సాక్షి, చెన్నై: బీజేపీ రాష్ట్ర నిర్వాహకురాలు, నటి జయలక్ష్మిపై తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఇరుగంబాక్కం వెంకటేష్ నగర్‌లో నివసిస్తున్న ప్రముఖ గీత రచయిత స్నేహన్, 2015లో స్నేహం ఫౌండేషన పేరుతో స్వచ్ఛంద సేవ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టు తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా బీజేపీ నిర్వాహకురాలు నటి జయలక్ష్మి బయట స్నేహం ట్రస్టు పేరుతో డబ్బులు వసూలు చేస్తూ రూ.కోట్ల మోసానికి పాల్పడుతున్నట్లు తెలిసిందని ప్రముఖ గీత రచయిత స్నేహన్, నటి జై లక్ష్మీభాయి గత ఆగస్టు 5వ తేదీన చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో స్నేహన్ ఆరోపణలను ఖండిస్తూ నటి జయలక్ష్మి ఆగస్టు 8వ తేదీన చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆయనపై ఫిర్యాదు చేశా రు. ఈ విషయం తెలుసుకున్న గీత రచయిత స్నేహన్ చెన్నై హైకోర్టులో జయలక్ష్మిపై పిటీషన్ దాఖలు చేశారు. ఆయన పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం నటి జయలక్ష్మి మోసానికి పాల్పడినట్టు ఆధారాలుంటే ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన తిరుమంగళం పోలీసులు నటి జయలక్ష్మిపై 420, 465 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని బుధవారం ఆమెకు సమన్లు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment