ఆందోళన చేస్తున్న రైతులు
సాక్షి, తమిళనాడు: గ్రీన్ వేకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన 32 మంది రైతులపై కేసులు నమోదుచేశారు. సేలం–చెన్నై మధ్య గ్రీన్ వే పథకాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఆ కేసును త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఇటీవల అప్పీల్ చేసింది. దీనిపై సేలం జిల్లా లాలికాల్ పట్టిలో ఆదివారం ఆందోళన చేసిన 21 మంది రైతులపై మల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా కుల్లంపట్టిలో మరో 11 మంది రైతులపై కారిపట్టి పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి సొంత పొలంలో భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ సోమవారం సేలం జిల్లా అయోద్యపట్నంలో 7వ మైల్, రామలింగపురంలో రైతులు తమ ఇళ్ల ముందు నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. చదవండి: విషమంగా డీఎంకే ఎమ్మెల్యే ఆరోగ్యం
Comments
Please login to add a commentAdd a comment