
సెల్ఫీ కోసం కొండ పై నుంచి పడి..
నమక్కల్: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఓ ఇంజినీరింగ్ విద్యార్ధి పర్వతం అంచున నిలుచుని సెల్ఫీ తీసుకునే క్రమంలో 60 అడుగుల కిందకు పడి ప్రాణాలు కోల్పోయాడు.
తమిళనాడులోని నమక్కల్కు చెందిన ప్రకాశ్ అనే విద్యార్థి ఆరుగురు హాస్టల్ మేట్స్తో కలసి కోలి హిల్స్కు వెళ్లాడు. అక్కడి జలపాతంలో అందరూ స్నానం చేసి సెల్ఫీలు తీసుకున్నారు. కాగా ప్రకాశ్ పర్వతం చివరన ఓ చిన్న రాయిపై నించుని పర్వతం వెనుకవైపు ప్రాంతాన్ని కవర్ చేసేలా సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో రాయి దొర్లడంతో ప్రకాశ్ అదుపుతప్పి పర్వతంపై నుంచి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ప్రకాశ్ అక్కడికక్కడే మరణించాడు.