
సాక్షి, చెన్నై : ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామి పూజా కార్యక్రమాల్లో అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి విగ్రహానికి పూలమాల వేస్తూ ఓ పూజారి కిందపడడంతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు..18 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంతో ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామి గుడిలో వెంకటేశన్ అనే ఆలయ పూజారి నిత్యపూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 11 అడుగుల ఎత్తైన స్టాండ్‌పై నిల్చుని స్వామివారి విగ్రహానికి మాల వేసే క్రమంలో తూలి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలయ సిబ్బంది వెంకటేశన్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. దేవుడికి పూజలు చేస్తూ పూజారి మృత్యువాత పడడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment