్‌పైకి వచ్చారు. జనాల కేరింతలతో స్టేజ్ వద్దకు దూసుకొచ్చారు. దీంతో జనం తోపులాటతో స్టేజ్ ఒక పక్కకు ఒరిగిపోయింది. వెంటనే నిర్వాహకులు నటి నమితను స్టేజీపై నుంచి సురక్షితంగా కిందికి దించి పక్కనున్న ఇంటికి తీసుకెళ్లారు. అంబులెన్స్‌ల హడావుడి: నటి నమిత ప్రమాదంలో గాయపడ్డారన్న ప్రచారంతో నామక్కల్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న మూడు అంబులెన్స్‌లు హుటాహుటిన భగవతి ఆలయం వద్దకు చేరుకున్నాయి. నటి నమితను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి పోటీపడ్డాయి. అయితే నమిత తనకెలాంటి గాయాలు అవ్వలేదని చెప్పడంతో అంబులెన్స్‌లు తిరిగి వెళ్లిపోయాయి. జనం మాత్రం నమితను చూడడానికి గుమికూడారు. అనంతరం భగవతి ఆలయం ముందు కొత్తగా మరో స్టేజ్‌ను ఏర్పాటు చేసి నాటకాన్ని ప్రారంభించాల్సిందిగా నిర్వాహకులు నమితను కోరగా ఆమె నిరాకరించారు. చివరికి దర్శకుడు కె.భాగ్యరాజ్ నాటకాన్ని ప్రారంభించారు. మంగళవారం వేకువ జామున నమిత, భాగ్యరాజ్ కారులో చెన్నైకి చేరుకున్నారు. -
రీ పోలింగ్ ప్రశాంతం
సాక్షి, చెన్నై: సేలం, నామక్కల్‌లలో రీ పోలింగ్ శనివారం ప్రశాం తంగా జరిగింది. ఓ చోట ఏజెంట్ల పుణ్యమా అని ఓటింగ్ ఆలస్యం గా ఆరంభం అయింది. మరో చోట విద్యుత్ సరఫరా ఆగడంతో అగచాట్లు పడాల్సి వచ్చింది. రాష్ట్రంతో పాటుగా పుదుచ్చేరిలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలకు గత నెల 24న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు సజావుగా ప్రశాంత పూరిత వాతావరణంలో ముగిశాయి. ఎన్నికలు జరిగిన పది రోజుల తరువాత రెండు చోట్ల రీ పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. సేలం, నామక్కల్ పరిధిలోని రెండు పోలింగ్ బూత్‌లలో ఈ పోలింగ్ జరగనున్నట్టు ఈసీ ప్రకటించింది. అయితే, దీన్ని అక్కడి అభ్యర్థులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు జరిగిన పది రోజుల అనంతరం రీ పోలింగ్‌కు చర్యలేమిటంటూ ప్రశ్నించారు. అయితే, ఈసీ మాత్రం తగ్గలేదు. ఆ బూత్‌లలో ఈవీఎం లు మొరాయించినట్టు, సాంకేతిక లోపం కారణంగానే రీ పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్టు సూచించింది. రీ పోలింగ్ : రీ పోలింగ్‌కు ఈసీ అన్ని చర్యలు తీసుకుంది. సేలం లోక్ సభ పరిధిలోని సెంగలనై రోడ్డులోని మునిసిపల్ స్కూల్ ఆవరణలోని 213 బూత్‌లో, నామక్కల్ లోక్ సభ పరిధిలోని కొట్ట పాలయం పంచాయతీలోని 37వ బూత్‌లో శనివారం ఎన్నికలు జరిగాయి. రీ పోలింగ్‌తో ఆ బూత్‌ల పరిధిలోని ఓటర్లను రప్పించేందుకు రాజకీయ పక్షాలు తీవ్రంగానే కుస్తీలు పట్టాల్సి వచ్చింది. సేలంలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ఆరంభం కావాల్సి ఉండ గా, గంట ఆలస్యం అయింది. ఇందుకు కారణం ఆయా రాజకీయ పక్షాల ఏజెంట్లు రావడంలో నెలకొన్న ఆలస్యం. ఎట్టకేలకు తొలి ఓటును పాప్పాతి అనే మహిళ నమోదు చేశారు. గట్టి భద్రత నడుమ ఈ కేంద్రంలో పోలింగ్ జరిగిం ది. ఉదయాన్నే మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు పన్నెండు గంటల కు ఆ పోలింగ్ బూత్‌లో అత్యధికంగానే ఓట్లు నమోదు అయ్యాయి. ఇక, నామక్కల్ లోక్ సభ పరిధిలోని బూత్‌లో ఉదయాన్నే విద్యుత్ కోత పోలింగ్‌కు ఆటంకం సృష్టించిం ది. ఎట్టకేలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో కాస్త ఆల స్యంగానే ఓటింగ్ ఆరంభం అయింది. నామక్కల్ డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు గాంధీ సెల్వన్, సుందరంలో ఓటింగ్ సరళిని స్వయంగా పర్యవేక్షించారు. రీ పోలింగ్‌లో ఓట్లు వేసిన వారికి మధ్య వేలికి సిరా చుక్కను పెట్టారు. సేలం బూత్‌లో 76 శాతం, నామక్కల్ బూత్‌లో 89 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. ఓటింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఈవీఎంలకు సీల్ వేసి తిరుచంగోడు వివేకానంద కళాశాలకు తరలించారు. -
సేలం, నామక్కల్‌లో నేడే రీపోలింగ్
- అధికార పార్టీ అసంతృప్తి - రీపోలింగ్ అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్న చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సేలం, నామక్కల్ నియోజకవర్గాల్లోని రెండు పోలింగ్ కేంద్రాల్లో శనివారం రీపోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒక లోక్‌సభ నియోజకవర్గానికి గత నెల 24వ తేదీన పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. నాలుగు రోజుల తర్వాత రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అనివార్యమైందని ప్రకటించారు. దీనిపై అధికార అన్నాడీఎంకే ఆగ్రహం, అనుమానం వ్యక్తం చేసింది. సజావుగా జరిగిందని నిర్ణయించిన తర్వాత రీపోలింగ్ అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. ఈసీ మాత్రం తనపాటికి తాను రీపోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. సేలం ఉత్తర లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సెంగలనై రోడ్డులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ బూత్ నెంబర్ 213లో ఈవీఎంలు మొరాయించాయని ఈసీ పేర్కొంది. అలాగే నామక్కల్ లోక్‌సభ నియోజకవర్గంలోని కొట్టపాలయం పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబరు 37లో పోలింగ్ సజావుగా పూర్తయి నా ఈవీఎంలను మూసివేయడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించింది. దీంతో ఈ కేంద్రాల్లో రీపోలింగ్ అవసరమైందని ఈసీ పేర్కొం ది. రీపోలింగ్ కారణంగా అన్ని పార్టీల వారు మరోసారి ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. శనివా రం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు